
📌 Key Points
- నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ 2’ విడుదలపై అభిమానులు గందరగోళంలో ఉన్నారు.
- ఫైనాన్స్ సమస్యల కారణంగా సినిమా విడుదల చివరి నిమిషంలో వాయిదా పడింది.
- డిసెంబర్ 12న సినిమా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బాలయ్య ఫ్యాన్స్ నిర్మాతలకి వార్నింగ్ ఇస్తున్నారు.
- ఇరోస్ ఇంటర్నేషనల్‌కు సుమారు 50 కోట్లకు పైగా చెల్లించాల్సి ఉండటంతో సినిమా నిలిచిపోయింది.
బాలకృష్ణ నటించిన అఖండ 2 సినిమా విడుదల విషయంలో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆర్థిక సమస్యలతో సినిమా వాయిదా పడటంతో ఆగ్రహించిన ఫ్యాన్స్, డిసెంబర్ 12న సినిమాను విడుదల చేయాలని నిర్మాతలకు వార్నింగ్ ఇస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. నిర్మాతలు త్వరగా స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
అఖండ 2 విడుదల వాయిదా: అభిమానుల ఆగ్రహం
Akhanda 2: నందమూరి బాలకృష్ణ(Balakrishna) హీరోగా నటించిన అఖండ2(Akhanda 2) సినిమా విడుదల విషయంలో అభిమానులు గందరగోళంలో ఉన్నారు ఈ సినిమా విడుదలవుతుంది అంటూ పెద్ద ఎత్తున ఏర్పాట్లు అన్ని చేసుకున్నారు కాని చివరి నిమిషంలో ఈ సినిమా ఫైనాన్స్ ఇబ్బందులు కారణంగా వాయిదా పడిన నేపథ్యంలో అభిమానులు కూడా నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా విడుదల గురించి నిత్యం ఏదో ఒక వార్త బయటకు వస్తుంది కానీ ఇప్పటివరకు అధికారకంగా చిత్ర బృందం ఎక్కడ విడుదల తేదీ గురించి ప్రకటన ఇవ్వలేదు దీంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇలా అఖండ 2 సినిమా విడుదల గురించి స్పష్టత రాని నేపథ్యంలో బాలకృష్ణ అభిమానులు నిర్మాణ సంస్థకు వార్నింగ్ ఇస్తూ సోషల్ మీడియాలో హాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా “# WeWantAkhanda2OnDec12th” అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. ఈ సినిమాని డిసెంబర్ 12వ తేదీ కచ్చితంగా విడుదల చేయాలి అంటూ ఈ హ్యాష్ టాగ్ సోషల్ మీడియాలో వైరల్ చేయడమే కాకుండా నిర్మాతలను కూడా హెచ్చరిస్తున్నారు.. ఇలా సినిమా విడుదల విషయంలో త్వరలోనే సరైన స్పష్టత ఇవ్వని నేపథ్యంలో బాలయ్య అభిమానుల నుంచి నిర్మాతలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు కూడా కనపడుతున్నాయి.
నిర్మాతలకు బాలయ్య ఫ్యాన్స్ వార్నింగ్
ఇక ఈ సినిమా ఫైనాన్స్ విషయంలో నిర్మాతలు సుమారు 50 కోట్లకు పైగా ఇరోస్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్ వారికి చెల్లించాల్సి ఉందని ఈ డబ్బులు చెల్లించే వరకు సినిమా విడుదలకు అనుమతి లేదని తెలపడంతో సినిమా చివరి నిమిషంలో ఆగిపోయింది ఇప్పటికే చిత్ర నిర్మాతలు పెద్ద ఎత్తున చర్చలు జరుపుతున్నప్పటికీ ఈ సమస్యకు పరిష్కారం రాలేదని తెలుస్తోంది. మరి అఖండ 2 విడుదల విషయంలో నిర్మాతలు ఎలాంటి నిర్ణయాలను తీసుకుంటారనేది తెలియాల్సి ఉంది.
ఆర్థిక సమస్యలు, కొత్త విడుదల తేదీలు
ఆఖండ2 సినిమా డిసెంబర్ ఐదవ తేదీ విడుదల కావాల్సి ఉండగా చివరి నిమిషంలో వాయిదా పడింది. అయితే ఈ సినిమాని డిసెంబర్ 12వ తేదీ విడుదల చేయొచ్చు అని వార్తలు మాత్రం హల్చల్ చేస్తున్నాయి కానీ స్పష్టత లేదు ఒకవేళ డిసెంబర్ 12వ తేదీ విడుదల కానీ నేపథ్యంలో ఈ సినిమా డిసెంబర్ 25వ తేదీ విడుదల కాబోతుందని తెలుస్తుంది. ఇలా అఖండ సినిమా ఈ రెండు తేదీలలో విడుదల అయితే ఎన్నో సినిమాలు తీవ్రస్థాయిలో ఇబ్బందులను ఎదుర్కొంటాయి. 12వ తేదీ అలాగే 25వ తేదీ భారీ స్థాయిలో చిన్న సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇలాంటి తరుణంలోనే ఆఖండ2 విడుదల అయితే చిన్న సినిమాలపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని తెలుస్తుంది. మరి ఆఖండ2 వివాదానికి ఎప్పుడు తెర పడుతుందనేది తెలియాల్సింది.
అఖండ 2 విడుదల తేదీపై నెలకొన్న సందిగ్ధత నిర్మాతలకి, అభిమానులకి మధ్య ఉద్రిక్తతకు దారితీస్తోంది. ఆర్థిక సమస్యల పరిష్కారం, సరైన విడుదల తేదీ ప్రకటించే వరకు ఈ ఉత్కంఠ కొనసాగే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.


