
📌 Key Points
- `అఖండ 2` ఆర్థిక సమస్యల కారణంగా వాయిదా పడింది.
- `14 రీల్స్ ప్లస్`, `ఈరోస్ ఇంటర్నేషనల్` మధ్య వివాదం పరిష్కారమైంది.
- కొత్త రిలీజ్ డేట్ ఈ నెల 12న, 11న ప్రీమియర్స్ ప్రదర్శించనున్నారు.
- `అఖండ 2` వల్ల అదే రోజు విడుదలయ్యే ఐదుకు పైగా చిత్రాలకు పెద్ద దెబ్బ.
బాలకృష్ణ నటించిన `అఖండ 2` మూవీ కొత్త రిలీజ్ డేట్ ఖరారైంది. ఆర్థిక సమస్యల కారణంగా వాయిదా పడిన ఈ చిత్రం విడుదలకు మార్గం సుగమం అయింది. ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఇతర చిత్రాలకు పెద్ద సవాల్‌గా మారింది.
అఖండ 2 వాయిదాకు కారణం ఏంటి?
బాలకృష్ణ హీరోగా నటించిన తాజా మూవీ `అఖండ 2`. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా గత వారం విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఆర్థిక పరమైన సమస్యలతో వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ సినిమాని నిర్మించిన 14 రీల్స్ ప్లస్ సంస్థ గతంలో ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థకి దాదాపు రూ.28కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఈ రెండు బ్యానర్లు కలిసి పలు సినిమాలను నిర్మించాయి. వాటి తాలూకా డీల్స్ ఫైనల్ కాలేదు.
ఈ క్రమంలో ఇప్పుడు `అఖండ 2` రిలీజ్ టైమ్‌లోనే ఈ డబ్బులు వసూలు చేసుకోవాలని ఈరోస్ ఇంటర్నేషన్ సంస్థ కోర్ట్ లో కేసు వేసింది. దీంతో సినిమాని వాయిదా వేయాల్సి వచ్చింది. ఆ సమయంలోనే దీనికి సంబంధించిన చర్చలు జరిగినా సఫలం కాలేదు. ఈ అమౌంట్ రూ.28 కోట్లు కాదు యాభై కోట్లు ఉన్నట్టుగా తేలింది. దీంతో పోస్ట్ పోన్ చేశారు. నెక్ట్స్ డే వస్తుందని భావించారు. అయినా కాలేదు. టాలీవుడ్ నుంచి పెద్ద నిర్మాతలు ఇన్ వాల్వ్ అయ్యారు. అయినా సెట్ కాలేదు. దీంతో మొత్తానికి వాయిదా వేయాల్సి వచ్చింది.
కొత్త రిలీజ్ డేట్ ఖరారు
ఈ క్రమంలో కోర్ట్ నుంచి క్లీయరెన్స్ వచ్చింది. ఇరు సంస్థల మధ్య చర్చలు సఫలం అయ్యిందట. పలువురు నిర్మాతలు ఇన్ వాల్వ్ అయి సెటిల్ చేశారని తెలుస్తోంది. ఈ క్రమంలో తాజాగా రిలీజ్ డేట్‌ని ప్రకటించింది టీమ్. ముందుగా అంతా ఊహించినట్టుగానే ఈ మూవీని ఈ నెల 12న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించింది టీమ్. 11 న ప్రీమియర్స్ ప్రదర్శించబోతున్నాయట. అయితే ఈ డేట్‌కి ఐదారు సినిమాలు `సైకో సిద్ధార్థ`, `సహకుటుంబమానం`, `మౌళి`, `ఈషా`, `డ్రైవ్`, `అన్నగారు వస్తున్నారు` చిత్రాలు రిలీజ్ కాబోతున్నాయి. కానీ ఇప్పుడు `అఖండ 2` రావడంతో ఆ చిత్రాలకు పెద్ద దెబ్బ పడింది. మరి ఈ ఫైట్‌ని ఎలా సెట్ చేస్తారు, `అఖండ 2` దెబ్బకి ఎన్ని చిత్రాలు బ్యాక్ వెళ్లిపోతాయో చూడాలి.
ఇతర చిత్రాలపై అఖండ 2 ప్రభావం
బాలయ్య హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన `అఖండ 2 తాండవం` మూవీలో ఆదిపినిశెట్టి విలన్‌గా నటించగా, సంయుక్త హీరోయిన్‌గా చేసింది. హర్షాలీ, పూర్ణ వంటి వారు కీలక పాత్రలు పోషించారు. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించారు. ఇది నాలుగేళ్ల క్రితం వచ్చిన `అఖండ` మూవీకి సీక్వెల్. దానికి కొనసాగింపుగా ఉండబోతుందట. ఈ సారి శివతత్వాన్ని ప్రధానంగా చేసుకుని ఈ మూవీని రూపొందించారు. హింధూ ధర్మం, సనాతన హైందవ ధర్మం అంశాలను ఇందులో చూపించబోతున్నారట. మన దేశం గొప్పతనం చెప్పే ప్రయత్నం చేస్తున్నారట.
మొత్తానికి `అఖండ 2` విడుదల తేదీ ఖరారు కావడంతో బాలయ్య అభిమానులు ఆనందంలో ఉన్నారు. అయితే, ఈ సినిమా ఇతర చిత్రాలపై చూపించే ప్రభావం ఎలా ఉంటుందో, ఏ చిత్రాలు వెనక్కి వెళ్తాయో వేచి చూడాలి.



Sargun Mehta Urges People to Stop Negative Comments and Trolling Online