|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Actress Jyothi : చిరంజీవిని నేను రిజెక్ట్ చేసానా.. ఆయనతో సినిమా చేసొచ్చి అద్దంలో నన్ను నేను చూసుకొని తూ అని..

Published: 15-11-2025, 10:20 PM
Actress Jyothi : చిరంజీవిని నేను రిజెక్ట్ చేసానా.. ఆయనతో సినిమా చేసొచ్చి అద్దంలో నన్ను నేను చూసుకొని తూ అని..

క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, బిగ్ బాస్‌తో గుర్తింపు పొందిన నటి జ్యోతి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకుంది. చిరంజీవితో ‘అందరివాడు’ సినిమాలో నటించినప్పుడు, ఆయనను రిజెక్ట్ చేసే సీన్ చేశాక తనకేం అనిపించిందో వివరించింది.

Key Points

1

నటి జ్యోతి బిగ్ బాస్ ద్వారా మంచి గుర్తింపు పొందింది.

2

చిరంజీవితో 'అందరివాడు' సినిమాలో నటించిన అనుభవం పంచుకుంది.

4

ఆ సీన్ చేసి ఇంటికొచ్చాక అద్దంలో చూసి తనను తాను తిట్టుకున్నానని వెల్లడించింది.

జ్యోతి తాజా ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు

Actress Jyothi : పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న జ్యోతి బిగ్ బాస్ తో మరింత ఫేమ్ తెచ్చుకుంది. కానీ ఇటీవల సినిమాలకు చిన్న గ్యాప్ ఇచ్చినా సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటుంది. చాన్నాళ్లకు జ్యోతి మళ్ళీ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జ్యోతి పలు ఆసక్తికర విషయాలు తెలిపింది.(Actress Jyothi)

ఈ ఇంటర్వ్యూలో చిరంజీవి ప్రస్తావన రాగా తను చిరంజీవితో చేసిన సినిమా గురించి మాటాడింది.

చిరంజీవితో ‘అందరివాడు’ సినిమా అనుభవం

ఆ సీన్ తర్వాత అద్దంలో చూసుకొని జ్యోతి ఆవేదన

జ్యోతి మాట్లాడుతూ.. చిరంజీవి గారితో అందరివాడు సినిమా చేశాను. మేనేజర్ కాల్ చేసి చిరంజీవి సినిమా ఒక్కటే సీన్ ఉంది అన్నారు. చిరంజీవి సినిమా అనగానే ఓకే చెప్పాను. అందులోనూ చిరంజీవి గారి కాంబినేషన్ ఒక్కటే సీన్ అన్నారు. సరే అని వెళ్ళా. తీరా అక్కడికి వెళ్లి చూస్తే పెళ్లి చూపులు సీన్. నేను చిరంజీవి గారిని రిజెక్ట్ చేసి ఎవరో బండోడిని లవ్ చేస్తాను అంట. ఆ సీన్ చేయాల్సి వచ్చింది. ఆ సీన్ చేసి ఇంటికొచ్చాకా అద్దం ముందు నించొని తూ అని నన్ను నేను తిట్టుకున్నా. నేను చిరంజీవి ని రిజెక్ట్ చేసానా అనిపించింది. చిరంజీవి ని పక్కన పెట్టుకొని ఎవరో బండోడ్ని లవ్ చేయడం ఏంట్రా అనుకున్నా అని తెలిపింది.

చిరంజీవిని రిజెక్ట్ చేసే సీన్ చేశాక అద్దంలో చూసి జ్యోతి ఆవేదన వ్యక్తం చేయడం, ఆ పాత్రపై ఆమెకున్న భావోద్వేగాన్ని, చిరంజీవి పట్ల ఆమెకున్న గౌరవాన్ని స్పష్టం చేస్తుంది. ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.