
📌 Key Points
- యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్‌కు ‘అదుర్స్ 2’ ఊపునిస్తుందని అంచనా!
- వి.వి. వినాయక్ దర్శకత్వంలో సీక్వెల్ ప్లాన్ చేస్తున్న కోన వెంకట్!
- తారక్ ఫ్రీ అవ్వగానే ‘అదుర్స్ 2’ పట్టాలెక్కే అవకాశం!
- ‘అదుర్స్’లో తారక్ కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీకి ఫ్యాన్స్ ఫిదా!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్‌లో ‘అదుర్స్’ ఒక మైలురాయి. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ రాబోతుందనే వార్త టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. కోన వెంకట్ ఈ సీక్వెల్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చారు.
అదుర్స్ 2 స్క్రిప్ట్ రెడీ!
జూనియర్ ఎన్టీఆర్ కి మంచి గుర్తింపును తీసుకువచ్చిన పాత్రలలో అదుర్స్ చిత్రంలోని చారి పాత్ర ఒకటి. ఈ సినిమాలో చారి పాత్రలో బ్రాహ్మణ యువకుడిగా నటించిన తారక్ అద్భుతమైన నటనతో, డైలాగ్ డెలివరీతో సూపర్ గా కామెడీని పండించాడు. 2010వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. తారక్ ‘అదుర్స్”లో డబుల్ రోల్లో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. నయనతార, షీలా ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటించగా, వి.వి. వినాయక్ దర్శకత్వం వహించాడు.
ఎన్టీఆర్ కోసం ఎదురుచూపులు!
కోన వెంకట్ ఈ సినిమాకు కథను అందించడం మాత్రమే కాకుండా స్క్రీన్ ప్లేలో కూడా భాగం పంచుకున్నాడు. తారక్ కెరీర్లోనే అద్భుతమైన సినిమా కావడంతో అనేకమంది అదుర్స్ మూవీకి సీక్వెల్ వస్తే బాగుంటుందని ఈ మూవీ బృందాన్ని అనేక సందర్భాలలో అడిగారు. దాంతో ఈ మూవీ రైటర్ కమ్ స్క్రీన్ ప్లే రైటర్ అయినటువంటి కోన వెంకట్ గతంలో అదుర్స్ 2 స్క్రిప్ట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది అని అన్నారు. దాంతో ఎప్పుడెప్పుడు అదుర్స్ 2 కి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుందా అని అనేకమంది తారక్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూడటం మొదలుపెట్టారు.
వినాయక్ దర్శకత్వంలో సీక్వెల్!
తాజాగా కోన వెంకట్ ఓ సినిమా ఈవెంట్లో పాల్గొన్నారు. ఆ ఈవెంట్లో ఆయనకు అదుర్స్ 2 స్క్రిప్ట్ వర్క్ ఎంతవరకు వచ్చింది అనే ప్రశ్న ఎదురయింది. దానికి ఆయన సమాధానం చెబుతూ.. అదుర్స్ 2 స్క్రిప్ట్ ఇప్పటికే మొత్తం కంప్లీట్ అయింది. వినాయక్ గారు కూడా ఈ మధ్య ఒకసారి కలిస్తే అదుర్స్ 2 గురించి అడిగారు. ప్రస్తుతం తారక్ చాలా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన కాస్త ఫ్రీ అయితే ఈ సినిమా ప్రయత్నాలు మొదలుపెడతాం అని కోన వెంకట్ తెలియజేశారు.
కోన వెంకట్ తాజా ప్రకటనతో ఎన్టీఆర్ అభిమానుల్లో ఆనందం వెల్లువెలుస్తుంది. ‘అదుర్స్ 2’ గురించి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి. త్వరలోనే మరింత సమాచారం అందిస్తాం!


