|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అడివి శేష్-మృణాల్ దొంగలుగా విధ్వంసం! ‘డెకాయిట్’ టీజర్ అరాచకం, నాగ్ పాట రీమిక్స్!

Published: 18-12-2025, 2:44 AM
అడివి శేష్-మృణాల్ దొంగలుగా విధ్వంసం! 'డెకాయిట్' టీజర్ అరాచకం, నాగ్ పాట రీమిక్స్!
  • ‘డెకాయిట్’లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ దొంగల పాత్రల్లో కనిపించారు.
  • టీజర్‌లో నాగార్జున హిట్ సాంగ్ కన్నెపిట్టరో కన్నుకొట్టరో రీమిక్స్ చేశారు.
  • బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ విలన్ పాత్రలో నటిస్తున్నారు.
  • ఈ సినిమా షానిల్ డియో దర్శకత్వంలో సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్నారు.

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న ‘డెకాయిట్’ టీజర్ విడుదలైంది. దొంగల పాత్రల్లో వీరిద్దరూ అదరగొట్టగా, నాగార్జున పాట రీమిక్స్ హైలైట్‌గా నిలిచింది. అనురాగ్ కశ్యప్ విలన్‌గా కనిపించి సినిమాపై అంచనాలు పెంచేశారు.

‘డెకాయిట్’ టీజర్: హైలైట్స్ ఏంటి?

టాలీవుడ్ హీరో అడివి శేష్(adivi sesh) విభిన్న కథలు ఎంచుకుంటూ వరుస ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తున్నాడు. హిట్, గూఢచారి, మేజర్ వంటి చిత్రాలతో సూపర్ హిట్స్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం డెకాయిట్, గూఢచారి-2 వంటి భారీ ప్రాజెక్ట్స్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. ‘డెకాయిట్’ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈక్రమంలోనే.. అడివి శేష్ గాయం కావడంతో కొద్ది రోజులపాటు రెస్ట్ తీసుకున్నాడు. గాయం నుంచి కోలుకున్న ఆయన మళ్లీ షూట్‌లో జాయిన్ అయ్యారు. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన టీజర్ రిలీజ్ చేసి సినీ ప్రియులను సర్‌ప్రైజ్ చేశారు. ముంబైలో ఈవెంట్ జరగ్గా ఇందులో హీరో, హీరోయిన్ ముసుగు వేసుకుని పాల్గొన్నారు. ఇక టీజర్ విషయానికొస్తే… ఈ సినిమాలో అడివి శేష్, మృణాల్ (Mrunal Thakur)దొంగలుగా కనిపించారు. దొంగతనాలు చేసే భార్యభర్తలుగా కనిపించిన వీరిద్దరు రొమాంటిక్ అండ్ ఎమోషనల్, యాక్షన్స్ సీన్స్‌లో అదరగొట్టారు.

అయితే ఈ టీజర్‌లో అక్కినేని నాగార్జున ఒకప్పటి సూపర్ హిట్ సాంగ్ కన్నెపిట్టరో కన్నుకొట్టరో సాంగ్‌ను రీమిక్స్ చేసి వాడారు. బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే అవుతున్న ఈ సాంగ్ టీజర్‌కు హైలెట్‌గా నిలిచి అందరినీ ఆకట్టుకునేలా చేసింది. భీమ్స్ బీజీఎమ్, హీరో, హీరోయిన్ నటన అద్భుతంగా ఉన్నాయి. మొత్తానికి ‘డెకాయిట్’ టీజర్ సినిమాపై అంచనాలు పెంచుతోంది. కాగా.. షానిల్ డియో దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా లవ్ స్టోరీగా రాబోతుండగా.. మృణాల్ హీరోయిన్‌గా కనిపించనుంది. ఇందులో బాలీవుడ్ స్టార్ దర్శకుడు కమ్ నటుడు అనురాగ్ కశ్యప్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా క్రిస్మస్ కానుకగా విడుదల కావాల్సి ఉండగా.. షూటింగ్ పూర్తి కానందున వాయిదా వేశారు. 2026 ఉగాది కానుకగా.. మార్చి 19న తెలుగు, హిందీ, భాషల్లో రిలీజ్ కాబోతుంది.

అడివి శేష్-మృణాల్ కెమిస్ట్రీ, అనురాగ్ కశ్యప్ రోల్

విడుదల తేదీ, నటీనటులు, సాంకేతిక వర్గం

మొత్తంగా, ‘డెకాయిట్’ టీజర్ సినిమాపై భారీ అంచనాలను పెంచింది. అడివి శేష్, మృణాల్, అనురాగ్ కశ్యప్ నటన, నాగార్జున పాట రీమిక్స్, భీమ్స్ బీజీఎమ్ హైలైట్స్. ఈ లవ్ స్టోరీ 2026 ఉగాదికి విడుదల కానుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.