|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మీనాక్షి నటరాజన్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు.. ధర్మాసనం సెన్సేషనల్ కామెంట్స్

Published: 12-06-2026, 5:31 AM
మీనాక్షి నటరాజన్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు.. ధర్మాసనం సెన్సేషనల్ కామెంట్స్

రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్‌కు చుక్కెదురైంది. మీనాక్షి తరఫున ప్రముఖ సీనియర్ అడ్వొకేట్, ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ (Abhishek Manu Singhvi) వాదనలను వినిపించారు. అయితే, ఈ క్రమంలోనే ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది. నామినేషన్ పత్రాల తిరస్కరణలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్న ఏ తీర్పు అయినా ఉంటే చూపాలని పిటిషనర్ తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీని కోరింది. ఒక్కసారి నామినేషన్‌ తిరస్కరణకు గురైతే దానిని పరిష్కరించుకొనేందుకు కేంద్ర ఎన్నికల సంఘం వద్దకు వెళ్లాల్సిందేనని, తాము ఇందులో ఏమాత్రం జోక్యం చేసుకోలేమని కోర్టు స్పష్టం చేసింది.

అనంతరం మధ్యలో కల్పించుకున్న అభిషేక్ మను సింఘ్వీ మీనాక్షి నటరాజన్‌పై ఎలాంటి ఎఫ్‌ఐఆర్ నమోదు కాలేదని కోర్టుకు విన్నవించారు. కోర్టు కూడా ఆ కేసును ఇంకా విచారణకు స్వీకరించలేదని, తన క్లయింట్‌కు కోర్టు పంపింది ప్రాథమిక విచారణ నోటీసు మాత్రమేనని తెలిపారు. ప్రజాప్రాతినిధ్య చట్టం‌లోని సెక్షన్ 33A ప్రకారం.. ఓ అభ్యర్థి తనపై ఉన్న కేసులను అఫిడవిట్‌లో కోర్టు సదరు కేసును స్వీకరించి, కనీసం 2 శిక్ష పడే అవకాశం ఉన్న సెక్షన్ల కింద చార్జీలు (Charges) ఫ్రేమ్ చేసినప్పుడు మాత్రమే మెన్షన్ చేయాలని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లగా.. వాదనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.