|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Akhanda 2 Movie: బాలయ్య అఖండ-2.. జాజికాయ వచ్చేసింది!

Published: 18-11-2025, 11:28 AM
Akhanda 2 Movie: బాలయ్య అఖండ-2.. జాజికాయ వచ్చేసింది!

బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న అఖండ 2 చిత్రం నుంచి ‘జాజికాయ’ పాట విడుదలై అభిమానులను అలరిస్తోంది. అఘోరా పాత్రలో బాలయ్య కనిపించనున్న ఈ సినిమా డిసెంబర్ 5న 2డీ, 3డీ ఫార్మాట్లలో విడుదల కానుంది. ఈ వార్త సినీ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది.

Key Points

1

బాలయ్య-బోయపాటి కాంబోలో అఖండ 2, బాలకృష్ణ అఘోరా పాత్రలో.

2

కొత్తగా 'జాజికాయ' లిరికల్ సాంగ్ విడుదల, తమన్ సంగీతం అందించారు.

4

2021 అఖండకు సీక్వెల్, డిసెంబర్ 5న థియేటర్లలో సందడి చేయనుంది.

అఖండ 2: బాలయ్య-బోయపాటి కాంబో

బాలయ్య-బోయపాటి కాంబోలో వస్తోన్న మారో చిత్రం అఖండ-2(Akhanda 2). ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ చిత్రంలో బాలకృష్ణ.. అఘోరా పాత్రలో కనిపించనున్నారు. సంయుక్త మేనన్ హీరోయిన్ కాగా.. హర్షాలి మల్హోత్రా కీలక పాత్రలో కనిపించనుంది. ఈ మూవీ నుంచి ఇటీవలే ది తాండవం పేరుతో ఓ సాంగ్‌ను కూడా రిలీజ్ చేశారు.

జాజికాయ సాంగ్ విడుదల

తాజాగా ఈ సినిమా నుంచి మరో లిరికల్ సాంగ్ వీడియోను రిలీజ్ చేశారు. జాజికాయ.. జాజికాయ అంటూ సాగే పాటను విడుదల చేశారు. వైజాగ్ వేదికగా ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో ఈ పాటను లాంఛ్ చేశారు. ఈ సాంగ్‌కు కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించగా.. బ్రిజేశ్ శాండిల్య, శ్రేయా ఘోషల్ ఆలపించారు. ఈ పాటకు తమన్ సంగీతమందించారు.

సినిమా ప్రత్యేకతలు, విడుదల తేదీ

ఇటీవలే ఈ మూవీకి సంబంధించి మరో ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు మేకర్స్. ఈ చిత్రాన్ని 2డీతో పాటు త్రీడీ వర్షన్‌లోనూ రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. సినీ ప్రియులకు సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ చిత్రాన్ని 2021లో వచ్చిన అఖండకు సీక్వెల్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా డిసెంబర్ 5న థియేటర్లలో సందడి చేయనుంది.

‘అఖండ 2’ చిత్రం 2డీ, 3డీ వర్షన్‌లో డిసెంబర్ 5న విడుదల కానుండటంతో అభిమానుల అంచనాలు తారాస్థాయికి చేరాయి. ‘జాజికాయ’ పాట విజయం సినిమాపై మరింత హైప్‌ను పెంచింది. ఈ బ్లాక్‌బస్టర్ సీక్వెల్ కోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.