
📌 Key Points
- ‘సీతారామం’ సినిమాతో మృణాల్ ఠాకూర్ ఒక్క రాత్రిలో స్టార్‌గా మారింది.
- భాషలతో సంబంధం లేకుండా హద్దులు దాటి నటించడమే తనకి ఇష్టమని వెల్లడించింది.
- అన్ని రకాల సంస్కృతులను, భాషలను అనుభవించాలనేది మృణాల్ ఠాకూర్ కోరిక.
- ప్రస్తుతం అడివి శేష్‌తో కలిసి ‘డెకాయిట్’ సినిమాలో నటిస్తోంది; వచ్చే ఏడాది విడుదల.
‘సీతారామం’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిన మృణాల్ ఠాకూర్ తన కెరీర్ ప్లానింగ్‌పై కీలక వ్యాఖ్యలు చేసింది. భాషా హద్దులు దాటితేనే మంచి అవకాశాలు వస్తాయని, అన్ని రకాల అనుభవాలను పొందాలని తన కోరిక అని వెల్లడించింది.
ఓవర్ నైట్ స్టార్‌గా మృణాల్ ప్రస్థానం
‘సీతారామం’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది మృణాల్ ఠాకూర్(Mrunal Thakur). అందంతో పాటు, తన నటనతో కోట్ల మంది మనసులు గెలుచుకుంది. సీరియల్స్ ద్వారా కెరీర్ ప్రారంభించి ఒక్క మూవీతోనే ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసుకుంది. టాలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా వరుస అవకాశాలు అందుకుంటుంది. తన నటనతో అందరినీ మంత్రముగ్దులను చేస్తూ.. ఫుల్ ఫామ్‌లో ఉంది. ఇక తనకు భాషలతో సంబంధం లేదని సరిహద్దులు దాటి నటించడమే ఇష్టమని ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఒకే ఇండస్ట్రీలో స్థిరపడకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెబుతోంది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మృణాల్ మాట్లాడుతూ.. ‘‘నేను ఒక భాషకు మాత్రమే పరిమితం కావాలని ఎప్పుడూ అనుకోలేదు. హద్దులు దాటితేనే అవకాశాలు వస్తాయి. అందుకే..
ఒక నటిగా అన్ని రకాల సంస్కృతులను, భాషలను అనుభవించాలని నా కోరిక. తెలుగు సినిమాల్లో నటించడం వల్ల నాకు ఎంతో గౌరవం దక్కింది. ప్రేక్షకులు నన్ను తమ ఇంటి ఆడిబిడ్డలా ఆదిరస్తున్నారు. హిందీలో కూడా మంచి ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. భాష అనేది కేవలం భావవ్యక్తీకరణకు ఒక సాధనం మాత్రమే అని నేను నమ్ముతా. మంచి కథ ఉంటే.. ప్రరంచంలో ఎక్కడికైనా ఏ భాషలోనైనా వెళ్లి నటిస్తా’’ అని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. కాగా.. మృణాల్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఈ భామ హిందీలో రెండు ప్రాజెక్ట్స్ చేస్తుండగా.. తెలుగులో ‘డెకాయిట్’ చేస్తుంది. ఇందులో అడివి శేష్(adivi sesh) హీరోగా నటిస్తుండగా.. షానీల్ డియో(Shanil Deo) దర్శకత్వంలో రాబోతుంది. లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఉగాది కానుకగా.. మార్చి 19న విడుదల కానుంది.
సరిహద్దులు లేని నటనా ప్రయాణం
డెకాయిట్: మృణాల్ తదుపరి ప్రాజెక్ట్
మృణాల్ ఠాకూర్ తన కెరీర్‌లో భాషలకు అతీతంగా, విభిన్న పాత్రలను పోషించాలనే లక్ష్యంతో ఉంది. ఆమె ఈ సంచలన వ్యాఖ్యలు సినీ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. త్వరలో ‘డెకాయిట్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది.


