
కరూర్ ఘటన తర్వాత సినీ నటుడు విజయ్‌పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో సినీ నటి ఓవియా విజయ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయ్ యువతను తప్పుదోవ పట్టిస్తున్నారని, తమిళనాడును అల్లర్ల భూమిగా మారుస్తున్నారని ఆమె ఆరోపించారు.
Key Points
కరూర్ ఘటన తర్వాత సినీ నటుడు విజయ్‌పై తీవ్ర వ్యతిరేఖత కనిపిస్తుంది.
ప్రమాదం జరిగిన తర్వాత విజయ్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేదు, కేవలం ఒక సోషల్‌మీడియా పోస్ట్ మాత్రమే షేర్ చేశారు.
సినీ నటి ఓవియా: విజయ్ యువతను తప్పుదారి పట్టిస్తూ, తమిళనాడును అల్లర్ల భూమిగా మారుస్తున్నాడు.
ఓవియాను టార్గెట్ చేస్తూ విజయ్ ఫ్యాన్స్ సోషల్‌మీడియాలో భారీగా పోస్ట్‌లు షేర్ చేస్తున్నారు.
ఓవియా సంచలన వ్యాఖ్యలు
కరూర్ ఘటన తర్వాత సినీ నటుడు, టీవీకే అధినేత విజయ్‌పై తీవ్రమైన వ్యతిరేఖత కనిపిస్తుంది. తమిళనాడులో తన ఉణికి కూడా ప్రమాదంలో పడింది. ప్రమాదం జరిగిన తర్వాత ఆయన ఇప్పటికీ కూడా మీడిమా ముందుకు వచ్చి మాట్లాడలేదు. కనీసం ఒక వీడియో రూపంలో కూడా స్పందించ లేదు. కేవలం సోషల్‌మీడియాలో ఒక పోస్ట్ మాత్రమే షేర్ చేశారు. దీంతో నెటిజన్లు నుంచి కూడా మిశ్రమ స్పందన వస్తుంది.
విజయ్ మౌనంపై విమర్శలు
ఇప్పటికే విజయ్‌ని అరెస్ట్ చేయాలంటూ సినీ నటి ఓవియా సోషల్‌మీడియాలో ఒక పోస్ట్ పంచుకుంది. అయితే, తాజాగా ఆమె మరోసారి ఇలా రియాక్ట్ అయింది. కరూర్ సంఘటన తర్వాత, రజనీకాంత్ సర్, అజిత్ సర్, సూర్య సర్ అభిమానుల మీద నాకు గౌరవం పెరిగింది. వారిలో చాలామంది సరైన మార్గంలో వెళ్తున్నారు. కానీ, విజయ్ యువతను తప్పుదారి పట్టిస్తున్నారు. టీవీకే ప్రచార ప్రధాన కార్యదర్శి ఆధవ్ అర్జున చాలా ప్రమాదకరమైన ట్వీట్లు చేస్తూ.. హింసను సృష్టిస్తున్నాడు. అతను తమిళనాడును అల్లర్ల భూమిగా మారుస్తున్నాడు.’ అంటూ ఆమె పేర్కొన్నారు
అభిమానుల మధ్య మాటల యుద్ధం
విజయ్ అభిమానులపై కూడా తమిళనాడులో విమర్శలు వస్తున్నాయి. విజయ్‌కు వ్యతిరేఖంగా ఎవరైనా మాట్లాడితే వారు బూతులతో ఎదురుదాడికి దిగుతున్నారని చెబుతున్నారు. సోషల్‌మీడియాలో వారికి ఇష్టం వచ్చినట్లు ఫేక్ ఫోటోలు క్రియేట్ చేసి వైరల్ చేస్తున్నారని మరికొందరు అంటున్నారు. ఇప్పటికే ఓవియాను టార్గెట్ చేస్తూ విజయ్ ఫ్యాన్స్ భారీగా పోస్ట్‌లు షేర్ చేస్తున్నారు.
విజయ్ అభిమానులు ఓవియాను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ వివాదం ప్రస్తుతం తమిళ రాజకీయాలు, సినీ వర్గాలలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉంది.


