|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ట్యాగ్ అక్కర్లేదు: ఇతర హీరోలకు షాకిచ్చిన అడివి శేష్! ఆయన వ్యాఖ్యల సారాంశం ఇదే!

Published: 18-12-2025, 6:04 AM
ట్యాగ్ అక్కర్లేదు: ఇతర హీరోలకు షాకిచ్చిన అడివి శేష్! ఆయన వ్యాఖ్యల సారాంశం ఇదే!
  • అడివి శేష్‌కి ట్యాగ్‌లు పెట్టుకోవడం ఇష్టం లేదని స్పష్టం చేశారు.
  • వరుస విజయాలు సాధించినా తన పేరు పక్కన ట్యాగ్ వద్దన్న అడివి శేష్.
  • శేష్ వ్యాఖ్యలు ఇతర హీరోలకు కౌంటర్‌గా మారాయని సోషల్ మీడియాలో చర్చ.
  • ‘డెకాయిట్’ 2026 మార్చి 19న, ‘గూడచారి 2’ వచ్చే ఏడాది విడుదల కానున్నాయి.

అడివి శేష్ ఇటీవల ‘డెకాయిట్’ టీజర్ విడుదల సందర్భంగా ట్యాగ్‌లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వరుస విజయాలు సాధించినా, తన పేరు పక్కన ఎలాంటి ట్యాగ్ పెట్టుకోవడం ఇష్టం లేదని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి.

ట్యాగ్‌లపై అడివి శేష్ ఆసక్తికర సమాధానం

Adivi Sesh: గూడచారి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు పరిచయమై మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్న అడవి శేషు అప్పటినుంచి చాలా విభిన్నమైన సినిమా కథలను ఎంపిక చేసుకుంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు అడివి శేష్ హీరోగా సినిమా వస్తుంది అంటే చాలు సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవుతుందనే భావన ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇలా ఇప్పటివరకు శేష్ నటించిన సినిమాలేవి ప్రేక్షకులను నిరాశపరచలేదని చెప్పాలి. ఇటీవల హిట్ 3 సినిమాలో కామియో పాత్రలో కనిపించిన శేష్ త్వరలోనే డేకాయిట్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. టీజర్ చూస్తుంటే ఈసారి మరో హిట్ అందుకోబోతున్నారని స్పష్టమవుతుంది. ఈ టీజర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా సినిమాకు సంబంధించిన ఎన్నో విషయాల గురించి కూడా శేష్ అభిమానులతో ముచ్చటించారు. ఈ క్రమంలోనే ఈయనకు మీడియా వారి నుంచి ఆసక్తికరమైన ప్రశ్న ఎదురయింది. ఇటీవల కాలంలో ఒక సినిమా హిట్ అయితే చాలు సెలబ్రిటీలు పేరు పక్కన ట్యాగ్ పెట్టుకుంటారు కానీ మీరు వరుస హిట్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎందుకని ట్యాగ్ పెట్టుకోలేదనే ప్రశ్న ఎదురయింది.

ఇతర హీరోలకు కౌంటరేనా? చర్చనీయాంశంగా మారిన వ్యాఖ్యలు

ఈ ప్రశ్నకు అడివి శేష్ సమాధానం చెబుతూ.. అందరిలాగా నాకు ట్యాగ్ పెట్టుకోవడం ఇష్టం ఉండదు ఇలా ట్యాగ్ పెట్టుకొని వాటికి పిఆర్ టీమ్ తో ఒక లోగో చేయించుకోవడం ఇష్టం ఉండదు. నాకు చిన్నప్పుడే మా అమ్మ నాన్న”అడివి శేష్” అనే ట్యాగ్ ఇచ్చారు అందుకే మరొకటి పెట్టుకోవాలని అనుకోలేదు అంటూ ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు. నాకు ట్యాగ్స్ కంటే కూడా తరతరాలు గుర్తుండిపోయే సినిమాలు చేసి ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకోవడం ఇష్టం అంటూ ఈ సందర్భంగా ఈయన క్లారిటీ ఇచ్చారు. అయితే శేష్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పేరు పక్కన రెండు మూడు ట్యాగ్స్ పెట్టుకుని హీరోలకు ఈయన కౌంటర్ ఇచ్చారా అంటూ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

ఉగాది పండుగ సందర్భంగా డెకాయిట్ రిలీజ్..

డెకాయిట్, గూడచారి 2: విడుదల వివరాలు

ఇక ఈ ఇంటర్వ్యూ సందర్భంగా గూడచారి 2 గురించి కూడా ప్రశ్నలు ఎదురవడంతో అది కూడా వచ్చే ఏడాదిలోనే మరో పండగకు విడుదల కాబోతుందని ఈయన అభిమానులకు మరొక గుడ్ న్యూస్ తెలియజేశారు. ఇక డెకాయిట్ సినిమా విషయానికి వస్తే ఈ సినిమాలో శేష్ కు జోడీగా మృణాళ్ ఠాకూర్ నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా 2026 మార్చి 19వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. అయితే ఈ సినిమా విడుదల సమయంలోనే బాలీవుడ్ దురంధర్ 2, టాక్సిక్ సినిమా కూడా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఇలా ఈ హీరోలకు పోటీగా శేష్ డెకాయిట్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

అడివి శేష్ తన కెరీర్‌లో ట్యాగ్‌ల కంటే ప్రేక్షకుల మనసులో నిలిచిపోయే సినిమాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ‘డెకాయిట్’, ‘గూడచారి 2’ వంటి చిత్రాలతో ఆయన భవిష్యత్తు మరింత ఉజ్వలంగా ఉండబోతోందని స్పష్టమవుతోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.