|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Actress: ఏడాదిలో మూడు సినిమాలు చేస్తే అన్నీ ఫ్లాపే.. అందం ఉన్నా అదృష్టం లేని చిన్నది.. ఎవరంటే.?

Published: 11-10-2025, 1:48 AM
Actress: ఏడాదిలో మూడు సినిమాలు చేస్తే అన్నీ ఫ్లాపే.. అందం ఉన్నా అదృష్టం లేని చిన్నది.. ఎవరంటే.?

సినీ ఇండస్ట్రీలో అందంతో పాటు అదృష్టం కూడా ఉండాలి. దివంగత శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ బాలీవుడ్‌లో వరుస ఫ్లాపులతో సతమతమవుతోంది. ఈ ఏడాది ఆమెకు మూడు ప్లాప్స్ వచ్చాయి. ఇప్పుడు జాన్వీ తన ఆశలన్నీ టాలీవుడ్ చిత్రాలపైనే పెట్టుకుంది.

Key Points

1

శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ 'ధడక్'తో 2018లో సినీ రంగ ప్రవేశం.

2

15 సినిమాల్లో వేళ్ళ మీద లెక్కపెట్టగలిగే హిట్స్‌ మాత్రమే.

4

రామ్‌చరణ్ 'పెద్ది' చిత్రంపైనే జాన్వీ తన ఆశలన్నీ పెట్టుకుంది.

జాన్వీ కపూర్ సినీ కెరీర్ ఆరంభం

సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే.. అందంతో పాటు కూసింత అదృష్టం కూడా కలిసిరావాలి. అలాగే నెపో కిడ్స్ అయినంత మాత్రాన ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకోలేరు. ఎప్పుడోకప్పుడు తన ఫేం కోల్పోవాల్సింది. ఈ బ్యూటీ పరిస్థితి కూడా అంతే.! ఏడాదిలో మూడు చిత్రాలు చేస్తే అన్నీ ఫ్లాపే.. ఇప్పుడు దక్షిణాదిపైనే తన ఆశలు పెట్టుకుంది. మరి ఆ భామ మరెవరో కాదు.. జాన్వీ కపూర్.

అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది జాన్వీ కపూర్. 2018లో ‘ధడక్’ సినిమాతో హీరోయిన్‌గా అరంగేట్రం చేసి.. మంచి మార్కులు కొట్టేసింది. ఆ తర్వాత ‘గుంజన్ సక్సేనా’ మూవీతో నటనకు ఆస్కారం ఉన్న పాత్రలో నటించి ప్రశంసలు అందుకుంది.

వరుస ఫ్లాపులతో సతమతమైన జాన్వీ

తన సినీ కెరీర్‌లో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా చేసినవి 15 చిత్రాలే అయినప్పటికీ.. హిట్స్ విషయానికొస్తే వేళ్ల మీద లేక్కపెట్టుకోవాలి. ఆమెకు బాలీవుడ్‌లో ఒకట్రెండు సినిమాలు హిట్ కాగా.. తెలుగులో చేసిన ‘దేవర’ మూవీ బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్ సక్సెస్ సాధించింది.

ఇక ఈ ఏడాది జాన్వీ కపూర్ నుంచి ఏకంగా మూడు సినిమాలు విడుదలయ్యాయి. అందులో ఒకటి నీరజ్ ఘయ్వాన్ దర్శకత్వం వహించిన ‘హోంబౌండ్’ కాగా.. రెండోది సిద్దార్థ్ మల్హోత్రా హీరోగా వచ్చిన ‘పరమ్ సుందరి’.. మూడోది వరుణ్ ధావన్ హీరోగా నటించిన ‘సన్నీ సంస్కారి కి తులసి కుమారి’.

జాన్వీ ఆశలన్నీ టాలీవుడ్‌పైనే

ఈ మూడు చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర ప్లాఫ్స్‌గా మిగిలిపోయాయి. ఒక్క సినిమా కూడా జాన్వీని కాపాడలేకపోయాయి. దీంతో ఒక్క ఏడాదిలోనే మూడు ఫ్లాప్‌లు ఎదుర్కున్న జాన్వీ.. తన ఆశలన్నీ కూడా రామ్‌చరణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘పెద్ది’ చిత్రంపైనే పెట్టుకుంది.

మొత్తం మీద ఈ ఏడాది జాన్వీకి నిరాశనే మిగిల్చింది. బాలీవుడ్‌లో వరుస పరాజయాల తర్వాత, జాన్వీ కపూర్ ఆశలన్నీ రామ్‌చరణ్ ‘పెద్ది’ చిత్రంపైనే ఉన్నాయి. ఈ చిత్రం ఆమె కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా మారాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.