
📌 Key Points
- రూ. 999 ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌తో 100Mbps స్పీడ్.
- నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో ఉచిత సబ్‌స్క్రిప్షన్.
- 22 ఓటీటీ యాప్‌లకు ఉచిత యాక్సెస్ లభిస్తుంది.
- 3300GB డేటా ఆఫర్, ఇది నెలవారీ అవసరాలకు సరిపోతుంది.
ఎయిర్‌టెల్ యూజర్లకు గుడ్ న్యూస్! కేవలం రూ. 999కే 100Mbps స్పీడ్‌తో బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను ఎయిర్‌టెల్ అందిస్తోంది. ఇందులో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్‌స్క్రిప్షన్‌తో పాటు 22 ఓటీటీ యాప్‌లకు ఉచిత యాక్సెస్ కూడా ఉంది.
రూ. 999 ప్లాన్‌లో 100Mbps స్పీడ్, డేటా
Airtel Broadband Plan : ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ కోసం చూస్తున్నారా? రూ. 999 ప్లాన్ ద్వారా 100Mbps ఇంటర్నెట్ స్పీడ్, నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, అడోబ్ బెనిఫిట్స్ పొందవచ్చు.
Airtel Broadband Plan : ఎయిర్‌టెల్ యూజర్లకు పండగే. మీరు వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నారా? మీకు హైక్వాలిటీ వీడియో స్ట్రీమింగ్, ఆన్‌లైన్ గేమింగ్ కోసం చూస్తుంటే భారతీ ఎయిర్‌టెల్ అద్భుతమైన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ అందిస్తోంది.
ఎయిర్‌టెల్ రూ. 999 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ద్వారా అద్భుతమైన బెనిఫిట్స్ పొందవచ్చు. ఈ ప్లాన్ ఇంటర్నెట్ స్పీడ్ కంపెనీ కొద్దిగా తగ్గించింది. అయినా OTT బెనిఫిట్స్, ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు. ఈ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.
100Mbps స్పీడ్, 3300GB డేటా : భారతీ ఎయిర్‌టెల్ రూ. 999 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ అందిస్తోంది. మల్టీ స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ టీవీలను ఒకేసారి కనెక్ట్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఫ్యామిలీలు, నిపుణుల కోసం ఈ ప్లాన్ రూపొందించింది. ఈ ప్లాన్‌లో కంపెనీ ఇప్పుడు 100Mbps హై-స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీని అందిస్తోంది. ఈ ప్లాన్ గతంలో 200Mbps స్పీడ్ లేనప్పటికీ ఎయిర్‌టెల్ ఇప్పుడు నెట్ స్పీడ్ వంటి అదనపు బెనిఫిట్స్ అందిస్తోంది.
నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్‌తో ఓటీటీ బెనిఫిట్స్
ఈ 100Mbps స్పీడ్ ద్వారా 4K వీడియో స్ట్రీమింగ్, భారీ ఫైల్‌లను డౌన్‌లోడ్, వీడియో కాలింగ్ చేయొచ్చు. అలాగే ఎయిర్‌టెల్ డేటా ఆఫర్లు కూడా పొందవచ్చు. ఎందుకంటే.. ఈ ప్లాన్ నెలకు 3.3TB (సుమారు 3300GB) డేటాను అందిస్తుంది. సగటు ఫ్యామిలీ నెలవారీ అవసరాలకు సరిపోతుంది.
Read Also : Income Tax Draft Rules : కొత్త ఇన్‌కమ్ టాక్స్ డ్రాఫ్ట్‌లో భారీ ట్యాక్స్ రిలీఫ్? జీతగాళ్లకు ట్యాక్స్ బెనిఫిట్స్ డబుల్ అవుతాయా.. పూర్తి లెక్కలు ఇవే
నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ 22 OTT ప్లాట్‌ఫామ్‌లు ఫ్రీ : ఈ ప్లాన్ ద్వారా ప్రీమియం ఎంటర్ టైన్మెంట్ బెనిఫిట్స్ పొందవచ్చు. ఈ ప్లాన్‌తో ఎయిర్‌టెల్ కస్టమర్లకు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోలకు ఫ్రీ సబ్ స్క్రిప్షన్ అందిస్తోంది. దీనికి వినియోగదారులు సాధారణంగా అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
ఇతర ఓటీటీ యాప్‌లపై ఉచిత యాక్సెస్
అంతేకాదు.. ఈ ప్లాన్ ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ సర్వీస్ ద్వారా సోనీ లైవ్, జీ5, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వంటి 22కి పైగా ప్రముఖ ఓటీటీ యాప్‌లకు ఫ్రీగా యాక్సెస్ కూడా అందిస్తుంది. మీరు లైవ్ టీవీ ఛానెల్‌లను చూసే వారు అయితే, ఒకే బిల్లులో ఇంటర్నెట్, టీవీతో ఈ ఎయిర్‌టెల్ ప్లాన్ ఎంచుకోవచ్చు.
ఎయిర్‌టెల్ కేవలం ఎంటర్ టైన్మెంట్ మాత్రమే కాదు.. గ్రాఫిక్ డిజైన్ లేదా ఎడిటింగ్‌లో వర్క్ చేసే క్రియేటర్లకు కూడా ఉపయోగపడుతుంది. ఈ రూ. 999 ప్లాన్‌తో కంపెనీ అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియంకు ఒక ఏడాది ఫ్రీ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తోంది. ధర మార్కెట్లో దాదాపు రూ. వేలు ఉండగా, రీల్స్, వీడియోలకు ప్రొఫెషనల్ టచ్ ఇవ్వాలనుకునే యూట్యూబర్‌లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్‌లకు వరంగా చెప్పవచ్చు.
ఎయిర్‌టెల్ కస్టమర్లకు అదనపు క్లౌడ్ స్టోరేజ్ అందించే గూగుల్ వన్ 6 నెలల ఫ్రీ ట్రయల్‌ను కూడా అందిస్తుంది. అయితే, ఈ 6 నెలల ట్రయల్ వ్యవధి ముగిశాక గూగుల్ వన్‌ని వాడొచ్చు. అయితే నెలకు రూ. 130 వసూలు చేస్తుంది.
ఎయిర్‌టెల్ అందిస్తున్న ఈ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ చాల మందికి ఉపయోగపడుతుంది. తక్కువ ధరలో ఎక్కువ బెనిఫిట్స్ ఉండడం వల్ల ఇది వినియోగదారులకు బెస్ట్ ప్లాన్ అవుతుంది. వెంటనే ఈ ప్లాన్ తీసుకోండి.


