
📌 Key Points
- ‘అఖండ-2’ డిసెంబర్ 12న విడుదల, మొదట డిసెంబర్ 5న రావాల్సి ఉంది.
- ఈరోస్ ఇంటర్నేషనల్ కేసుతో విడుదల ఒక వారం ఆలస్యం కావాల్సి వచ్చింది.
- నిర్మాత రామ్ అచంట బాలకృష్ణ, బోయపాటి, అభిమానులకు క్షమాపణలు తెలిపారు.
- సినిమాకు మంచి స్పందన వస్తున్నా, ఇండస్ట్రీలో నెగిటివిటీ ఉందని నిర్మాత వ్యాఖ్యానించారు.
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల ‘అఖండ-2’ సినిమా వివాదాల మధ్య విడుదలైనప్పటికీ అద్భుతమైన స్పందన పొందుతోంది. అయితే, ఇండస్ట్రీలో దీనిపై నెగిటివిటీ ఉందని నిర్మాత రామ్ అచంట తాజాగా వెల్లడించారు. ఈ ఆలస్యం వెనుక అసలు కారణాలను ఆయన వివరించారు.
‘అఖండ-2’ విడుదల ఆలస్యం: వివాదాలు, వాయిదాలు
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna), బోయపాటి శ్రీను (Boyapati Srinu)కాంబోలో తెరకెక్కిన మూవీ ‘అఖండ-2’(Akhanda-2). ఈ సినిమా మొదలైనప్పటికీ నుంచి వివాదాలు ఎదుర్కొంటుంది. పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు డిసెంబర్ 12న థియేటర్స్‌లోకి వచ్చింది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదలైన ఈ మూవీ హిట్ టాక్‌తో బాక్సాఫీసును షేక్ చేస్తోంది. దీనికి అభిమానుల నుంచి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. ఇక ఈ సినిమా డిసెంబర్ 5న విడుదల కావాల్సి ఉండగా.. ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ కోర్టులో కేసు వేసింది. తమకు నిర్మాణ సంస్థ 14రీల్స్ ప్లస్.. రూ. 28 కోట్లు చెల్లించలేదని ‘అఖండ-2’ విడుదల చేయకూడదని కోర్టు అడ్డుకుంది. దీంతో అఖండ నిర్మాతలు ఈరోజ్ సంస్థ నిర్వాహకులతో చర్చలు జరిపి ‘అఖండ-2’ విడుదలకు ఒప్పించారు.
నిర్మాత రామ్ అచంట కీలక వ్యాఖ్యలు
దీంతో ఈ మూవీ డిసెంబర్ 12న థియేటర్స్‌లోకి వచ్చింది. ఇక ఆరోజు విడుదలకు సిద్ధమైన చిన్న చిత్రాలు వాయిదా వేశారు. ఈక్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిర్మాత రామ్ అచంట షాకింగ్ కామెంట్స్ చేశాడు. ‘‘అఖండ 2: తాండవం’ సినిమా కొన్ని అనివార్య కారణాల వల్ల, ఇష్యూస్ వల్ల, అనుకోని సంఘటనల వల్ల ఒక వారం వాయిదా వేయాల్సి వచ్చింది. దానికి బాలయ్య బాబుకి, ఆయన అభిమానులకి, డైరెక్టర్ బోయపాటి శ్రీనుకి మా 14 రీల్స్ నిర్మాణ సంస్థ తరపున సారీ చెప్తున్నాం. అది ఊహించని ఇష్యూ. సడన్ గా వెలుగులోకి వచ్చింది.
ఇండస్ట్రీ నెగిటివిటీపై చర్చలు
దాన్ని పరిష్కరించడానికి మ్యాంగో రామ్, దిల్ రాజు చాలా సపోర్ట్ చేశారు. వాళ్లకి థ్యాంక్స్ చెప్తున్నాం. ఒక వారం లేటైనా ఈ సినిమాకి బ్రహ్మాండమైన స్పందన లభిస్తోంది. ఫ్యాన్స్ అసలు సీట్లలో కూర్చోవడం లేదు. ట్రెమండస్ రెస్పాన్స్ వస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అన్ని ఏరియాల నుంచి మంచి కలెక్షన్స్, మంచి రిపోర్ట్ వస్తోంది. మాకు బయట నెగిటివిటీ ఏం లేదు కొద్దిగా ఇండస్ట్రీలో లోనే ఉంది.. రివ్యూస్‌ని తప్పు పట్టడానికి లేదు వాళ్ల అభిప్రాయం వాళ్లు చెప్పారు. ఎవరిని తప్పుపట్టడానికి లేదు’’ అని అన్నారు. ప్రజెంట్ ఈ వీడియోసోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు ఇండస్ట్రీలో వీరిపై తప్పుడు ప్రచారం చేస్తుంది ఎవరా అనే చర్చలు నెట్టింట మొదలయ్యాయి.అలాగే కొందరి మీద అనుమానాలు కూడా వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.
‘అఖండ-2’ వసూళ్లలో దూసుకుపోతున్నా, ఇండస్ట్రీలో నెలకొన్న నెగిటివిటీ చర్చనీయాంశంగా మారింది. ఈ తప్పుడు ప్రచారం వెనుక ఎవరున్నారనేది ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. అభిమానుల మద్దతు సినిమాకు బలంగా నిలుస్తోంది.


