
📌 Key Points
- అఖండ 2 టాలీవుడ్‌లో లేటెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
- దర్శకుడు బోయపాటి శ్రీను ప్రధాని మోదీ ‘అఖండ 2’ చూడనున్నారని ప్రకటించారు.
- ఢిల్లీలో ప్రధాని మోదీ కోసం ‘అఖండ 2’ ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేయనున్నారు.
- సినిమా విజయం దైవ సంకల్పమని, ప్రేక్షకుల ఆదరణకు ధన్యవాదాలు తెలిపారు బోయపాటి.
టాలీవుడ్ బ్లాక్‌బస్టర్ అఖండ 2 విజయోత్సవ వేడుకలో దర్శకుడు బోయపాటి శ్రీను కీలక ప్రకటన చేశారు. ప్రధాని మోదీ ఢిల్లీలో ‘అఖండ 2’ సినిమాను చూడబోతున్నారని ఆయన వెల్లడించారు. ఈ వార్త ప్రస్తుతం వైరల్‌గా మారింది.
అఖండ 2 బ్లాక్‌బస్టర్ విజయం
Akhanda 2: టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ అఖండ 2(Akhanda 2). డిసెంబర్ 12న విడువులైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ నేపధ్యంలో తాజాగా అఖండ 2 సక్సెస్ మీట్ నిర్వహించారు మేకర్స్. ఈ ఈవెంట్ లో దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ ప్రధాని మోదీ అఖండ 2 స్పెషల్ షో చుడనున్నట్టు ప్రకటించాడు.‘‘ భారతదేశం అనేది ధర్మానికి గ్రంథాలయం లాంటిది. ధర్మానికి తల్లి వేరులాంటిది. ఆ ధర్మాన్ని నమ్మిన దేశాలు ఒకలా ఉంటే, నమ్మని దేశాలు మరోలా ఉన్నాయి. మనిషి తలుచుకుంటే గెలవవచ్చు.. ఓడిపోవచ్చు. కానీ, దేవుడు అనుకుంటే గెలుపు మాత్రమే ఉంటుంది. దానికి నిదర్శనం ఈ సినిమా విజయమే.
ప్రధాని మోదీ కోసం ప్రత్యేక ప్రదర్శన
Payal Radhakrishna: పాయల్ పాప పరువాల విందు.. చూస్తే మతిపోవడం ఖాయం.. ఫోటోలు
బోయపాటి శ్రీను భావోద్వేగ వ్యాఖ్యలు
ఇది ఆ దేవుడి సంకల్పం. దానిని మీరు అద్భుతంగా ఆదరిస్తున్నారు, ఆదరించారు కూడా. ఇంతటి విజయానికి కారణమైన ప్రేక్షకులు ప్రతీఒక్కరికి నా ధన్యవాదాలు. అఖండ 2ను 3డీలో చేయడం కొత్త అనుభూతి. మా తమన్ చెప్పినట్లు అందరు బాగుండాలి. తెలుగు సినీ పరిశ్రమ ఒక వేదికపైకి రావాలి. త్వరలో ప్రధాని మోడీ కోసం దిల్లీలో అఖండ 2 ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నాం” అటూ చెప్పుకొచ్చాడు. దీంతో ఆయన చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రధాని మోదీ ‘అఖండ 2’ సినిమాను వీక్షించబోతున్నారన్న వార్త సినిమాకు మరింత ప్రచారాన్ని తీసుకువస్తోంది. ఈ బ్లాక్‌బస్టర్ చిత్రం విజయానికి ఇది మరింత గ్లామర్‌ను జోడించింది. టాలీవుడ్‌లో ఇది ఒక ప్రత్యేక మైలురాయి.


