|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అడవి శేష్ ‘డెకాయిట్‌’ విధ్వంసం! 3 రోజుల్లోనే బాక్సాఫీస్ బద్దలు.. దిమ్మతిరిగే కలెక్షన్లు!

Published: 13-04-2026, 2:35 AM
అడవి శేష్ 'డెకాయిట్‌' విధ్వంసం! 3 రోజుల్లోనే బాక్సాఫీస్ బద్దలు.. దిమ్మతిరిగే కలెక్షన్లు!
  • అడవి శేష్ ‘డెకాయిట్‌’: మొదటి వీకెండ్‌లో రూ.40 కోట్ల వసూళ్లు! కుమ్మేస్తున్నాడుగా!!
  • నార్త్ అమెరికాలో డెకాయిట్ మూవీకి 9 లక్షల డాలర్ల కలెక్షన్లు, అదుర్స్ అంతే!
  • మూడు రోజుల్లో ఇండియాలో రూ.28 కోట్లు కొల్లగొట్టిన అడవి శేష్ మూవీ సంచలనం!
  • రూ.62 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ‘డెకాయిట్‌’ మూవీ.. అసలు పరీక్ష సోమవారం నుండి!

అడవి శేష్ మరోసారి తన సత్తా చాటాడు. ‘డెకాయిట్‌’ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళ్దాం!

మూడు రోజుల్లో డెకాయిట్‌ కలెక్షన్ల మోత!

అడవి శేష్‌ మరోసారి తానేంటో నిరూపించుకున్నారు. ఆయన నటించిన `డెకాయిట్‌` మూవీ బాక్సాఫీసు వద్ద అదిరిపోయే వసూళ్లని రాబడుతోంది. ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చినా ఆడియెన్స్ సినిమాని చూసేందుకు ప్రయారిటీ ఇస్తున్నారు. దీంతో డీసెంట్‌ కలెక్షన్లతో ప్రారంభమైన ఈ మూవీ అదే జోరు చూపిస్తుంది. సాధారణంగా సినిమా బాగా లేకపోతే రెండో రోజు నుంచే వసూళ్లు పడిపోతాయి. కానీ ఈ చిత్రానికి మాత్రం కలెక్షన్లు డ్రాప్‌ కాలేదు. మొదటిరోజుకి సమానంగా వస్తున్నాయి. మూడు రోజులు అదే స్థాయిలో కలెక్షన్లని రాబట్టడం విశేషం.

అడవి శేష్‌, మృణాల్‌ ఠాకూర్‌ జంటగా `డెకాయిట్‌` మూవీ రూపొందిన విషయం తెలిసిందే. శానిల్‌ డియో దర్శకత్వం వహించిన ఈ మూవీని సుప్రియా, సునీల్‌ నారంగ్‌ నిర్మించారు. ఈ సినిమాతో మొదటిసారి సోలో నిర్మాతగా మారింది సుప్రియ. ఆమె సొంతంగా ఎస్ఎస్‌ ప్రొడక్షన్‌ ని కూడా స్టార్ట్ చేసింది. ఇక ఈ సినిమాలో ఇందులో అనురాగ్‌ కశ్యప్‌, ప్రకాష్‌ రాజ్‌, సునీల్‌ కీలక పాత్రలు పోషించారు. శుక్రవారం విడుదలన ఈ మూవీకి మిశ్రమ స్పందన వచ్చింది. ఇండస్ట్రీ వర్గాల నుంచి పాజిటివ్‌ సపోర్ట్ వచ్చింది. అది వసూళ్లలోనూ కనిపిస్తోంది. మూడు రోజుల్లో ఈ సినిమాకి మంచి కలెక్షన్లు రావడం విశేషం.

నార్త్ అమెరికాలో అడవి శేష్ మూవీ రికార్డులు!

`డెకాయిట్‌` మూవీ మూడు రోజులు పూర్తి చేసుకుంది. ఇది మొదటి వీకెండ్‌లో రూ.40కోట్లు వసూలు చేసినట్టు చిత్ర బృందం వెల్లడించింది. నార్త్ అమెరికాలోనే దీనికి 9లక్షల డాలర్లు వచ్చాయి. అంటే ఆల్మోస్ట్ రూ.8కోట్లకుపైగా కలెక్షన్లు వచ్చాయి. ఇండియాలో రూ.28కోట్లు, ఓవర్సీస్‌లో రూ.11.65కోట్లు రాబట్టినట్టు తెలుస్తోంది. అయితే ప్రముఖ సాక్నిల్క్ వెబ్‌ సైట్‌ ప్రకారం ఇది ఇండియాలో రూ.19.86కోట్ల నెట్‌ వసూళ్లని రాబట్టినట్టు సమాచారం. ఆల్మోస్ట్ ఈ సైట్‌ కలెక్షన్లు, సినిమా టీమ్‌ ప్రకటించిన వసూళ్లు దగ్గరగా ఉన్నాయి. అంతే మూవీ నిజంగానే మంచి కలెక్షన్లని రాబడుతుందని చెప్పొచ్చు. అయితే మూడు రోజుల్లో సత్తా చాటిన ఈ మూవీకి అసలు పరీక్ష సోమవారం నుంచి స్టార్ట్ కానుంది. ఈ రోజు నుంచి వచ్చే కలెక్షన్లని బట్టి ఈ మూవీ భవిష్యత్‌ ఆధారపడి ఉంటుంది. హిట్టా, ఫట్టా అనేది తేలనుంది.

సోమవారం నుండి అసలు పరీక్ష.. నిలబడుతుందా?

`డెకాయిట్‌` మూవీకి మొత్తంగా రూ.62కోట్ల బడ్జెట్‌ అయినట్టు సమాచారం. ఇక దీనికి థియేట్రికల్‌గా రూ.32కోట్ల వ్యాపారం జరిగినట్టు తెలుస్తోంది. ఏపీ, తెలంగాణలో రూ.19కోట్లకు సేల్‌ కాగా, మిగిలిన ఇండియాలో రూ.5కోట్లు, ఓవర్సీస్‌లో ఆరు కోట్లకు అమ్ముడు పోయింది. అయితే ఓవర్సీస్‌లో ఈ మూవీ ఈ ఈవెండ్‌తోనే బ్రేక్‌ ఈవెన్‌ అయినట్టు సమాచారం. ఇక ఓవరాల్‌గా బ్రేక్‌ ఈవెన్‌ కావాలంటే రూ.33కోట్ల షేర్‌ రావాలి. రూ.65కోట్ల గ్రాస్‌ రావాల్సి ఉంది. ఇంకా రూ.25 కోట్ల గ్రాస్‌ వస్తే సినిమా థియేట్రికల్‌గా సేఫ్‌ అవుతుందని చెప్పొచ్చు. అయితే నిర్మాతలు మాత్రం ఇప్పటికే టేబుల్‌ ప్రాఫిట్‌లో ఉన్నారు. రిలీజ్‌కి ముందే బిజినెస్‌ రూపంలో వారికి డబ్బులు వచ్చాయని సమాచారం.

అడవి శేష్ ‘డెకాయిట్‌’ మూవీ కలెక్షన్ల గురించి తాజా సమాచారం ఇది. సినిమా భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.