|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Akhanda 2 : అఖండ 2 రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయిపోయినట్లే, ఆ సినిమాల పరిస్థితి ఏంటో

Published: 08-12-2025, 1:08 PM
Akhanda 2 : అఖండ 2 రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయిపోయినట్లే, ఆ సినిమాల పరిస్థితి ఏంటో
  • అఖండ 2 డిసెంబర్ 5న విడుదల కావాల్సిన సినిమా ఆర్థిక లావాదేవీల కారణంగా వాయిదా పడింది.
  • తాజా సమాచారం ప్రకారం, డిసెంబర్ 12న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. డిసెంబర్ 11న ప్రీమియర్లు ఉండవచ్చు.
  • ఈ సినిమా బాలకృష్ణ కెరీర్‌లోనే మొదటి పాన్ ఇండియా చిత్రంగా ప్రచారం పొందింది.
  • అఖండ 2 రాకతో ఇప్పటికే విడుదల సిద్ధంగా ఉన్న ఇతర సినిమాల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది.

బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న అఖండ 2 సినిమా రిలీజ్ డేట్ పై సస్పెన్స్ కొనసాగుతోంది. మొదట వాయిదా పడిన ఈ సినిమా ఇప్పుడు డిసెంబర్ 12న విడుదల కావచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. దీని వల్ల ఇతర సినిమాల పరిస్థితి ఏంటో చూడాలి.

అఖండ 2 వాయిదా, కొత్త రిలీజ్ డేట్

Akhanda 2 Release Date: భద్ర సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన బోయపాటి శ్రీను మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకున్నాడు. బోయపాటి శ్రీనుకి సింహా సినిమా విపరీతమైన పేరు తీసుకొచ్చింది. అక్కడితో మొదలైన వీరి కాంబినేషన్ మూడు సక్సెస్ఫుల్ సినిమాలను చేసింది. వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పుడు అఖండ 2 సినిమా సినిమా రాబోతుంది. ఈ సినిమాను డిసెంబర్ 5న విడుదల చేస్తున్నట్లు అధికారికంగానే ప్రకటించారు.

కానీ చివరి నిమిషంలో ఉన్న కొన్ని ఆర్థిక లావాదేవీల కారణంగా ఈ సినిమా వాయిదా పడిపోయింది. ఇంకొన్ని గంటల్లో ప్రీమియర్లు మొదలవుతాయి అనుకునే టైంలో సినిమా వాయిదాలు పడటం అనేది రేర్ గా జరుగుతుంది. అయితే అది బాలకృష్ణ వంటి సీనియర్ హీరోకి జరగడం అనేది ఊహించని పరిణామం. ఇకపోతే ఈ సినిమా విషయంలో ఇప్పటికీ కూడా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే క్లారిటీ లేదు. కానీ వినిపిస్తున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం సినిమా రిలీజ్ డేట్ ను కన్ఫర్మ్ చేసేసారు .

ఇతర సినిమాలపై అఖండ 2 ప్రభావం

ఈ సినిమాను డిసెంబర్ 12న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే డిసెంబర్ 11వ తారీఖున ఈ సినిమాకి సంబంధించిన ప్రీమియర్స్ పలుచోట్ల పడనున్నాయి. దాదాపు ఈ సినిమాకి సంబంధించి ఆర్థిక లావాదేవీలన్నీ కూడా క్లియర్ అయిపోయాయి. ఈ తరుణంలో 12వ తారీకు ప్రేక్షకులు ముందుకు రావడానికి కొన్ని సినిమాలు ఆల్రెడీ సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు అఖండ సినిమా వస్తుంది కాబట్టి వాటి పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు. ఎందుకంటే క్రిస్మస్ కానుకగా కూడా కొన్ని సినిమాలను అనౌన్స్ చేశారు. ఆ తర్వాత పండగ సీజన్ మొదలవుతుంది కాబట్టి ఈ సినిమాలు సరైన రిలీజ్ డేట్ కు నోచుకోకుండా పోతాయి.

పాన్ ఇండియా రిలీజ్, అధికారిక ప్రకటన

కొన్ని సందర్భాల్లో ఒక మంచి సినిమా తీయడం ఎంత ముఖ్యమో ఆ సినిమాను సరైన డేటుకు రిలీజ్ చేయడం కూడా అంతే ముఖ్యం. చాలా సినిమాలు సరైన రిలీజ్ డేట్ దొరక్క పోవడం వల్లనే ఊహించిన సక్సెస్ ను సాధించలేవు. అయితే అఖండ రిలీజ్ డేట్ గురించి ఇప్పటికి అధికారిక ప్రకటన రాలేదు కొద్దిసేపట్లో ఈ సినిమాకి సంబంధించి అధికారక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నారు. బాలకృష్ణ కెరియర్ లో వస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా ఇది అఖండ సినిమా తర్వాత బాలకృష్ణ చేసిన అన్ని సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించాయి. అయితే ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లోనే ప్రమోట్ చేశారు. ఈ సినిమాలో ఎక్కువగా సనాతన ధర్మం గురించి చూపించబోతున్నట్లు వీడియో కంటెంట్ చూస్తే అర్థమవుతుంది.

మొత్తానికి అఖండ 2 విడుదలపై ఆసక్తి నెలకొంది. ఈ సినిమా సరైన డేట్ కు విడుదల కావడం ఎంత ముఖ్యమో, ఇతర సినిమాల పరిస్థితి ఏమిటో వేచి చూడాలి. దీనిపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.