
‘అడవి పిలిచింది!’ అంటూ తమన్నా సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి నటిస్తున్న ‘వ్వాన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్’ సినిమా ప్రీ టీజర్ విడుదలైంది. అడవి నేపథ్యంలో చిత్రీకరించిన ఈ మైథలాజికల్ మూవీ 2026లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Key Points
తమన్నా 'వ్వాన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్' సినిమాలో నటిస్తున్నారు.
రాత్రి వేళ అడవిలో దీపం వెలిగించే తమన్నా ప్రీ టీజర్ విడుదలైంది.
సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తున్న ఈ సినిమా 2026లో విడుదల కానుంది.
బాలాజీ మోషన్ పిక్చర్స్, ది వైరల్ ఫీవర్ మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
తమన్నా ‘వ్వాన్’ లో!
‘అడవి పిలిచింది… నేను సమాధానం చెప్పాను’ అని అంటున్నారు హీరోయిన్ తమన్నా. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా అరుణభ్ కుమార్–దీపక్ మిశ్రా దర్శకత్వంలో ‘వ్వాన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్’ అనే మైథలాజికల్ మూవీ తెరకెక్కుతోంది. బాలాజీ మోషన్ పిక్చర్స్, ది వైరల్ ఫీవర్ మోషన్ పిక్చర్స్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో తమన్నా నటిస్తున్నట్లుగా వెల్లడించి, ఆమెపాత్ర తాలూకు ప్రీ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
రాత్రి వేళ ఎర్రటి చీర ధరించిన తమన్నా కారు దిగి, అడవిలోకి వెళ్లి, అక్కడ ఓ దీపం వెలిగించడం, అక్కడ ఏదో దృశ్యాన్ని చూసి కళ్లు పెద్దవి చేయడం వంటి విజువల్స్ ఈ వీడియోలో కనిపించాయి. ‘‘అడవి పిలిచింది. నేను సమాధానం చెప్పాను. ‘వ్వాన్’లో భాగం కావడం థ్రిల్లింగ్‌గా ఉంది’’ అంటూ ‘ఎక్స్’లో పేర్కొన్నారు తమన్నా. ఈ సినిమా 2026లో విడుదల కానుంది.
అడవి నేపథ్యం
2026 విడుదల
తమన్నా నటనతో ‘వ్వాన్’ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలతో నిండి ఉంటుందని అంచనాలు ఉన్నాయి. 2026 లో విడుదల కానున్న ఈ చిత్రంపై అంచనాలు పెరుగుతున్నాయి.


