
టాలీవుడ్ నటి రెజీనా కాసండ్రా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారాయి. మిష్టి దోయ్ తినాలనే కోరికను నియంత్రించుకోలేక, తాను ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పిన విషయాన్ని ఓ షోలో వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె చేసిన ఈ షాకింగ్ కామెంట్స్ వివరాలు ఇక్కడ చూడండి.
Key Points
టాలీవుడ్ నటి రెజీనా కాసండ్రా ‘శివ మనసులో శృతి’తో సినీ రంగ ప్రవేశం చేసింది.
తాజాగా ఓ టీవీ షోలో తను ప్రెగ్నెంట్ అంటూ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
మిష్టి దోయ్ తినాలని కోరికతో, దుకాణంలో తాను ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పిన రెజీనా.
ఆహార క్రేవింగ్స్ కంట్రోల్ చేసుకోలేకపోయానని హీరోయిన్ బహిరంగంగా వెల్లడించింది.
రెజీనా కాసండ్రా కెరీర్ జర్నీ
టాలీవుడ్ హీరోయిన్ రెజీనా కాసండ్రా(Regina Cassandra) ‘శివ మనసులో శృతి’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించిన ఆమె భాషతో సంబంధం లేకుండా వరుస ప్రాజెక్ట్స్ చేసింది. ఇక గత ఏడాది ‘ఉత్సవం’తో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం బ్లాక్ బస్టర్ హిట్ సీక్వెల్ ‘అమ్మను-2’ పనుల్లో ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది. ఈక్రమంలో.. తాజాగా, ఓ షోలో పాల్గొన్న రెజీనా తను ప్రెగ్నెంట్ అయినట్లు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
మిష్టి దోయ్ కోసం ప్రెగ్నెన్సీ అబద్ధం
ఇటీవల శ్రీముఖి హోస్ట్ చేస్తున్న చెఫ్ మంత్ర షోలో పాల్గొని షాకింగ్ విషయాలు చెప్పింది. ‘‘ఫుడ్ అనేది నా కోసం ఓ అడ్వెంచర్‌లా ఉంటుంది. ఏం తినాలో, ఎంత తినాలో, ఎప్పుడు తినాలో నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. బెంగళూరులో ఉన్నప్పుడు ఒక రాత్రి తనకు చాలా ఇష్టమైన “మిష్టి దోయ్” (Bengali Sweet) తినాలని బాగా అనిపించిందట. దానికోసం ఎన్నో స్వీట్ షాపులు తిరిగిందట. కానీ, ఎక్కడా దొరకలేదని చెప్పింది. చివరికి ఒక షాప్‌లో ఆ స్వీట్ కనిపించినా అప్పటికే షాప్ మూసే టైమ్ అయిపోయింది. సేల్స్ బాయ్ ‘ఇప్పుడే షాప్ క్లోజ్ అయిపోయింది, సర్వ్ చేయలేం’ అన్నారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కామెంట్స్
దీంతో ఏం చేయాలో అర్థం కాక.. నేను ప్రెగ్నెంట్ ఈ స్వీట్ తినాలని చాలా కోరికగా ఉందని చెప్పా. వెంటనే జాలిపడిన షాక్ కీపర్ వెళ్లి తీసుకోండి అనడంతో డబ్బులు ఇచ్చేసి వెళ్లిపోయాను. ఆ తర్వాత నా ఫ్రెండ్స్ అంతా ఎందుకలా చెప్పావని షాక్ అయ్యారు. కానీ నాకు చాలా చాలా క్రేవింగ్స్ వచ్చాయి.. తినాలనిపించింది కంట్రోల్ చేసుకోలేకపోయాను. అందుకే మిష్టి దోయ్ స్వీట్ కోసం అలా చెప్పాల్సి వచ్చింది’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
రెజీనా తన ఫుడ్ క్రేవింగ్స్ కోసం చెప్పిన ఈ సరదా అబద్ధం నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ సంఘటన ఆమె నిజాయితీ, సరదా స్వభావాన్ని తెలియజేస్తూ, ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.


