|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మరాఠా ధీశాలి రాణి ‘అహల్యా బాయి’ జీవితంపై సినిమా

Published: 07-05-2025, 3:19 AM
మరాఠా ధీశాలి రాణి 'అహల్యా బాయి' జీవితంపై సినిమా

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ రాణి అహల్యా బాయి హోల్కర్ జీవితంపై సినిమా నిర్మాణం చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఆమె 300వ జయంతి వేడుకల సందర్భంగా ఈ ప్రకటన వెలువడింది. ఈ సినిమా దేశవ్యాప్తంగా విడుదల కానుంది.

Key Points

1

మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ రాణి అహల్యా బాయి జీవితంపై సినిమా ప్రకటన

2

రాణి అహల్యా బాయి 300వ జయంతి వేడుకలలో భాగంగా ఈ ప్రకటన

4

దేశంలోని అన్ని భాషల్లో సినిమా విడుదల

సీఎం ప్రకటన

రాణి అహల్యా బాయి హోల్కర్‌(Ahilyabai Holkar) జీవితంపై సినిమా నిర్మించబోతున్నట్లు  మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ (Devendra Fadnavis) అధికారికంగా ప్రకటించారు. చాలాకాలంగా ఆమె జీవితాన్ని నేటి తరం యువతకు పరిచయం చేయాలని తాము అనుకుంటున్నట్లు ఆయన అన్నారు. మరాఠ ధీశాలి జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకమని ఆయన తెలిపారు.

అహల్యా బాయి జీవితం

రాణి అహల్యా బాయి  300వ జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పలు కార్యక్రమాలను చేపట్టామని సీఎం అన్నారు. గతంలోనే  అహ్మద్‌నగర్‌ (Ahmednagar) జిల్లా పేరును అహల్యానగర్‌(Ahilya Nagar)గా మార్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అహల్యా బాయి మరాఠాలు పాలించిన మాల్వా సామ్రాజ్యపు హోల్కరు వంశానికి చెందిన రాణి అని సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ అన్నారు. గతంలో ఆమె గురించి ఆయన ఇలా చెప్పారు. ‘ ప్రస్తుత అహ్మద్‌నగర్‌ జిల్లాలోని చౌంధీ (Chaundhi) అనే గ్రమంలో ఆమె జన్మించారు.

సినిమా విడుదల

మహిళా అభ్యుదయవాదిగా దేశం కోసం ఆమె ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు.  ఎన్నో దేవాలయాలతో పాటు ధర్మశాలలను ఆమె నిర్మించారు. ఆమె కారణం వల్లే నేడు కాశీలో మహాశివుడి గుడి ఉంంది.’ అని ఒక వేదికపై  దేవేంద్ర ఫడణవీస్ అన్నారు. అందుకే ఆమె జీవితాన్ని సినిమాగా దేశ ప్రజలకు చూపించాలని అనుకున్నట్లు ఆయన అన్నారు. దేశంలోని అన్ని భాషల్లో ‌ అహల్యా బాయి జీవిత చరిత్ర విడుదల అవుతుందన్నారు.

రాణి అహల్యాబాయి జీవితం దేశ ప్రజలకు తెలియజేసేందుకు ఈ సినిమా ఒక అద్భుతమైన అవకాశం. ఆమె సేవలు, విజయాలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.