|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఖుష్బూ ఇంట్లో పెళ్లి వేడుక: మోదీకి స్వయంగా ఆహ్వానం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Published: 30-05-2026, 5:30 AM
ఖుష్బూ ఇంట్లో పెళ్లి వేడుక: మోదీకి స్వయంగా ఆహ్వానం.. వైరల్ అవుతున్న ఫోటోలు!
  • సీనియర్ నటి ఖుష్బూ కూతురు అవంతిక వివాహం త్వరలో జరగనుంది.
  • ఖుష్బూ, సుందర్ సి దంపతులు ప్రధాని మోదీని కలిసి పెళ్లికి ఆహ్వానించారు.
  • మోదీకి శుభలేఖ ఇస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
  • అవంతిక మలయాళం, తమిళ చిత్ర పరిశ్రమల్లో అరంగేట్రం చేయనుంది.

సీనియర్ నటి ఖుష్బూ ఇంట్లో పెళ్లి భాజాలు మోగనున్నాయి. ఆమె కూతురు అవంతిక త్వరలో వివాహం చేసుకోబోతోంది. ఈ శుభకార్యానికి ప్రధాని నరేంద్ర మోదీని స్వయంగా ఆహ్వానించడానికి ఖుష్బూ తన కుటుంబంతో కలిసి ఢిల్లీ వెళ్లారు. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ప్రధాని మోదీకి ఖుష్బూ కుటుంబం ఆహ్వానం

Kushboo : సీనియర్ నటి ఖుష్బూ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.. ఒకప్పుడు ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు అందరితో నటించిన ఈ అమ్మడు ప్రస్తుతం హీరోలకు తల్లిగా, సోదరిగా నటిస్తూ బిజీగా ఉంది. అంతే కాదు బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు స్పెషల్ షోలలో కూడా జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉండగా నటి ఖుష్బూ ఇంట్లో పెళ్లి భాజాలు మోగబోతున్నాయి. ఈమె కూతురు త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతుంది. తన పెళ్లి శుభలేఖను భారత ప్రధాని నరేంద్రమోదీకి ఇవ్వడానికి కుటుంబ సభ్యులతో కలిసివెళ్లారు. మోదీకి శుభలేఖ ఇస్తున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

సినీ నటి ఖుష్బూ, సుందర్ సి దంపతుల కుమార్తె అవంతిక, ఆమెకు కాబోయే భర్త శ్రవణ్ శ్రీనివాసన్ తో భారత ప్రధాని మోదీని కలిశారు.. త్వరలోనే పెళ్లి జరగబోతుందని శుభలేఖ ఇవ్వడానికి వెళ్లారు. మోదీతో దిగిన ఫోటోలను సినీ నటి ఖుష్బూ సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలియజేశారు. ఆ పోస్ట్ లో.. ఈరోజు ఢిల్లీలో భారత గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని కలుసుకునే అదృష్టం మాకు లభించింది. తన కూతురు అవంతిక, అల్లుడు శ్రీనివాస్ శ్రవణ్ జరగబోయే వివాహనికి నా భర్త సుందర్, నేను కలిసి ఆయనకు ఆహ్వానం అందించాము. ఆయన మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకున్నారు.. కొత్తజంటని ఆశీర్వదించారు అని ఆమె తన ట్విట్టర్ అకౌంట్లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఆ ట్వీట్ సోషల్ మీడియాzలో బాగా వైరల్ అవుతుంది.. ఖుష్బూ ఇంట పెళ్లి భాజాలు మోగనున్నాయని తెలిసి అభిమానులు కాబోయే నూతన జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

వైరల్ అవుతున్న పెళ్లి శుభలేఖ ఫోటోలు

సీనియర్ హీరోయిన్ ఖుష్బూ, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుందర్ సి దంపతులకు ఇద్దరు కూతుర్లు అన్న విషయం తెలిసిందే. పెద్ద కుమార్తె ఆనందిత, ఈమె ఇప్పటికే ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి నిర్మాతగా పలు సినిమాలను నిర్మించబోతుంది. రెండవ కూతురు అవంతిక.. త్వరలోనే ఈమె పెళ్లి చేసుకోబోతుంది. అవంతిక కూడా త్వరలోనే అరంగేట్రం చేయనున్నారు. ముఖ్యంగా మలయాళ చిత్ర పరిశ్రమలో ఆరంభం అనే మూవీతో అడుగు పెట్టబోతుంది. అలాగే తమిళంలో కూడా ఓ సినిమా చేయబోతుంది. ధనుష్ మేనల్లుడు పావిష్ నారాయణ్ తో కలిసి అవంతిక తమిళంలో స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమాలో ఈమె నటించబోతుంది.. మరి పెళ్లి తర్వాత సినిమాల్లో నటిస్తుందా లేదా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక కుష్బూ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం తమిళంలో అలాగే తెలుగులో పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తుంది. వీటితో పాటుగా తెలుగు టీవీ చానల్స్ లలో ప్రసారమవుతున్న టాప్ షోలలో జడ్జిగా వ్యవహరిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది… అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఈమె తన లేటెస్ట్ ఫోటోలను, ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులని ఆకట్టుకుంటుంది..

We had the honor of meeting the Honourable Prime Minister of India, Shri @narendramodi ji in Delhi today. My husband, Mr. Sundar C, and I extended an invitation for our daughter’s upcoming wedding to Mr. Shravan Sreenivasan.

ఖుష్బూ కూతురు అవంతిక సినీ అరంగేట్రం

The Prime Minister graciously blessed the couple, and… pic.twitter.com/jOex8pcnm3

— KhushbuSundar (@khushsundar) May 29, 2026

ఖుష్బూ కూతురు పెళ్లి వార్తతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని మోదీ ఆశీస్సులు పొందిన నూతన వధూవరులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అవంతిక సినీ అరంగేట్రంపై కూడా ఆసక్తి నెలకొంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.