|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఇది మరిచిపోలేని అనూభూతిని ఇవ్వనుంది.. ‘మన శంకర వరప్రసాద్ గారు’ అప్డేట్ ఇచ్చిన మేకర్స్..

Published: 03-11-2025, 12:17 AM
ఇది మరిచిపోలేని అనూభూతిని ఇవ్వనుంది.. ‘మన శంకర వరప్రసాద్ గారు’ అప్డేట్ ఇచ్చిన మేకర్స్..

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం గురించి మేకర్స్ తాజా అప్‌డేట్ ఇచ్చారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఇది ప్రేక్షకులకు మరిచిపోలేని అనుభూతిని అందిస్తుందని చిత్ర యూనిట్ తెలిపింది.

Key Points

1

మెగాస్టార్ చిరంజీవి 'మన శంకర వరప్రసాద్ గారు' క్లైమాక్స్ షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభం.

2

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ కీలక పాత్రలో, నయనతార హీరోయిన్‌గా నటిస్తున్నారు.

4

ఈ కుటుంబ కథా చిత్రం 2026 సంక్రాంతికి బిగ్గెస్ట్ అట్రాక్షన్‌గా విడుదల కానుంది.

క్లైమాక్స్ షూటింగ్ ప్రారంభం

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)మోస్ట్ ఎవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’(mana shankara varaprasad gaaru). హిట్ మెషిన్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో కనిపించనున్నారు. వెంకటేష్ ఇటీవలే ఈ సెట్‌లో జాయిన్ అయ్యారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మించిన ఈ చిత్రాన్ని శ్రీమతి అర్చన సమర్పిస్తున్నారు. ఈరోజు నుండి చిరంజీవి గారు, ఫైటర్స్ బృందం పాల్గొనే స్టైలిష్ క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్‌ను హైదరాబాద్‌లో చిత్రీకరించడం ప్రారంభించారు. ఇది ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా విజువల్‌గా అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు.

ప్రముఖ యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌ వెంకట్‌ మాస్టర్‌ పర్యవేక్షణలో ప్రతి సన్నివేశం గ్రాండ్ గా రూపొందుతోంది. చిరంజీవి గారి చరిష్మా, గ్రేస్, అనిల్‌ రావిపూడి టచ్‌ కలిసిన ఈ క్లైమాక్స్‌ సీక్వెన్స్‌ ప్రేక్షకులకు మరిచిపోలేని అనుభూతిని అందించనుంది. అలాగే సినిమా మొత్తానికే హైలెట్ కానుందట. ప్రస్తుతం చిత్ర నిర్మాణ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా, వి.టి.వి. గణేష్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు. సంగీత దర్శకుడు భీమ్స్‌ సిసిరోలియో సమకూర్చిన ఫస్ట్ సింగిల్‌ “మీసాల పిల్ల” దేశవ్యాప్తంగా ట్రెండ్‌ అవుతోంది. 2026 సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ గారు బిగ్గెస్ట్ ఎట్రాక్షన్ గా ప్రేక్షకులు ముందుకు రానుంది.

కీలక తారాగణం, సాంకేతిక బృందం

విడుదల తేదీ, సంగీతం, అంచనాలు

‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం క్లైమాక్స్ సన్నివేశాలు ప్రేక్షకులకు మరపురాని అనుభూతిని అందిస్తాయని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు. 2026 సంక్రాంతికి విడుదల కానున్న ఈ సినిమా భారీ అంచనాలతో వస్తోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.