|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

హేమ సంచలనం: ట్రోలర్స్‌పై సీపీ సజ్జనార్‌కు ఫిర్యాదు, కఠిన చర్యలకు డిమాండ్!

Published: 11-06-2026, 4:30 AM
హేమ సంచలనం: ట్రోలర్స్‌పై సీపీ సజ్జనార్‌కు ఫిర్యాదు, కఠిన చర్యలకు డిమాండ్!
  • నటి హేమ తనపై అసభ్యకర కామెంట్లు చేసిన వారిపై సీపీ సజ్జనార్‌కు ఫిర్యాదు చేశారు.
  • ఆధారాలతో సహా లిఖితపూర్వక ఫిర్యాదును అందజేశారు.
  • సీపీ సజ్జనార్ కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి, కేసును సైబర్ క్రైమ్‌కు బదిలీ చేశారు.
  • ఐపీ అడ్రస్‌ల ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.

సోషల్ మీడియాలో తనపై అసభ్యకర కామెంట్లు, ట్రోలింగ్ చేస్తున్న వారిపై సినీనటి హేమ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్‌ను కలిసి, ఆధారాలతో సహా లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. ఈ చర్యతో ట్రోలర్స్‌కు గట్టి షాక్ తగిలింది.

హేమ ఫిర్యాదు: ట్రోలర్స్‌కు షాక్!

Hema Complaint: సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీలను, ముఖ్యంగా మహిళా నటీమణులను టార్గెట్ చేస్తూ అసభ్యకరమైన కామెంట్స్ చేసే నెటిజన్ల ఆటకట్టించడానికి సినీనటి హేమ రంగంలోకి దిగారు. గత కొంతకాలంగా తనపై ఇష్టమొచ్చినట్టు వల్గర్ కామెంట్స్, ట్రోలింగ్ చేస్తున్న పలువురిపై ఆమె చట్టపరమైన చర్యలకు ఉపక్రమించారు. ఈ మేరకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్‌ను నేరుగా కలిసి, ఆధారాలతో సహా లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు.

Read also- Jabardast Varsha : జబర్దస్త్ వర్ష నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

సీపీ సజ్జనార్‌ను కలిసిన అనంతరం నటి హేమ ఒక సెల్ఫీ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు. తనపై జరుగుతున్న డిజిటల్ వేధింపులపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “నాపై వల్గర్ కామెంట్స్ పెట్టొద్దని, ఒకవేళ అలా చేస్తే లీగల్‌గా యాక్షన్ తీసుకుంటానని నేను ముందే హెచ్చరించాను. అయినా కొంతమందిలో మార్పు రాలేదు, నా హెచ్చరికలను బేఖాతరు చేస్తూ అసభ్యకరంగా పోస్టులు పెడుతూనే ఉన్నారు. ఇక నా ఓపిక నశించింది. అందుకే నన్ను బ్యాడ్ గా ట్రోల్ చేసిన, అసభ్య కామెంట్స్ పెట్టిన వాళ్లందరి ప్రొఫైల్స్, కామెంట్ల స్క్రీన్ షాట్లను సేకరించాను. వాటన్నింటినీ సీపీ సజ్జనార్ గారికి అందజేసి కంప్లయింట్ ఇచ్చాను” అని హేమ స్పష్టం చేశారు.

సీపీ సజ్జనార్ స్పందన, సైబర్ క్రైమ్‌కు బదిలీ

నటి హేమ ఇచ్చిన ఫిర్యాదుపై సీపీ సజ్జనార్ సానుకూలంగా స్పందించారు. సోషల్ మీడియాలో మహిళల గౌరవానికి భంగం కలిగించేలా, వ్యక్తిగత దూషణలకు దిగే వారిపై కఠిన చర్యలు ఉంటాయని భరోసా ఇచ్చారు. ఈ కేసును తదుపరి దర్యాప్తు నిమిత్తం సైబర్ క్రైమ్ విభాగానికి బదిలీ చేశారు. హేమ సమర్పించిన స్క్రీన్ షాట్ల ఆధారంగా.. సదరు ఐడీల ఐపీ (IP) అడ్రస్‌లను ట్రాక్ చేసి, నిందితులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.

Read also- ‘పెద్ది’ వీకెండ్ కలెక్షన్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే.. రామ్ చరణ్ కెరీర్ లోనే..

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో సెలబ్రిటీలపై నెగెటివిటీని స్ప్రెడ్ చేయడం, బూతులు తిట్టడం కొందరికి అలవాటుగా మారిందని, ఇలాంటి వారికి ఈ కేసు ఒక గుణపాఠం కావాలని హేమ పేర్కొన్నారు. సెలబ్రిటీలైనా, సాధారణ మహిళలైనా సరే.. డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్‌పై వేధింపులకు గురైతే ఊరుకునేది లేదని, ఐటీ యాక్ట్, సైబర్ చట్టాల ప్రకారం కఠిన శిక్షలు పడేలా ముందడుగు వేస్తానని ఆమె హెచ్చరించారు. ప్రస్తుతం నటి హేమ తీసుకున్న ఈ లీగల్ నిర్ణయం ఆమె షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే పోలీసులు జోక్యంతో ఈ సమస్య ఎంత వరకూ సర్థుమణుగుతుందో చూడాలి.

డిజిటల్ వేధింపులపై హేమ హెచ్చరిక

వారి గురించి పోలీసులకు ఫిర్యాదు చేసిన హేమ.. pic.twitter.com/tFbTXqa7jN

— Babu manchala (@manchalababu03) June 11, 2026

నటి హేమ తీసుకున్న ఈ చట్టపరమైన చర్య డిజిటల్ వేధింపులకు గురవుతున్న మహిళలకు ఆదర్శంగా నిలుస్తుంది. సోషల్ మీడియాలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే వారికి ఇది ఒక గుణపాఠం కావాలని ఆమె ఆకాంక్షించారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.