
📌 Key Points
- అజిత్ ‘గ్యాంబ్లర్’ రీ రిలీజ్‌తో తమిళనాడులో టెన్షన్ వాతావరణం!
- విజయ్ ఫ్యాన్‌పై అజిత్ ఫ్యాన్స్ దాడి, వీడియో సోషల్ మీడియాలో వైరల్
- మొదటి రోజు ‘గ్యాంబ్లర్’ కలెక్షన్స్: రూ. 4.1 కోట్లు – రికార్డ్ బ్రేక్!
- తమిళనాడులో అజిత్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని ప్రూవ్ అయింది.
తమిళ తంబీల ఫ్యాన్ వార్ మరోసారి టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అజిత్ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. విజయ్ ఫ్యాన్ ను కొట్టడానికి కారణం ఏంటి? అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే చదవండి.
థియేటర్లో దళపతి ఫ్యాన్‌పై దాడి!
స్టార్ హీరోల అభిమానం దాడికి దారి తీసింది. తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ బ్లాక్ బస్టర్ హిట్ ‘మంగాత్తా’ (తెలుగులో గ్యాంబ్లర్) రీ రిలీజ్ సందర్భంగా తమిళనాడులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. థియేటర్‌లో దళపతి విజయ్ అభిమానిపై అజిత్ న్స్ దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తమిళ చిత్ర పరిశ్రమలో తల అజిత్ కుమార్, దళపతి విజయ్ అభిమానుల మధ్య ఉండే పోటీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా అజిత్ 2011 నాటి సంచలన చిత్రం ‘మంగాత్తా’ (తెలుగులో గ్యాంబ్లర్) రీ రిలీజ్ సందర్భంగా ఈ విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. థియేటర్ లోపల జరిగిన ఒక దాడి ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది.
‘గ్యాంబ్లర్’ రీ రిలీజ్ రికార్డ్ కలెక్షన్స్
అజిత్ సినిమా థియేటర్‌లో విజయ్ టీవీకే జెండా పట్టుకుని దళపతి అభిమాని ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆగ్రహానికి గురైన అజిత్ ఫ్యాన్స్ విజయ్ అభిమానిపై మూకుమ్మడిగా దాడి చేశారు. అతని చొక్కా చింపివేసి, థియేటర్ బయటకు గెంటేశారు.
“విజయ్ అభిమానుల తిక్కను అజిత్, రజనీకాంత్ ఫ్యాన్స్ మాత్రమే కుదర్చగలరు” అంటూ మరొకరు వీడియోను పోస్ట్ చేశారు. “ఎంత అభిమానం ఉన్న మరొక హీరో సినిమా సమయంలో జెండా ఊపడం కరెక్ట్ కాదు కదా” అని మరొక నెటిజన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
మొదటి రోజున మంగాత్తా (గ్యాంబ్లర్) సుమారు రూ. 4.1 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. కేవలం తమిళనాడులోనే రూ. 3.75 కోట్ల గ్రాస్ సాధించి, అజిత్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించింది.
అజిత్, విజయ్ అభిమానుల మధ్య గొడవలు ఎప్పుడూ హాట్ టాపిక్కే. ‘గ్యాంబ్లర్’ రీ రిలీజ్ మరింత హీట్ పెంచింది. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి!


