
📌 Key Points
- వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్లో ‘ఆదర్శ కుటుంబం’ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది – మే నెలలో పూర్తి చేసే అవకాశం!
- దర్శకుడు త్రివిక్రమ్ సినిమాను సమ్మర్ లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు – అభిమానులకు ఇది నిజంగా గుడ్ న్యూస్!
- ఈ సినిమా కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్న అభిమానులు – విడుదల తేదీ కోసం ఆసక్తిగా నిరీక్షణ!
- వెంకటేష్, త్రివిక్రమ్ గతంలో నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి వంటి సూపర్ హిట్ సినిమాలు అందించారు – మరో హిట్ కోసం ఎదురుచూపులు!
టాలీవుడ్ లో మోస్ట్ క్రేజీ కాంబో అంటే వెంకటేష్, త్రివిక్రమ్ లదే. వీరిద్దరూ కలిసి ‘ఆదర్శ కుటుంబం’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్ లో జరుగుతోంది. మే నెలలో షూటింగ్ పూర్తి కానుండటంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
జెట్ స్పీడ్ లో షూటింగ్ పూర్తి చేసేలా ప్లాన్!
Adarsha Kutumbam: టాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో సెట్ అయిన క్రేజీ కాంబో అంటే విక్టరీ వెంకటేష్ అండ్ దర్శకుడు త్రివిక్రమ్ కాంబో అనే చెప్పాలి. చాలా కాలం నుంచి ఈ ఇద్దరు కలిసి ఒక సినిమా చేస్తున్నారు అంటూ వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. నిజానికి, ఆడియన్స్ కూడా చాలా కాలంగా ఈ కాంబోలో సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. దానికి, కారణం గతంలో ఈ ఇద్దరు కలిసి చేసిన సినిమాలే.
విక్టరీ వెంకటేష్ హీరోగా వచ్చిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి లాంటి సినిమాలకు కథ మాటలు అందించాడు త్రివిక్రమ్. కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాలు సూపర్ సక్సెస్ సాధించాయి. ఇప్పటికే, టీవీలో వచ్చినా మిస్ చేయకుండా చూసేవాళ్లు చాలా మందే ఉన్నారు. అందుకే, వెంకటేష్-త్రివిక్రమ్ కాంబోకి ఆ రేంజ్ లో డిమాండ్ ఏర్పడింది.
సమ్మర్ లోనే విడుదల చేసేందుకు సన్నాహాలు!
ఎట్టకేలకు, చాలా ఏళ్ళ గ్యాప్ తరువాత ఈ ఇద్దరు కలిసి సినిమా చేసేందుకు సిద్ధం అయ్యారు. అదే ‘ఆదర్శ కుటుంబం Ak47(Adarsha Kutumbam)’. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కూడా స్తారట అయ్యింది. అయితే, తాజాగా ఈ సినిమా గురించి వినిపిస్తున్న న్యూస్ ఏంటంటే.. ఆదర్శ కుటుంబం సినిమాను జెట్ స్పీడ్ లో ఫినిష్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట దర్శకుడు త్రివిక్రమ్.
వెంకటేష్-త్రివిక్రమ్ కాంబోకి భారీ డిమాండ్!
అది కూడా మే వరకు కంప్లేట్ చేయాలని పక్కా ప్లాన్ వేసుకున్నాడట. అందుకు తగ్గట్టుగానే షూటింగ్ ను ఉరకలెత్తిస్తున్నాడట. అలాగే, సమ్మర్ లోనే సినిమాను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాడట. దీంతో, ఈ సినిమా కోసం చూస్తున్న ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి, త్రివిక్రమ్ కి షూటింగ్ చాలా ఆలస్యం చేస్తాడు అనే బ్యాడ్ నేమ్ ఉంది. ఆ టాక్ ను ఈ సినిమాతో చెరిపేయాలని, అలాగే గుంటూరు కారం సినిమాతో వచ్చిన నెగిటివిటీను కూడా తుడిచేయాలని ప్లే చేస్తున్నాడట.
వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. షూటింగ్ కూడా వేగంగా జరుగుతోంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


