
నందమూరి బాలకృష్ణ అఖండ 2 చిత్రం నుంచి ‘తాండవం’ సాంగ్ విడుదలైంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 5న విడుదల కానుంది. ఈ సాంగ్ ఇప్పటికే ప్రేక్షకుల నుంచి భారీ స్పందన పొందుతూ, సినిమాపై అంచనాలను పెంచింది.
Key Points
అఖండ 2 చిత్రం డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ఈ సినిమా తెరకెక్కింది.
తొలి పాట ‘తాండవం’ విడుదలై ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది.
శంకర్ మహదేవన్, కైలాష్ ఖేర్ ‘తాండవం’ సాంగ్‌ను ఆలపించారు.
అఖండ 2 రిలీజ్ డేట్, ఇతర విశేషాలు
Akhanda 2 : నందమూరి బాలకృష్ణ నటిస్తున్న చిత్రం అఖండ-2. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అఖండకు సీక్వెల్‌గా ఈ చిత్రం వస్తుండడంతో ఈ మూవీ పై (Akhanda 2) భారీ అంచనాలే ఉన్నాయి. డిసెంబర్ 5న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ బాషల్లో ఈ మూవీ రిలీజ్ కానుంది.
ఇక విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాలను మొదలుపెట్టింది. అందులో భాగంగా తాజాగా ఈ చిత్రంలోని తొలి పాటను విడుదల చేసింది.
‘తాండవం’ సాంగ్‌తో అంచనాలు అమాంతం పెరిగాయి
Kaantha Review : ‘కాంత’ మూవీ రివ్యూ.. సినిమాలో సినిమా.. పీరియాడికల్ డ్రామా అదిరిందిగా..
బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ మ్యాజిక్
శంకర్ మహదేవన్, కైలాష్ ఖేర్ లు కలిసి పాడిన ‘అఖండ తాండవం’ అంటూ సాగే ఈ పాట గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఈ చిత్రంలో సంయుక్త కథానాయిక. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.
అఖండ 2 సినిమాకు సంబంధించిన తొలి పాట ‘తాండవం’ భారీ విజయాన్ని సాధించడంతో, సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటాయి. బాలకృష్ణ అభిమానులు సినిమా విడుదల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.


