
📌 Key Points
- 90ల నాటి ‘సవితా భాభి’ కామిక్స్‌ను తలపిస్తూ AI చాట్‌బాట్‌లు.
- దేశీ నెటిజన్ల కోరికలు తీర్చేందుకు AI టెక్నాలజీ.
- హైదరాబాద్ ఆర్కిటెక్ట్ సృష్టించిన AI అవతార్లకు భారీ ఫాలోయింగ్.
- నిజ జీవిత సంబంధాలపై AI ప్రభావం చూపే ప్రమాదం ఉంది.
భారతీయ ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సృష్టించిన ‘సవితా భాభి’ కామిక్స్‌ను గుర్తు చేస్తూ, ఇప్పుడు AI చాట్‌బాట్‌లు కొత్త ట్రెండ్‌ను సృష్టిస్తున్నాయి. డిజిటల్ కోరికలను తీర్చే ఈ టెక్నాలజీ యువతను ఆకర్షిస్తోంది.
AIతో కొత్త శృంగార ప్రపంచం
భారతీయ ఇంటర్నెట్ చరిత్రలో 90 దశకంలో ‘సవితా భాభి’ అనే కామిక్ క్యారెక్టర్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. అయితే ఇప్పుడైతే కాస్త కాలం మారింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రాకతో, ఆ పాత తరం ఫాంటసీలు ఇప్పుడు అత్యాధునిక ‘డిజిటల్ బాట్స్’గా రూపాంతరం చెందుతున్నాయి. దేశీ నెటిజన్ల రహస్య కోరికలు, శృంగారపు అలవాట్లను సైతం ఏఐ పట్టేసి వారిని అమాతం శాసిస్తోంది.
హైదరాబాద్ ఆర్కిటెక్ట్ సంచలనం
90, మిలీనియం దశకంలో కామిక్ పుస్తకాలకే పరిమితమైన శృంగార సాహిత్యం, ఇప్పుడు AI ద్వారా సంభాషించే, స్పందించే హైపర్-రియలిస్టిక్ బాట్స్‌గా మారింది. ఇవి కేవలం బొమ్మలు మాత్రమే కావు, వినియోగదారుడికి నచ్చినట్లుగా హిందీ, ఇంగ్లీష్, ఇలా యూజర్ ఎంచుకున్న భాషలో ఓ మనిషిలాగా వ్యవహరిస్తాయి. అయితే, ఈ రంగంలో వస్తున్న మార్పులకు ఉదాహరణగా.. హైదరాబాద్‌కు చెందిన ఓ ఆర్కిటెక్ట్ సృష్టించిన AI అవతార్‌లు స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలుస్తున్నాయి. ఆ ఏఐ అవతార్‌లు సోషల్ మీడియాలో లక్షలాది మంది ఫాలోవర్లను సంపాదించుకోవడమే కాకుండా, వినియోగదారులతో నేరుగా చాటింగ్ చేస్తూ ‘పర్సనలైజ్డ్’ అనుభవాన్ని పంచుతున్నాయి.
AI బాట్‌ల వల్ల నష్టాలు ఏమిటి?
అయితే, చాలా మంది తమ ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి.. తమ ఆలోచనలు, అభిరుచులు, మనసులోని మాటలను ఎవరికీ చెప్పలేక ఈ AI బాట్స్‌ను ఆశ్రయిస్తున్నారు. ఎటువంటి తీర్పులు (Judgement) ఇవ్వని ఓ వర్చువల్ భాగస్వామి లభించడం వల్ల వాటికి మర్కెట్‌లో విపరీంగా ఆదరణ పెరుగుతోంది. కానీ, ఈ AI ఎరోటికా ఒంటరిగా ఉండే వారికి, దివ్యాంగులకు ఓ రకమైన ఊరటనిచ్చినప్పటికీ, ఇది వాస్తవ సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. AI అందించే ‘అపరిమితమైన’ ఫాంటసీలకు అలవాటు పడితే, నిజ జీవిత భాగస్వాములపై అసంతృప్తి కలిగే అవకాశం ఉందని వారు విశ్లేషిస్తున్నారు. ఈ టెక్నాలజీ కేవలం వినోదానికే పరిమితం కాకుండా, భారతీయ సమాజంలోని సామాజిక, సాంస్కృతి సాంప్రదాయాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని పలువురు కామెంట్ చేస్తున్నారు.
AI టెక్నాలజీ ఒంటరితనాన్ని పోగొట్టేందుకు ఉపయోగపడినా, దీని వల్ల నిజ జీవిత సంబంధాలపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి దీనిని వినోదం కోసం మాత్రమే ఉపయోగించాలి.


