|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Akhanda 2 Day1 Collections : అడ్వాన్స్ బుకింగ్‌లో బాలయ్య ఊచకోత.. ఫస్ట్ డే ఎన్ని కోట్లు వసూళ్లు అంటే?

Published: 11-12-2025, 4:37 AM
Akhanda 2 Day1 Collections : అడ్వాన్స్ బుకింగ్‌లో బాలయ్య ఊచకోత.. ఫస్ట్ డే ఎన్ని కోట్లు వసూళ్లు అంటే?
  • అఖండ 2 సినిమా డిసెంబర్ 12న విడుదల కానుంది, ప్రీమియర్లు డిసెంబర్ 11న ప్రసారం.
  • సుమారు 5 కోట్ల వరకు అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి, ఇది సినిమాకు భారీ ప్లస్.
  • నైజాం ఏరియాలో ప్రీమియర్లకు ఒక్కో టికెట్ ధర 600కు పెంచుతూ ప్రభుత్వం అనుమతి.
  • మొదటిరోజు 50-55 కోట్ల కలెక్షన్లు అంచనా వేస్తున్నారు, ఇది బాలకృష్ణ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్.

బాలకృష్ణ నటించిన అఖండ 2 సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్‌లో అద్భుతమైన స్పందన పొందింది. ప్రీమియర్లతో కలిపి మొదటి రోజునే 50-55 కోట్ల భారీ వసూళ్లు సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇది బాలకృష్ణ కెరీర్‌లోనే రికార్డు ఓపెనింగ్స్ అవుతాయి.

అఖండ 2 అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డ్

Akhanda 2 Day1collections : నందమూరి బాలకృష్ణ(Balakrishna) హీరోగా నటించిన ఆఖండ 2 (Akhanda 2)సినిమా మరికొన్ని గంటలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నిజానికి ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీ విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ డిసెంబర్ 12వ తేదీ విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే డిసెంబర్ 11వ తేదీ సాయంత్రం ప్రీమియర్లు ప్రసారం కానున్నాయి. దీంతో మరికొన్ని గంటలలో ఈ సినిమా ప్రసారం కానున్న నేపథ్యంలో భారీగా అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా ఇదివరకు ఎప్పుడూ లేనివిధంగా ప్రీమియర్లు ప్రసారం కానున్నాయి. డిసెంబర్ 12వ తేదీ అఖండ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో చిన్న సినిమాలన్నీ కూడా తప్పుకోవడంతో భారీగా ప్రీమియర్లను ప్రసారం చేయనున్నారు.

ఇక ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ కూడా భారీ స్థాయిలో జరిగాయి. డిసెంబర్ 12వ తేదీ ఈ సినిమా విడుదలైన నేపథ్యంలో సుమారు 5 కోట్ల వరకు అడ్వాన్స్ బుకింగ్స్ అయ్యాయని తెలుస్తోంది. ఇక ప్రీమియర్లకు నైజాం ఏరియాలో ఒక్కో టికెట్ ధర 600 పెంచుతూ ప్రభుత్వం అనుమతి తెలిపిన సంగతి తెలిసిందే. ఇలా అడ్వాన్స్ బుకింగ్ తో పాటు ప్రీమియర్లను కలుపుకుంటే అఖండ 2 మొదటి రోజే భారీ స్థాయిలో కలెక్షన్లను సాధించబోతుందని తెలుస్తోంది. ఇలా ప్రీమియర్ షోలతో పాటు మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్ కలుపుకుంటే ఈ సినిమా మొదటి రోజే 50 నుంచి 55 కోట్ల కలెక్షన్లను రాబట్టే అవకాశాలు ఉన్నట్టు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు.

మొదటిరోజు అంచనా వసూళ్లు

ఇలా బాలకృష్ణ సినిమా కెరియర్ లోనే ఈ స్థాయిలో ఏ సినిమాకు ఓపెనింగ్స్ రాలేదని చెప్పాలి. అయితే అఖండ 2 సినిమా ఐదో తేదీన వాయిదా పడటం ఈ సినిమాకు మరింత ప్లస్ అయిందని చెప్పాలి. ఇలా ఈ సినిమా వాయిదా పడటంతో అడ్వాన్స్ బుకింగ్స్ భారీగా పెరిగిపోయాయి.. మరి కొన్ని గంటలలో బాక్సాఫీస్ బాలయ్య అఖండ తాండవం చూడబోతోందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాకు కేవలం నైజం ఏరియాలో మాత్రమే కాకుండా సీడెడ్, ఓవర్సీస్ లో కూడా భారీగా ఆదరణ లభిస్తుంది. మరి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలను సృష్టించబోతుందో తెలియాల్సి ఉంది.

బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ అంటేనే సూపర్ హిట్ కాంబినేషన్ అని చెప్పాలి. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయంలో కనిపించబోతున్నారు. ఇక ఈ సినిమా సనాతన ధర్మ పరిరక్షణ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా అంటూ బాలకృష్ణ సినిమా గురించి మాట్లాడుతూ భారీగా అంచనాలను పెంచేశారు. ఇక ఇటీవల ఈ సినిమా విడుదల సందర్భంగా టీజర్ విడుదల చేయడంతో ఈ వీడియో కాస్త రెట్టింపు స్థాయిలో అంచనాలను పెంచేసింది. ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా సంయుక్త మీద నటించగా ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు.

బాలకృష్ణ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్

అఖండ 2 సినిమా మొదటిరోజు కలెక్షన్లతో బాలకృష్ణ కెరీర్‌లో రికార్డు ఓపెనింగ్స్‌ను నమోదు చేయనుంది. బాలయ్య-బోయపాటి కాంబినేషన్, సనాతన ధర్మ పరిరక్షణ నేపథ్యం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణలు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.