|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Ajay Devgan: గోల్‌మాల్ మళ్ళీ వస్తున్నాడు.. మ్యాడ్ అండ్ మస్తీకి సిద్ధంగా ఉండండి అంటూ పోస్ట్

Published: 16-06-2025, 12:08 PM
Ajay Devgan: గోల్‌మాల్ మళ్ళీ వస్తున్నాడు.. మ్యాడ్ అండ్ మస్తీకి సిద్ధంగా ఉండండి అంటూ పోస్ట్

అజయ్ దేవగన్ మరియు రోహిత్ శెట్టి కాంబినేషన్ లో వచ్చే గోల్‌మాల్ సినిమా సిరీస్ 5వ భాగం గురించి ఓ వార్త వైరల్ అవుతోంది. 2026లో విడుదల కానున్న ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Key Points

1

అజయ్ దేవగన్ నటించిన గోల్‌మాల్ సినిమా సిరీస్‌కు 5వ భాగం రాబోతోంది.

2

గోల్‌మాల్ 5 2026లో విడుదల కానుంది.

4

ఈ కామెడీ సిరీస్ భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందింది.

గోల్‌మాల్ 5వ భాగం 2026లో?

డైరెక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గా, స్టార్ హీరోగా ఇండస్ట్రీలో దూసుకుపోతున్న అజయ్ దేవగన్ (Ajay Devgan).. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆయన సినిమాకు సంబంధించి లేటెస్ట్‌గా మరో అప్డేట్ వచ్చింది. అజయ్ దేవగన్ నటించిన ‘గోల్‌మాల్’ సినిమా ఎలాంటి హిట్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గోల్‌మాల్ ఫన్ అన్‌లిమిటెడ్ అనే టైటిల్‌తో 2006లో రిలీజైన ఈ మూవీ అత్యధిక ప్రేక్షకాదరణ పొందగా.. ఈ ఫ్రాంచైజీలో గోల్‌మాల్ రిటర్న్స్ (2008), గోల్‌మాల్ 3 (2010) అండ్ గోల్‌మాల్ ఎగైన్ (2017) సినిమాలు రిలీజ్ అయ్యాయి.

ఇప్పుడు ఈ ఫ్రాంచైజీలో 5వ భాగానికి సంబంధించిన అప్డేట్ నెట్టింట వైరల్ అవుతోంది. ‘గోల్‌మాల్ 5వ భాగం కోసం అజయ్ దేవగన్, రోహిత్ శెట్టి తిరిలి కలుస్తున్నారు. భారతదేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ఈ కామెడీ ఫ్రాంచైజీ 2026లో రిలీజ్ కాబోతుంది.. మ్యాడ్ అండ్ మస్తీకి సిద్ధంగా ఉండండి’ అంటూ ఓ పోస్ట్ వైరల్ అవుతుండగా.. ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. కాగా. ఈ చిత్రాలన్నీ రోహిత్ శెట్టి దర్శకత్వం వహించారు. ఇందులో అజయ్ దేవగన్, అర్షద్ వార్సి, తుషార్ కపూర్, శ్రేయాస్ తల్పాడే తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.

అజయ్ దేవగన్ మరియు రోహిత్ శెట్టి కాంబినేషన్

ప్రేక్షకులకు గోల్‌మాల్ పండగ

గోల్‌మాల్ సిరీస్ అభిమానులకు ఇది గొప్ప వార్త. 2026లో విడుదలయ్యే ఈ కొత్త భాగం మరింత హాస్యంతో, మంచి వినోదాన్ని అందించడానికి సిద్ధంగా ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.