
📌 Key Points
- కిరణ్ అబ్బవరం నిర్మాణంలో ‘తిమ్మరాజుపల్లి టీవీ’ చిత్రం!
- సాయి తేజ్, వేద జలంధర్ హీరోహీరోయిన్లుగా పరిచయం
- ఏప్రిల్ 17న గ్రాండ్ రిలీజ్ అవుతున్న పీరియాడిక్ డ్రామా
- 90ల నాటి జ్ఞాపకాలను గుర్తు చేసే విలేజ్ డ్రామా!
కిరణ్ అబ్బవరం నిర్మాణంలో వస్తున్న ‘తిమ్మరాజుపల్లి టీవీ’ చిత్రం 90ల నాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది. సాయి తేజ్, వేద జలంధర్ హీరోహీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 17న విడుదల కానుంది.
కిరణ్ అబ్బవరం నిర్మాణంలో సరికొత్త చిత్రం
న్యూ టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్‌తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్‌పై నిర్మిస్తున్న సినిమా ‘తిమ్మరాజుపల్లి టీవీ’. ఈ చిత్రంతో సాయి తేజ్, వేద జలంధర్ హీరో హీరోయిన్స్‌గా, వి.మునిరాజు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో సాగే ఈ పీరియాడిక్ డ్రామా ఏప్రిల్ 17న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా గ్రాండ్ రివీల్ ఈవెంట్‌లో భాగంగా చిత్ర నిర్మాత, హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. ‘నా చిన్నప్పుడు మా ఊరిలో ఒకే టీవీ ఉండేది. ఊరి వాళ్లంతా ఆ ఇంటికి వెళ్లి టీవీ చూసేవారు. అలాంటి సంఘటన ముని వాళ్ల ఊరిలో ఒకటి జరిగింది. శివరాత్రి పండక్కి మూడు రోజులు టీవీ అద్దెకు తీసుకొచ్చి ఊరి వాళ్లంతా కలిసి సినిమాలు చూస్తూ సెలబ్రేట్ చేసుకున్నారట.
ఈ కథంతా 95 సంవత్సరంలో జరుగుతుంది. ఈ కథ చెప్పినప్పుడే ముని క్లియర్‌గా చెప్పాడు. సార్ నేను ఎంటర్ టైన్ మెంట్, కమర్షియల్ మూవీ చేయాలనుకోవడం లేదు. మా ఊరిలో నేను చూసిన మనుషులు ఇన్నోసెన్స్, వాళ్ల మధ్య జరిగే డ్రామా, టీవీకి అప్పట్లో ఉన్న ప్రాధాన్యత నేపథ్యంగా సినిమా చేస్తానని చెప్పాడు. ఇది ఫ్యూర్‌గా హానెస్ట్‌గా మేమంతా చేసిన ప్రయత్నం. చిన్న బడ్జెట్‌లో చిన్న స్టోరీ లైన్‌తో మేము చేసిన చిత్రమిది. ఏప్రిల్ 17న సినిమా రిలీజ్ చేస్తున్నాం. ఈ చిత్రం ద్వారా 90 కిడ్స్‌కు వారి గతమంతా గుర్తుకు వస్తుంది. ఊరిలో జరిగే సస్పెన్స్ డ్రామా చిత్రమిది. చాలా నచ్చుతుంది’ అని తెలిపాడు.
90ల నాటి జ్ఞాపకాలతో ‘తిమ్మరాజుపల్లి టీవీ’
ఏప్రిల్ 17న గ్రాండ్ రిలీజ్!
చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసే ఈ చిత్రం ఏప్రిల్ 17న విడుదల కానుంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


