
బాలీవుడ్ నటి పాత్రలేఖ తాజాగా గుడ్ న్యూస్ షేర్ చేసింది. తాను తల్లి కాబోతున్నట్లు ‘బేబీ ఆన్ ది వే’ అనే క్యాప్షన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ వార్త తెలియగానే నెటిజన్లు, సినీ ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Key Points
బాలీవుడ్ నటి పాత్రలేఖ గుడ్ న్యూస్ షేర్ చేసింది.
‘బేబీ ఆన్ ది వే’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.
నెటిజన్లు, సినీ ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
పాత్రలేఖ, రాజ్‌కుమార్ రావు దంపతులకు త్వరలోనే బిడ్డ రాబోతుంది.
పాత్రలేఖ గుడ్ న్యూస్
బాలీవుడ్ హీరోయిన్ పాత్ర లేఖ(Patralekha) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు నాను కి జాను, లవ్ గేమ్స్, బద్నామ్ గలి, సిటీ లైట్స్ వంటి చిత్రాల్లో నటించి ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. ఇక ఇటీవల ప్రతీక్ గాంధీ సరసన ‘ఫూలే’ (Phule)మూవీలో నటించి మెప్పించింది. ఈ సినిమా ఏప్రిల్ 25న విడుదలై ప్రేక్షకులను అలరించింది. ఇదిలా ఉంటే.. పత్రలేఖ పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. పాత్రలేఖ, బాలీవుడ్ హీరో రాజ్ కుమార్ రావు(Raj Kumar Rao)ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే వీరికి వివాహం జరిగి మూడేళ్లు అవుతున్నప్పటికీ పిల్లలు మాత్రం లేరు.
సోషల్ మీడియాలో వైరల్
ఇదిలా ఉంటే.. తాజాగా, పాత్రలేఖ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా గుడ్ న్యూస్ ప్రకటించింది. తాను తల్లి కాబోతున్నట్లు వెల్లడిస్తూ ‘బేబీ ఆన్ ది వే’ అనే క్యాప్షన్ జత చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన నెటిజన్లు, సినీ సెలబ్రిటీలు వరుణ్ ధావన్, ఉర్ఫీ జావేద్, సునీతా రాజ్‌వర్, భూమి పెడ్నేకర్ కంగ్రాట్స్ చెబుతున్నారు. కాగా, రాజ్ కుమార్ సినిమాల విషయానికొస్తే..ప్రస్తుతం ఆయన నటించిన లేటెస్ట్ మూవీ ‘మాలిక్’. ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రాన్ని పుల్కిట్ తెరకెక్కించారు. ఇందులో మానుషి చిల్లర్ హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ సినిమాలో రాజ్ కుమార్ రావు గ్యాంగ్‌స్టర్‌గా చేస్తున్నాడు. దీనిని టిప్స్ ఫిల్మ్స్, నార్తర్ లైట్స్ ఫిల్మ్స్ బ్యానర్స్‌పై కుమార్ తౌరానీ, జే షెవాక్రమణి నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూలై 11న థియేటర్స్‌లోకి రాబోతుంది.
నెటిజన్ల శుభాకాంక్షలు
A post shared by RajKummar Rao (@rajkummar_rao)
పాత్రలేఖ తల్లి కాబోతున్న సంతోషకరమైన వార్తతో, ఆమె అభిమానులు మరియు సినీ ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ కొత్త అధ్యాయం వారి జీవితంలో మరింత ఆనందాన్ని నింపుతుంది.


