|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అఖండ 2 ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌..ఎన్నికోట్లంటే?

Published: 12-12-2025, 8:08 PM
అఖండ 2 ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌..ఎన్నికోట్లంటే?
  • నందమూరి బాలయ్య ‘అఖండ 2’ సినిమాకు అద్భుతమైన పాజిటివ్ టాక్ లభించింది.
  • రెండు తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్‌లో థియేటర్లు హౌస్ ఫుల్ అయినట్లు వార్తలు.
  • తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 65-80 కోట్ల గ్రాస్ వసూలు చేసే అవకాశం ఉందని అంచనా.
  • మొదటి వారంలో దాదాపు రూ.150 కోట్ల గ్రాస్ రాబట్టే ఛాన్స్; ‘అఖండ’ రికార్డులు బద్దలు.

నందమూరి బాలయ్య హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ‘అఖండ 2’ సినిమా నిన్న రిలీజ్ అయింది. ఈ సినిమాకు అద్భుతమైన పాజిటివ్ టాక్ రావడంతో, తొలిరోజు కలెక్షన్లపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందనే చర్చ మొదలైంది.

అఖండ 2కి అద్భుతమైన స్పందన, హౌస్ ఫుల్స్

నందమూరి బాలయ్య లేటెస్ట్ గా నటించిన సినిమా అఖండ 2. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నిన్న రిలీజ్ అయింది. డిసెంబర్ 11వ తేదీన రాత్రి ప్రీమియర్లు పడిపోయాయి. అఖండ 2 సినిమాకు మంచి పాజిటివ్ టాక్ వ‌చ్చింది. దీంతో నిన్నటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఓవర్సీస్ లో కూడా థియేటర్లు హౌస్ ఫుల్ అయినట్లు చెబుతున్నారు. మాస్, యాక్షన్ తో పాటు హిందూ ధర్మం చుట్టూ ఈ కథ నడవడంతో ఈ సినిమా చూసి ఎందుకు ఇగబడుతున్నారట జనాలు.

తొలిరోజు కలెక్షన్స్ అంచనాలు, సోషల్ మీడియా బజ్

దానికి తోడు పెద్ద సినిమాలు ప్రస్తుతం లేకపోవడంతో, బాలయ్య అఖండ 2 సినిమాకు మంచి కలెక్షన్స్ వ‌చ్చే ఛాన్సు ఉన్న‌ట్లు టాక్‌. అయితే ఈ నేపథ్యంలోనే తొలిరోజు కలెక్షన్స్ పై సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది. కేవలం బుక్ మై షోలో గంటకు 20 వేల అఖండ 2 టికెట్లు బుక్ అవుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అంటే ఈ లెక్కన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా తొలిరోజు రూ. 65 నుంచి రూ.80 కోట్ల వరకు గ్రాస్ రాబట్టే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయట.

అఖండ 1తో పోలిక: మొదటి వారం టార్గెట్

ఈ లెక్కన మొదటి వారంలో అఖండ 2 సినిమా దాదాపు రూ. 150 కోట్ల వరకు గ్రాస్ రాబట్టే అవకాశాలు ఉన్నట్లు టాలీవుడ్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. అటు 2021లో అఖండ సినిమా కూడా భారీగానే కలెక్షన్స్ రాబట్టింది. కరోనా సమయంలో కూడా అఖండ మూవీ తొలిరోజు రూ.30 కోట్ల గ్రాస్ రాబట్టి సత్తా చాటింది. మరి ఈ అఖండ 2 ఏ రేంజ్ లో క‌లెక్ష‌న్స్‌ రాబడుతుందో చూడాలి.

‘అఖండ 2’ తొలిరోజు భారీ వసూళ్లు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా. మొదటి వారంలో రూ.150 కోట్ల మార్క్‌ను దాటే ఛాన్స్. బాక్సాఫీస్ వద్ద ‘అఖండ 2’ ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.