
📌 Key Points
- కుంభమేళాలో పూసలమ్మాయి మోనాలిసా భోసలే, నటుడు ఫర్మాన్ ఖాన్‌ల ప్రేమ వివాహం సంచలనం!
- కేరళలోని అరుమనూర్ శ్రీ సైనార్ దేవా ఆలయంలో హిందూ సంప్రదాయం ప్రకారం వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.
- పెళ్లిని ‘లవ్ జీహాద్’ అంటూ విమర్శించిన వారిపై మోనాలిసా ఘాటుగా స్పందన.. వివరణ ఇచ్చారు.
- ప్రేమకు మతం అడ్డుకాదని.. ఇద్దరం మతం మార్చుకోలేదని ఫర్మాన్ ఖాన్ స్పష్టం చేశారు.
సోషల్ మీడియా సెన్సేషన్ మోనాలిసా భోస్లే వివాహం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఆమె నటుడు ఫర్మాన్ ఖాన్‌ను పెళ్లాడటం, ఆపై వచ్చిన విమర్శలకు గట్టిగా సమాధానం ఇవ్వడం సంచలనంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్దాం!
గుడిలో హిందూ సంప్రదాయంలో వివాహం
గత ఏడాది ఉత్తరప్రదేశ్‌లో జరిగిన కుంభమేళాలో పూసలు అమ్ముతూ, తన అందంతో సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారిన మోనాలిసా భోసలే పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. తన ప్రియుడు, నటుడు ఫర్మాన్ ఖాన్‌ను కేరళలోని తిరువనంతపురం సమీపంలో ఉన్న అరుమనూర్ శ్రీ సైనార్ దేవా ఆలయంలో హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకుంది. గత ఆరు నెలలుగా ప్రేమలో ఉన్న ఈ జంట, పెద్దలను ఎదిరించి మరి ఒక్కటయ్యారు. మోనాలిసా ఇండోర్ నివాసి కాగా, ఫర్మాన్ ఖాన్ ఉత్తరప్రదేశ్ వాసి. వీరిద్దరూ కలిసి ‘నాగమ్మ’ అనే మలయాళ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఈ విషయాన్ని పెద్దలకు చెప్పినప్పటికీ వారు ఒప్పుకోకపోవడంతో గుడిలో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. అయితే ఈ పెళ్లిని దర్శకుడు సనోజ్ మిశ్రా ‘లవ్ జీహాద్’ అంటూ పెట్టిన పోస్ట్ నెట్టింట సంచలనంగా మారింది.
దీంతో నెటిజన్లు కూడా అదే ఫాలో అవుతూ.. పలు విమర్శలు చేస్తున్నారు. ఈక్రమంలో.. తాజాగా, తన పెళ్లిపై వస్తున్న ఆరోపణలపై మోనాలిసా ఘాటుగా స్పందించింది. “మా పెళ్లిపై ఇలాంటి ముద్రలు వేయకండి. నేను మనస్ఫూర్తిగా, పూర్తి ఇష్టంతో హిందూ ఆచారాల ప్రకారమే ఆలయంలో వివాహం చేసుకున్నాను. మాకు అన్ని మతాల పట్ల సమాన గౌరవం ఉంది. ఒక మేజర్‌గా నాకు ఇష్టమైన వ్యక్తిని పెళ్లాడే హక్కు నాకుంది” అని ఆమె స్పష్టం చేసింది. తాము ఎవరూ మతం మార్చుకోలేదని, ప్రేమలో మత మార్పిడి అవసరం లేదని ఫర్మాన్ ఖాన్ కూడా స్పష్టం చేశారు. మోనాలిసా మైనర్ అంటూ జరుగుతున్న ప్రచారాన్ని కూడా ఖండిస్తూ ఆమె ఆధార్, బర్త్ సర్టిఫికేట్లను మీడియాకు చూపించారు. కేరళ ప్రభుత్వ K-SMART యాప్ ద్వారా వీరి వివాహం చట్టబద్ధంగా రిజిస్టర్ చేసుకున్నారు.
‘లవ్ జీహాద్’ అంటూ విమర్శలు
స్పందించిన మోనాలిసా, ఫర్మాన్ ఖాన్
మోనాలిసా, ఫర్మాన్ ఖాన్‌ల వివాహం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఈ జంట తమ ప్రేమను గెలిపించుకున్న తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


