
📌 Key Points
- ‘ఉరి’ సినిమాతో ఆదిత్య ధర్ దర్శకుడిగా పరిచయం.
- ‘ధురంధర్’ సినిమా 1350 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
- ఆదిత్య ధర్ డ్రీమ్ ప్రాజెక్ట్ అశ్వత్థామ సినిమా 800 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కనుంది.
- గతంలో విక్కీ కౌశల్ హీరోగా ఈ సినిమా ప్రారంభం కావాల్సి ఉంది.
ప్రముఖ డైరెక్టర్ ఆదిత్య ధర్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన అశ్వత్థామ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. ధురంధర్ సినిమాతో సంచలనం సృష్టించిన ఆయన, ఇప్పుడు ఈ మైథలాజికల్ మూవీతో మరోసారి ప్రేక్షకులను అలరించనున్నారు.
ఆదిత్య ధర్ డ్రీమ్ ప్రాజెక్ట్ ఏమిటి?
Aditya dhar: ధురంధర్.. ఒక్క సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసి అటు బాలీవుడ్ లోనే కాదు ఇటు తెలుగు ఆడియన్స్ కూడా మాట్లాడుకునేలా చేసి అందరి దృష్టిని ఆకట్టుకున్నారు ప్రముఖ డైరెక్టర్ ఆదిత్యధర్ (Adithya Dhar) .. ఈ ఒక్క సినిమాతో ఎటువంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చి.. 1350 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసి రికార్డు సృష్టించారు.. ఈ సినిమాకి కొనసాగింపుగా ‘ధురంధర్: ది రివేంజ్’ పేరిట ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని.. మార్చి 19 2026న ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. మొదటి రోజే 147కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి ఇప్పుడు థియేటర్ వద్ద దూసుకుపోతోంది . ఇక ఈ రెండు సినిమాలు సంచలనం సృష్టించడంతో ఈ చిత్ర డైరెక్టర్ ఆదిత్యధర్ డ్రీమ్ ప్రాజెక్టు గురించి తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. 800 కోట్ల హీరోతో మైథలాజికల్ మూవీ చేయబోతున్నట్లు సమాచారం . మరి ఆ డైరెక్టర్ డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటి ? ఆ హీరో ఎవరు? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం..
ఇకపోతే గత కొద్ది రోజులుగా ‘ధురంధర్: ది రివేంజ్’ తర్వాత ‘ధురంధర్ 3’ కూడా ఉంటుందని అందరూ భావించినప్పటికీ ఇప్పుడు బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం ఆదిత్యధర్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన అశ్వత్థామ చిత్రాన్ని పట్టాలెక్కించే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. 2021 లో విక్కీ కౌశల్ (Vicky Kaushal) హీరోగా ఈ భారీ బడ్జెట్ సోషియో ఫాంటసీ చిత్రాన్ని తెరకెక్కించాలని చూసినా.. కరోనా పరిస్థితిలో భారీ బడ్జెట్ కారణాలవల్ల అది వాయిదా పడింది.. ఇక ఇప్పుడు ఆదిత్య ధర్ సృష్టించిన ధురంధర్ మ్యాజిక్ చూసి నిర్మాతలు ఈ క్రేజీ ప్రాజెక్టు కోసం ఎగబడుతున్నట్లు సమాచారం. దీంతో త్వరలోనే ఈ విజువల్ వండర్ ను పట్టాలెక్కించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఐదు సంవత్సరాలుగా తన డ్రీమ్ ప్రాజెక్టును తెరపై చూపించాలని ఎంతో కుతూహలం కనబరిచిన ఆదిత్యధర్ ఇప్పుడు ధురంధర్ తో సత్తా చాటి.. తన డ్రీమ్ ప్రాజెక్టుకి దారులను ఏర్పరచుకున్నారు. ఈ సినిమా పట్టాలెక్కితే ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.
విక్కీ కౌశల్ తో సినిమా ఆగిపోవడానికి కారణం?
అశ్వత్థామ చిత్రం ఎప్పుడు ప్రారంభం?
ఆదిత్యధర్ విషయానికి వస్తే ..రేడియో జాకీగా, థియేటర్ ఆర్టిస్టుగా పనిచేసి.. ఆ తర్వాత సినిమా రంగంపై ఆసక్తిని పెంచుకున్నారు. 2019లో విడుదలైన ‘ఉరి: ద సర్జికల్ స్ట్రైక్’ చిత్రంతో దర్శకుడిగా ఇండస్ట్రీకి అరంగేట్రం చేశారు.మొదటి ప్రయత్నంలోనే ఉత్తమ దర్శకుడిగా నేషనల్ అవార్డు గెలుచుకొని అందరి దృష్టిని ఆకర్షించారు.. ఇకపోతే స్క్రిప్ట్ కాపీ వివాదాలు, సినిమాలు ఆగిపోవడం వంటి ఎన్నో అవరోధాలు దాటుకొని నేడు ఈ స్థాయికి చేరుకున్నారు. ఇకపోతే దర్శకత్వానికే పరిమితం కాకుండా తన సోదరుడు లోకేష్ ధర్ తో కలిసి “బి 62 స్టూడియో” స్థాపించి ‘ఆర్టికల్ 371’ చిత్రాలను నిర్మించారు. ఇక ఈయన ప్రముఖ సినీనటి యామీ గౌతమ్ (Yami Gautam) ను 2021 లో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే .
ఆదిత్య ధర్ దర్శకత్వంలో అశ్వత్థామ చిత్రం తెరకెక్కనుండటం ఆయన అభిమానులకు శుభవార్త. ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో వేచి చూడాలి. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం రూపొందనుంది.


