|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Actress : వృద్ధాశ్రమంలో చేరిన ప్రముఖ నటి… ఎవరూ సాయం చేయలేదా?

Published: 13-12-2025, 7:48 AM
Actress : వృద్ధాశ్రమంలో చేరిన ప్రముఖ నటి… ఎవరూ సాయం చేయలేదా?
  • ప్రముఖ నటి వాసుకి (పాకీజా) ఆత్రేయపురం వృద్ధాశ్రమంలో చేరారు.
  • ‘అసెంబ్లీ రౌడీ’ పాకీజా క్యారెక్టర్ తో ఈమె బాగా ప్రాచుర్యం పొందారు.
  • మోహన్ బాబు కుటుంబం వాసుకి కంటి ఆపరేషన్ కు సాయం చేసింది.
  • మెగా బ్రదర్స్, సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఆర్థిక సహాయం అందించారు.

ఒకప్పుడు ప్రముఖ లేడీ కమెడియన్ గా రాణించిన నటి వాసుకి (పాకీజా) వృద్ధాశ్రమంలో చేరడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పూట గడవక దీనస్థితికి చేరిన ఆమెకు, మోహన్ బాబు కుటుంబంతో పాటు మెగా బ్రదర్స్, సీఎం చంద్రబాబు నాయుడు ఆర్థిక సాయం అందించారు.

వృద్ధాశ్రమంలో చేరిన ప్రముఖ నటి ఎవరు?

Actress : దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలనే సామెత సినిమా ఇండస్ట్రీలో చక్కగా సరిపోతుంది. మంచి ఫేమ్ ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకుంటే, ఆ తర్వాత దీనస్థితికి దిగజారే దిక్కుమాలిన పరిస్థితిని ఎదుర్కోవాల్సిన అవసరం రాదు. అయితే కొంతమంది నటీనటులకు ఎంత ఫేమ్ వచ్చినా సరే రెమ్యూనరేషన్ మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది. అలాంటి నటీమణులు పాపులారిటీ తగ్గిన తర్వాత దారుణమైన పరిస్థితిలో జీవిస్తున్నారు. ఇప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి అత్యంత దీనమైన స్థితిలో ఉన్న నటులను ఎంతోమందిని చూసాము. తాజాగా మరో నటి ఓ వృద్ధాశ్రమంలో చేరడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. దీంతో సినిమా పెద్దలు ఆమెకు సహాయం చేయలేదా అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఇంతకీ వృద్ధాశ్రమంలో చేరిన ఆ నటి ఎవరు? అనే వివరాల్లోకి వెళ్తే…

పాకీజా అనే పేరు 90 కిడ్స్ బాగా తెలుసు. గతంలో తెలుగు సినిమాల్లో కమెడియన్ గా ఓ వెలుగు వెలిగిన ఈవిడ ఒరిజినల్ పేరు వాసుకి. అయితే ‘అసెంబ్లీ రౌడీ’ సినిమాలోని పాకీజా క్యారెక్టర్ తో బాగా ఫేమస్ కావడంతో సొంత పేరు కంటే ఆ క్యారెక్టర్ పేరుతోనే ఆమె తెలుగు ప్రేక్షకుల మనసులో నిలిచిపోయారు. ఇక ఆ తర్వాత కూడా పలు సినిమాల్లో లేడీ కమెడియన్ గా నటించిన ఈవిడ ప్రస్తుతం దీనస్థితిలో ఉన్నట్టు సమాచారం. చెరదీసి చూసే  వాళ్ళు లేక తాజాగా ఆవిడ ఒక వృద్ధాశ్రమంలో చేరడం సంచలనంగా మారింది. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం బొబ్బర్లంకలోని ఒక వృద్ధాశ్రమంలో వాసుకి చేరారు. ఒకప్పుడు ఎన్నో సినిమాల్లో నటించిన తాను… ఇండస్ట్రీకి దూరమైన తర్వాత పూట గడవని స్థితిని చేరుకున్నాను అని చెప్పిన వీడియో తెగ వైరల్ అయింది. ఈ వీడియోని చూసి ఆమె దుర్భర జీవితం గురించి తెలుసుకున్న శ్రీరామ వృద్ధాశ్రమం నిర్వాహకుడు జల్లి కేశవరావు ఆమెకు ఆశ్రయం కల్పించినట్టు తెలుస్తోంది.

పాకీజా: ఒకప్పటి స్టార్ కమెడియన్ దీనస్థితి

వాసుకికి సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా సహాయం అందినట్టు తెలుస్తోంది. తనను ఇండస్ట్రీకి పరిచయం చేసిన గురువు మోహన్ బాబు కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పుకొచ్చారు ఆవిడ. మంచు విష్ణు తన పరిస్థితిని తెలుసుకొని, కళ్ళకు ఆపరేషన్ చేయించడానికి సాయం అందించారని అన్నారు వాసుకి. అంతేకాదు మెగా బ్రదర్స్ పవన్ కళ్యాణ్, చిరంజీవి, నాగబాబు కలిసి రూ, 400000 ఆర్థిక సాయం అందించారని వాసుకి అలియాస్ పాకీజా వెల్లడించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ కూడా తనకు సహాయం చేసినట్టు ఆమె తెలిపారు.

1991లో ‘అసెంబ్లీ రౌడీ’ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది వాసుకి. ఆ తర్వాత పెదరాయుడు, రౌడీ గారి పెళ్ళాం, మేజర్ చంద్రకాంత్, పుణ్యభూమి నాదేశం వంటి సినిమాలలో కనిపించారు. ఇక ఇటీవలే నటి పావలా శ్యామలా ఇలాంటి దీనస్థితి కారణంగా ఆత్మహత్య చేసుకోబోగా, ఆమెను ఓ వృద్ధాశ్రమంలో చేర్పించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో నటీ వృద్ధాశ్రమంలో చేరడంపై తెలుగు ఆడియన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సినీ ప్రముఖులు, రాజకీయ నాయకుల చేయూత

Read Also : అనుకున్న దానికంటే ముందుగానే ‘దేఖ్ లేంగే’ సాంగ్ రిలీజ్… కానీ క్రేజీ ట్విస్ట్

ఒకప్పుడు వెండితెరపై అలరించిన నటి వాసుకి కష్టకాలంలో ఉన్నప్పుడు సినీ పరిశ్రమ పెద్దలు, రాజకీయ నాయకులు మానవతా దృక్పథంతో ఆదుకోవడం ప్రశంసనీయం. దీన్ని బట్టి కష్టాల్లో ఉన్నవారికి సమాజం అండగా నిలుస్తుందని స్పష్టమవుతోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.