|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఓటీటీలో ఇవాళ ఆహా అనిపించే 4 సినిమాలు.. అన్నీ తెలుగులోనే.. మోటివేషన్ నుంచి బోల్డ్ వరకు.. ఇక్కడ చూసేయండి!

Published: 28-07-2025, 4:11 AM
ఓటీటీలో ఇవాళ ఆహా అనిపించే 4 సినిమాలు.. అన్నీ తెలుగులోనే.. మోటివేషన్ నుంచి బోల్డ్ వరకు.. ఇక్కడ చూసేయండి!

ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అనేక తెలుగు సినిమాలు అందుబాటులో ఉన్నాయి. నేడు ట్రెండింగ్‌లో ఉన్న నాలుగు ఉత్తమ సినిమాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. వివిధ జోనర్ల సినిమాలతో మీ రుచికి తగ్గ సినిమాను ఎంచుకోండి.

Key Points

1

ఆహా ఓటీటీలో ట్రెండింగ్‌లో ఉన్న నాలుగు ఉత్తమ తెలుగు సినిమాలు

2

మోటివేషనల్ డ్రామా నుండి బోల్డ్ రొమాంటిక్ కంటెంట్ వరకు అన్ని రకాల జోనర్లు

4

ఈ సినిమాలన్నీ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి

ఆహా ఓటీటీలో టాప్ ట్రెండింగ్ సినిమాలు

ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ఎన్నో రకాల కంటెంట్‌తో సినిమాలు, వెబ్ సిరీస్‌లు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుంటాయి. అయితే, వాటిలో చూసేందుకు కొన్ని మాత్రమే చాలా బెస్ట్‌గా ఉంటాయి. అలాగే, అవి టాప్ ఓటీటీ ట్రెండింగ్ సినిమాలుగా దూసుకుపోతుంటాయి.

ఇవాళ ఆహా ఓటీటీ టాప్ ట్రెండింగ్ సినిమాల్లో ఆహా అనిపించే ది బెస్ట్ నాలుగు సినిమాలు, వాటి జోనర్స్, వాటి ట్రెండింగ్ స్థానాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం. ఆ సినిమాలన్నీ కూడా తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్నాయి.

బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌లో రన్నరప్‌గా నిలిచి అందరి మన్ననలు పొందిన గౌతమ్ కృష్ణ హీరోగా చేసిన రెండో సినిమా సోలో బాయ్. కాలేజ్ నుంచి జీవితంలో ఎలా ఎదగాలో మోటివేషన్ ఇచ్చే యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ సినిమా సోలో బాయ్ ఆహా ఓటీటీలో టాప్ 2 ప్లేసులో ట్రెండింగ్ అవుతోంది. ఇది చూసేందుకు ఆహా అనిపించే సినిమా అని చెప్పుకోవచ్చు.

వివిధ జోనర్లలో అద్భుతమైన సినిమాలు

బ్యూటిపుల్ హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ ప్రధాన పాత్రలో నటించిన సైన్స్ ఫిక్షన్ సర్వైవల్ థ్రిల్లర్ సినిమా కలియుగమ్ 2064. ఓటీటీ రిలీజ్ అయినప్పటి నుంచి ట్రెండింగ్‌లో దూసుకుపోతున్న కలియుగమ్ ఆహాలో ఇవాళ టాప్ 4వ ప్లేసులో ట్రెండింగ్‌ అవుతోంది. కాబట్టి, ఈ సినిమా కూడా మంచి థ్రిల్లింగ్ ఇచ్చే మూవీ.

ఒక చిన్న తప్పు ఎంతోమంది ప్రాణాలను ఎలా బలిగొన్నదే చెప్పే సందేశాత్మక చిత్రమే 23 ఇరవై మూడు. తెలుగులో క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన 23 ఇరవై మూడు ఆహా ఓటీటీలో టాప్ స్థానంలో ట్రెండింగ్ అవుతోంది. కాబట్టి, చూసేందుకు ఆ సినిమా కూడా బెస్ట్ ఆప్షన్.

తెలుగులో బోల్డ్ అండ్ రొమాంటిక్ కంటెంట్‌తో తెరకెక్కిన వెబ్ సిరీస్ మస్తీస్. హీరో నవదీప్, చాందిని చౌదరి , బిందు మాధవి, హెబ్బా పటేల్, అక్షర గౌడ, రాజా చెంబోలు తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ సిరీస్‌ను లేటెస్ట్‌గా ఒక సినిమాగా మలిచారు.

ఇప్పుడే ఆహాలో చూడదగిన సినిమాలు

ఓటీటీ సిరీస్‌ మస్తీస్‌ను మూవీలా ఆహాలో డిజిటల్ స్ట్రీమింగ్ చేశారు. అప్పటి నుంచి ఆహా ఓటీటీ ట్రెండింగ్‌ లో మస్తీస్ కొనసాగుతోంది. ఇవాళ (జూలై 28) ఆహాలో ఓటీటీ ట్రెండింగ్ సినిమాల్లో టాప్ 7వ స్థానంలో దూసుకుపోతున్న మస్తీస్ చూసేందుకు మంచి ఆప్షన్.

ఎఫైర్స్, ఇల్లీగల్ రిలేషన్‌షిప్స్ వంటివి జీవితాలపై ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తాయనే కాన్సెప్ట్‌తో మస్తీస్ సాగుతుంది.

మొత్తంమీద, ఆహా ఓటీటీలో విభిన్న రుచులకు తగ్గట్టుగా చాలా సినిమాలు ఉన్నాయి. మీకు నచ్చే జోనర్ ఏదైనా, ఆహాలో మీకు తగిన సినిమా లభిస్తుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.