|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పెళ్లి వద్దు.. అదే ముద్దు! ఐశ్వర్య లక్ష్మి సంచలన నిర్ణయం వెనుక అసలు కథేంటి?

Published: 22-03-2026, 4:35 AM
పెళ్లి వద్దు.. అదే ముద్దు! ఐశ్వర్య లక్ష్మి సంచలన నిర్ణయం వెనుక అసలు కథేంటి?
  • ఐశ్వర్య లక్ష్మికి 34 ఏళ్లు, పెళ్లిపై ఆసక్తి లేదని స్పష్టం చేసింది.
  • సంతోషకరమైన జీవితానికి పెళ్లి తప్పనిసరి కాదని ఆమె నమ్ముతోంది.
  • గతంలో ఐశ్వర్య మ్యాట్రిమోనీ సైట్‌లో ప్రొఫైల్ పెట్టింది, కానీ ఫేక్ అని అందరూ అనుకున్నారు.
  • విడిపోయే బంధం కంటే సహజీవనం మేలని ఐశ్వర్య అభిప్రాయపడ్డారు.

ప్రముఖ నటి ఐశ్వర్య లక్ష్మి పెళ్లి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. పెళ్లి చేసుకోవడం కంటే ముఖ్యమైన విషయాలు చాలా ఉన్నాయని ఆమె అన్నారు. ఈ నేపథ్యంలో ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఐశ్వర్య లక్ష్మి పెళ్లిపై సంచలన వ్యాఖ్యలు

Aishwarya Lakshmi: ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ వివాహం చేసుకోమంటే మాత్రం పెళ్లి వద్దు అదే ముద్దు అంటూ కామెంట్లు చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలోనే ఇటీవల ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో అందరి దృష్టిని ఆకట్టుకున్న మానస వారణాసి (Manasa Varanasi) కూడా పెళ్లికి ముందు సహజీవనం మంచిదే అని కామెంట్లు చేసి వార్తల్లో నిలిచింది .ఇప్పుడు మరో యంగ్ బ్యూటీ కూడా పెళ్లి వద్దు అదే ముద్దు అంటే కామెంట్లు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె ఎవరో కాదు ఐశ్వర్య లక్ష్మీ.

కన్నడ బ్యూటీగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఐశ్వర్య లక్ష్మీ తన పెళ్లి విషయంలో చాలా క్లారిటీగా ఉంది. 34 సంవత్సరాల వయసున్న ఈమె తనకు పెళ్లి పట్ల అసలు ఆసక్తి లేదు అని తేల్చి చెప్పేసింది. 29 సంవత్సరాల వయసులోనే తనకు పెళ్లిపై పూర్తి అవగాహన వచ్చిందని, అందుకే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టే ఉద్దేశమే లేదని స్పష్టం చేసి.. ఇకపోతే తన నిర్ణయాన్ని ఎవరు మార్చలేరని.. సంతోషకరమైన జీవితం గడపడానికి పెళ్లి అనేది తప్పనిసరి నిబంధన అయితే కాదని బలంగా నమ్ముతోంది ఐశ్వర్య లక్ష్మి. అందుకే చుట్టూ ఉన్న సమాజంలో జరిగే అనేక వివాహాలను గమనించిన తర్వాతే తాను ఆ అభిప్రాయానికి వచ్చినట్లు తెలిపింది.

పెళ్లి కంటే ముఖ్యమైంది అదే అంటున్న నటి

ఈ క్రమంలోనే ఐశ్వర్య లక్ష్మి మాట్లాడుతూ..” గత 30 ఏళ్ల నా జీవితంలో ఎన్నో జంటలను చూశాను. అయితే వారిలో మనస్ఫూర్తిగా సంతోషంగా ఉన్న జంటలు చాలా తక్కువ. పెళ్లి తర్వాత భాగస్వామ్య కెరియర్ లో ఆటంకాలు కడగడం నన్ను ఆలోచింపజేసింది. ఒకప్పుడు నేను కూడా పెళ్లి గురించి ఎన్నో అందమైన కలలు కన్నాను. కానీ కాలక్రమేనా నా ఆలోచనలు పూర్తిగా మారిపోయాయి. పెళ్లి చేసుకుని విడిపోవడం కంటే పెళ్లి కంటే ముందే సహజీవనం చేయడమే మంచిది.

ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఒకానొక సమయంలో ఐశ్వర్య కూడా తన కెరీర్ ను పక్కనపెట్టి పెళ్లి చేసుకోవాలనే ఆలోచనతో తన ప్రొఫైల్ ను మ్యాట్రిమోనీ వెబ్సైట్లో కూడా పెట్టింది. కానీ ఒక సెలబ్రిటీ ప్రొఫైల్ కావడంతో అది ఫేక్ అని భావించి చాలామంది లైట్ తీసుకున్నారట. సరిగా అదే సమయంలో పెళ్లి అనే వ్యవస్థ పై తన ఆలోచన పూర్తిగా మారిపోయిందని.. ఇద్దరు వ్యక్తుల మధ్య మనశ్శాంతి, తృప్తి ఉండాలి. అయితే అది పెళ్లితోనే సాధ్యం కాదని గట్టిగా చెబుతోంది ఐశ్వర్య.. పెళ్లిపై ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్న ఐశ్వర్య లక్ష్మిని మార్చి ఆమె జీవితంలోకి ఎవరైనా వ్యక్తి వచ్చి.. ఆమె వైవాహిక బంధం లో సంతోషంగా ఉండాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. మరి ఆరోజు ఎప్పుడు వస్తుందో చూడాలి.

సహజీవనంపై ఐశ్వర్య లక్ష్మి అభిప్రాయం

మొత్తానికి ఐశ్వర్య లక్ష్మి పెళ్లి గురించి తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. ఆమె నిర్ణయం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించినప్పటికీ, ఆమె మాత్రం తన అభిప్రాయంపై గట్టిగా ఉన్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.