|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

విజయ్, త్రిషల మధ్య ఏం జరుగుతోంది? ఎయిర్‌పోర్ట్‌లో అసలేం జరిగింది? సంచలన నిజాలు!

Published: 13-03-2026, 12:35 PM
విజయ్, త్రిషల మధ్య ఏం జరుగుతోంది? ఎయిర్‌పోర్ట్‌లో అసలేం జరిగింది? సంచలన నిజాలు!
  • విజయ్, త్రిష రిలేషన్‌పై వస్తున్న వార్తలపై త్రిష మౌనం దాల్చడం చర్చనీయాంశంగా మారింది.
  • చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో విలేకరులు అడిగిన ప్రశ్నలకు త్రిష సమాధానం ఇవ్వకుండా వెళ్లిపోయారు.
  • విజయ్ భార్య విడాకులు కోరడంతో వీరిద్దరి రిలేషన్‌పై పుకార్లు ఊపందుకున్నాయి.
  • త్రిష త్వరలో టీవీకే పార్టీ తరపున రాజకీయాల్లోకి వస్తారని వార్తలు వస్తున్నాయి.

హీరో విజయ్‌తో నటి త్రిష రిలేషన్ ఉందనే వార్తలు గత కొంతకాలంగా వైరల్ అవుతున్నాయి. విజయ్ భార్య విడాకులు కోరడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో త్రిష ఈ విషయంపై స్పందించకుండా వెళ్లిపోయారు.

విజయ్, త్రిష రిలేషన్‌పై వస్తున్న వార్తలు

Actress Trisha: త్రిష ప్రస్తుతం సౌత్ సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారారు. గత కొంతకాలంగా ఈమె హీరో విజయ్ తో రిలేషన్ లో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. ఈమె కారణంగానే విజయ్ తన భార్య విడాకులు తీసుకోబోతున్నారు అంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి అయితే ఈ వార్తలను నిజం చేస్తూ విజయ్ భార్య సంగీత విడాకులు కోరుతూ కోర్టుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇలా విజయ్ భార్య సంగీత విడాకులు కావాలని కోరడంతో విజయ్ త్రిష రిలేషన్ గురించి పెద్ద ఎత్తున వార్తలు బయటకు వస్తున్నాయి. ఈ వార్తలకు అనుగుణంగానే వీరిద్దరూ ఇటీవల ఒక నిర్మాత కుమారుడి పెళ్లి వేడుకకు కలిసి వెళ్లడం సంచలనంగా మారింది.

విజయ్ త్రిష ఒకే కారులో ఒకే రంగు దుస్తులను ధరించి పెళ్లికి హాజరు కావడంతో వీరిద్దరూ తమ రిలేషన్ ని ఇలా కన్ఫర్మ చేస్తున్నారని సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేశాయి. అయితే త్రిష ఈ వార్తలపై స్పందిస్తూ వివరణ కూడా ఇచ్చుకున్నారు. చివరి నిమిషంలో అనుకోకుండా కలిసి వెళ్లాల్సి వచ్చిందని తెలిపారు. ఇకపోతే తాజాగా చెన్నై ఎయిర్ పోర్టులో త్రిష సందడి చేశారు ఈ నేపథ్యంలోనే మీడియా వారు ఈమెకు విజయ్ తో కలిసి కారులో వెళ్లడం గురించి అలాగే వీరిద్దరి రిలేషన్ గురించి వస్తున్న రూమర్లపై ప్రశ్నలు వేశారు.

చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో త్రిష మౌనం

ఇలా మీడియా వారి నుంచి ప్రశ్నలు ఎదురవగా త్రిష మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుంచి మౌనంగా వెళ్లిపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. త్రిష మాట్లాడకుండా అలా వెళ్లడం వెనుక కారణం ఏంటి ఈమె మౌనం అంగీకారానికి అర్థమా? అంటూ నేటిజన్ లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ వీరిద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ లేకపోతే త్రిష ఈ వార్తలను అక్కడే ఖండించేది కానీ ఈమె మౌనంగా వెళ్లడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది.

ఇక ఈ విషయంపై విజయ్ మాత్రం ఇప్పటివరకు ఎక్కడ స్పందించలేదు ఈయన తన విడాకులు గురించి కూడా ఎక్కడ స్పందించిన దాఖలాలు లేవు. ప్రస్తుతం విజయ్ తన పార్టీ ప్రచార కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈయన రాజకీయాలలో బిజీ అవుతున్న తరుణంలో త్రిష కూడా సినిమాలకు గుడ్ బై చెబుతూ రాజకీయాలలోకి రాబోతున్నారని వార్తలు కూడా హల్చల్ చేస్తున్నాయి. ఈమె టివీకే పార్టీ తరపున ఈసారి ఎన్నికలలో పోటీ చేయబోతున్నారని సమాచారం. మరి త్రిష రాజకీయాలలోకి రావడం గురించి వస్తున్న వార్తలలో కూడా ఎంతవరకు నిజముందనేది తెలియాలి అంటే విజయ్ లేదా త్రిష స్పందించాల్సి ఉంది. ప్రస్తుతం పలు సినిమాలకు కమిట్ అయిన త్రిష ఆ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. తెలుగులో ఈమె చిరంజీవితో కలిసి విశ్వంభర అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.

రాజకీయాల్లోకి త్రిష ఎంట్రీ?

మొత్తానికి, త్రిష మౌనం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ వ్యవహారంపై ఆమె లేదా విజయ్ స్పందిస్తేనే అసలు నిజాలు వెలుగులోకి వస్తాయి. అప్పటివరకు ఇది ఒక సస్పెన్స్‌గానే మిగిలిపోతుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.