|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

‘అఖండ-2’ హైందవం లిరికల్ సాంగ్ వ‌చ్చేసింది

Published: 01-12-2025, 6:50 PM
‘అఖండ-2’ హైందవం లిరికల్ సాంగ్ వ‌చ్చేసింది
  • నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ 2’ డిసెంబర్ 5న విడుదల కానుంది.
  • ‘హైందవం’ లిరికల్ సాంగ్ తాజాగా విడుదలైంది; దీనికి తమన్ సంగీతం అందించారు.
  • ఈ పాటను నాగ గురునాథ శర్మ రాయగా, సర్వేపల్లి సిస్టర్స్ ఆలపించారు.
  • సినిమా హిందూ ధర్మం, ఆధ్యాత్మిక అంశాల చుట్టూ నడుస్తుంది.

నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న ‘అఖండ 2’ సినిమా నుండి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘హైందవం’ లిరికల్ సాంగ్ తాజాగా విడుదలైంది. ఆధ్యాత్మిక అంశాలతో కూడిన ఈ పాట సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ పాట విడుదలతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

‘అఖండ 2’ – భారీ అంచనాలు

నందమూరి బాలయ్య లేటెస్ట్ గా నటించిన సినిమా అఖండ 2. ఇప్పటికే ఈ సినిమా మొదటి భాగం రిలీజ్ అయి, అద్భుత విజయం సాధించింది. ఇక ఈ డిసెంబర్ 5వ తేదీన అఖండ 2 సినిమాతో వస్తున్నారు నందమూరి బాలయ్య. ఈ సినిమా ప్రకటన చేసిన వెంటనే బ్లాక్ బాస్టర్ అని అందరూ ఒక అంచనాకు వచ్చారు. హిందూ ధర్మం చుట్టూ ఈ కథాంశం నడుస్తుంది. ఇందులో సీన్లను దర్శకుడు బోయపాటి శ్రీను అద్భుతంగా తెరకెక్కించారట. మొన్న రిలీజ్ అయిన ట్రైలర్ లో బోయపాటి శ్రీను కష్టాన్ని చూడవచ్చు.

‘హైందవం’ పాట విశేషాలు

అమాంతం సినిమాపై ఆ ఒక్క ట్రైలర్ అంచనాలను పెంచింది. ఇక లేటెస్ట్ గా ఈ సినిమా నుంచి మరో కీలక అప్డేట్ వచ్చేసింది. బాలకృష్ణ హీరోగా చేసిన అఖండ 2 నుంచి హైందవం లిరికల్ సాంగ్ ను ( Akhanda Haindavam ) తాజాగా చిత్ర బృందం రిలీజ్ చేసింది. సనాతన ధర్మం ఆధ్యాత్మిక అంశాలతో రూపొందించిన ఈ పాటను నాగ గురునాథ శర్మ ఎంతో చక్కగా రాశారు.

సినిమాలోని కీలక నటీనటులు

ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ వాయించగా, సర్వేపల్లి సిస్టర్స్ ఈ పాటను ఆలపించారు. ఈ ఇద్దరు సర్వేపల్లి సిస్టర్స్ పలికే సాంస్కృత శ్లోకాలు సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. అలాంటి పాట తాజాగా రిలీజ్ అయిన నేపథ్యంలో జనాలు ఎగబడి చూస్తున్నారు. దీంతో ఈ పాట వ్యూస్ కూడా అమాంతం పెరిగిపోయాయి. కాగా అఖండ 2 సినిమాలో నందమూరి బాలయ్య హీరోగా చేయగా, సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించారు.

‘అఖండ 2’ నుండి విడుదలైన ‘హైందవం’ పాట సినిమా ప్రచారానికి భారీ ఊపనిచ్చింది. సనాతన ధర్మాన్ని ప్రతిబింబించే ఈ పాట సినిమా విజయంలో కీలక పాత్ర పోషించడం ఖాయం. బాలయ్య అభిమానులను ఈ చిత్రం మరింతగా అలరించనుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.