|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఆసక్తికరంగా ‘అఫ్రో టపాంగ్’ సాంగ్.. డ్యాన్స్ స్టెప్పులతో అదరగొట్టిన ఇద్దరు స్టార్స్

Published: 02-11-2025, 5:03 PM
ఆసక్తికరంగా ‘అఫ్రో టపాంగ్’ సాంగ్.. డ్యాన్స్ స్టెప్పులతో అదరగొట్టిన ఇద్దరు స్టార్స్

కరుణాడ చక్రవర్తి శివ రాజ్ కుమార్, రియల్ స్టార్ ఉపేంద్ర కాంబోలో వస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘45 ది మూవీ’ నుంచి ‘అఫ్రో టపాంగ్’ సాంగ్ తాజాగా విడుదలైంది. జానీ మాస్టర్ కంపోజ్ చేసిన క్రేజీ స్టెప్పులతో ఈ పాట యూత్‌ను తెగ ఆకట్టుకుంటోంది. ఈ క్రేజీ సాంగ్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.

Key Points

1

శివ రాజ్ కుమార్, ఉపేంద్ర కాంబోలో ‘45 ది మూవీ’ రాబోతోంది.

2

సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ‘అఫ్రో టపాంగ్’ సాంగ్‌ను విడుదల చేశారు.

4

ఈ పాట యువతను విశేషంగా ఆకట్టుకుంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

‘45 ది మూవీ’: శివ రాజ్ కుమార్, ఉపేంద్ర కాంబో

కరుణాడ చక్రవర్తి శివ రాజ్ కుమార్(Shiva Raj Kumar), రియల్ స్టార్ ఉపేంద్ర (Upendra)కాంబోలో ఓ భారీ ప్రాజెక్ట్ రాబోతుంది. ‘45 ది మూవీ’ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అర్జున్ జన్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని సూరజ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద శ్రీమతి ఉమా రమేష్ రెడ్డి, ఎం రమేష్ రెడ్డి భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు ‘45 ది మూవీ’ (45 The Movie)నుంచి వచ్చిన పోస్టర్, గ్లింప్స్ అన్నీ కూడా ఆడియెన్స్‌లో భారీ హైప్‌ను పెంచేశాయి. ఈ చిత్రాన్ని డిసెంబర్ 25న విడుదల చేయబోతోన్నారు. దీంతో ప్రమోషన్స్ జోరు పెంచిన మూవీ మేకర్స్ అప్డేట్స్ రిలీజ్ చేస్తున్నారు.

తాజాగా ఈ చిత్రం ఓ క్రేజీ సాంగ్‌ను చిత్రయూనిట్ రిలీజ్ చేసింది. ‘గెలుపు తలుపు దొరికే వరకు దిగులుపడుకురా’ అంటూ సాగే ఈ క్రేజీ సాంగ్‌కు రోల్ రైడా తెలుగులో సాహిత్యాన్ని అందించారు. రోల్ రైడా, వినాయక్ కలిసి ఆలపించిన ఈ పాటకు జానీ మాస్టర్ క్రేజీ స్టెప్పుల్ని కంపోజ్ చేశారు. ఈ వీడియో సాంగ్‌లోని వాతావరణం, చుట్టూ కనిపిస్తున్న ఆ ఆఫ్రికన్స్ వారితో జానీ మాస్టర్ వేయించిన స్టెప్పులు అదిరిపోయాయి. ఇక ఈ పాటలో శివ రాజ్ కుమార్, ఉపేంద్ర, రాజ్ బి శెట్టి క్రేజీగా కనిపిస్తున్నారు. అర్జున్ జన్య ఇచ్చిన బాణీ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంది. ప్రస్తుతం ఈ పాట యూత్‌ను అయితే తెగ ఆకట్టుకునేలా కనిపిస్తోంది.

‘అఫ్రో టపాంగ్’ సాంగ్ విడుదల: జానీ మాస్టర్ కొరియోగ్రఫీ

యూత్ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటున్న కొత్త పాట

మొత్తానికి ‘అఫ్రో టపాంగ్’ సాంగ్, డ్యాన్స్ స్టెప్పులతో శివ రాజ్ కుమార్, ఉపేంద్ర అభిమానుల అంచనాలను భారీగా పెంచారు. డిసెంబర్ 25న విడుదల కానున్న ‘45 ది మూవీ’ పై ఈ పాట హైప్‌ను మరింత పెంచింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.