|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అఖండ 2 లో బాలయ్య కంటే 48 ఏళ్లు చిన్న నటి ఎవరో తెలుసా? ఐదుగురు హీరోయిన్ల ఏజ్ గ్యాప్ ఎంత?

Published: 13-12-2025, 7:48 AM
అఖండ 2 లో బాలయ్య కంటే 48 ఏళ్లు చిన్న నటి ఎవరో తెలుసా? ఐదుగురు హీరోయిన్ల ఏజ్ గ్యాప్ ఎంత?
  • అఖండ 2లో బాలకృష్ణ వయసు 65 ఏళ్లు, ఐదుగురు హీరోయిన్లు నటించారు.
  • బాలయ్య కంటే 48 ఏళ్లు చిన్నదైన హర్షాలీ మల్హోత్రా ఆయన కూతురి పాత్రలో నటించింది.
  • ప్రధాన హీరోయిన్ సంయుక్త మీనన్, బాలకృష్ణ కంటే 35 ఏళ్లు చిన్నది.
  • పూర్ణ, ప్రగ్యా, వీజీ చంద్రశేఖర్ ల ఏజ్ గ్యాప్ వివరాలు కూడా వైరల్ అవుతున్నాయి.

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘అఖండ 2’ సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. ఈ సినిమాలో బాలయ్యతో నటించిన ఐదుగురు హీరోయిన్ల వయసు వ్యత్యాసం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. వారి పాత్రలు, ఏజ్ గ్యాప్‌ల వివరాలు తెలుసుకోండి.

బాలకృష్ణ – అఖండ 2 హీరోయిన్ల వయసు వ్యత్యాసం

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా, బోయపాటి డైెరెక్షన్ లో నటించిన సినిమా అఖండ 2. ఎన్నో అవాంతరాల తరువాత  ఈ శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతోంది.  ఈ  సినిమాకు కొన్చిని చోట్ల  మిశ్రమ స్పందన లభిస్తోంది. బాలయ్య అభిమానులు మాత్రం పూనకాలతో ఊగిపోతున్నారు. కాగా బాక్సాఫీస్ దగ్గర అఖండ2  ఫస్ట్ డే 36 కోట్ల వరకూ వసూలు చేసింది. ఇక ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్లు కనిపించగా.. బాలయ్యకు ఆ హీరోయిన్లకు మధ్య ఏజ్ గ్యాప్ పై వార్తలు వైరల్ అవుతున్నాయి.

‘అఖండ 2: తాండవం’లో సంయుక్త మీనన్ మెయిన్ హీరోయిన్ గా నటించింది. సినిమాలో  వైరస్‌ను నాశనం చేసే యాంటీడోట్‌ను తయారుచేసే ల్యాబ్ హెడ్ అర్చనా గోస్వామి పాత్రను సంయుక్త మీనన్ పోషించారు. 65 ఏళ్ల బాలకృష్ణ కంటే ఆమె 35 ఏళ్లు చిన్నది.

సంయుక్త మీనన్, హర్షాలీ మల్హోత్రా పాత్రలు, ఏజ్ గ్యాప్

‘అఖండ 2: తాండవం’లో హర్షాలీ మల్హోత్రా DRDO సైంటిస్ట్ అయిన డా. జనని పాత్రలో నటించింది. ఆమె మురళీ కృష్ణ (బాలకృష్ణ) కూతురిగా కనిపించింది. ఆమె NBK కంటే 48 ఏళ్లు చిన్నది.

టాలీవుడ్ లో ఒకప్పుడు హీరోయిన్ గా వరుస సినిమాలు చేసిన పూర్ణ కూడా ఈ మూవీలో నటించింది.  బాలకృష్ణ కంటే 29 ఏళ్లు చిన్నదైన పూర్ణ ఖాసిం, ‘అఖండ 2’లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐఏఎస్ పద్మావతి పాత్రను పోషించింది.

పూర్ణ, ప్రగ్యా, వీజీ చంద్రశేఖర్: ఇతర నటీనటుల వివరాలు

బాలకృష్ణ కంటే 31 ఏళ్లు చిన్నదైన ప్రగ్యా, మురళీ కృష్ణ భార్య ఐఏఎస్ శరణ్య బచ్చుపల్లిగా నటించింది. కానీ, ఈసినిమాలో  ఆమె ఫోటో మాత్రమే వాడారు. మొదటి భాగం ‘అఖండ’లో ఆమె లీడ్ హీరోయిన్ గా నటించింది.

‘అఖండ 2: తాండవం’లో వీజీ చంద్రశేఖర్, అఖండ, మురళి (బాలకృష్ణ) తల్లి ధరణి పాత్రలో నటించారు. విశేషమేమిటంటే, ఆమె బాలయ్య కంటే 6 ఏళ్లు చిన్నది.

మొత్తంగా, ‘అఖండ 2’ సినిమా కేవలం బాలకృష్ణ నటనతోనే కాకుండా, ఆయనతో నటించిన హీరోయిన్ల వయసు వ్యత్యాసంతో కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ వివరాలు అభిమానులను మరింత ఆకట్టుకుంటున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.