|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Adhik Balayya: గుడ్ బ్యాడ్ అగ్లీ డైరెక్టర్‌తో బాలయ్య మూవీ?

Published: 13-05-2025, 11:07 AM
Adhik Balayya: గుడ్ బ్యాడ్ అగ్లీ డైరెక్టర్‌తో బాలయ్య మూవీ?

తమిళ దర్శకుడు అధిక్ రవిచంద్రన్ తన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. తాజాగా, ఆయన టాలీవుడ్ స్టార్ నందమూరి బాలకృష్ణతో కలిసి సినిమా చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. బాలకృష్ణ కథ విని ఫిదా అయ్యారని తెలుస్తోంది.

Key Points

1

అధిక్ రవిచంద్రన్ బాలకృష్ణతో కొత్త సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు.

2

బాలకృష్ణ అధిక్ చెప్పిన కథకు ఫిదా అయ్యారని వార్తలు.

4

ఈ ప్రాజెక్ట్ పై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం.

అధిక్ రవిచంద్రన్ – బాలకృష్ణ కాంబినేషన్

అజిత్ హీరోగా, త్రిష, ప్రియ ప్రకాష్ వారియర్, షిన్ టామ్ చాకో, అర్జున్ దాస్ వంటి నటీనటులతో గుడ్ బ్యాడ్ అగ్లీ (Good Bad Ugly) సినిమాను తెరకెక్కించి.. బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు తమిళ దర్శడుకు అధిక్ రవిచంద్రన్ (Adhik Ravichandran). తాజాగా ఈ డైరెక్టర్.. టాలీవుడ్ అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)తో కలిసి భారీ ప్రాజెక్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే అధిక్ రవిచంద్రన్ బాలకృష్ణను కలిసి ఒక స్టోరీ లైన్ కూడా చెప్పారని, అది విన్న బాలకృష్ణ ఫిదా అయ్యారని అటు తమిళ్ మీడియాలో, ఇటు ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

మార్క్ ఆంటోని (Mark Antony) వంటి బ్లాక్ బస్టర్ సినిమా తీసిన అధిక్.. గుడ్ బ్యాడ్ అగ్లీతో ఎంతోకాలంగా హిట్ కోసం ఎదురుచూస్తోన్న అజిత్ కు బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. అలాంటి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బాలయ్యతో సినిమా తీస్తే.. మరో బ్లాక్ బస్టర్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ పై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే అధిక్ తన నెక్స్ట్ సినిమా కూడా అజిత్ తోనే చేస్తారని తమిళ ఇండస్ట్రీ అంటోంది. ఈ సందిగ్ధంపై క్లారిటీ రావాలంటే అధిక్ నోరు విప్పాల్సిందే.

గుడ్ బ్యాడ్ అగ్లీ సక్సెస్ తర్వాత

సినిమా ప్రాజెక్ట్ పై తాజా వార్తలు

అధిక్ రవిచంద్రన్ మరియు బాలకృష్ణ కాంబినేషన్ లో సినిమా రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన వస్తుందని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.