
బాలకృష్ణ ‘అఖండ 2’ సినిమా నుంచి రెండో సింగిల్ ‘జాజికాయ జాజికాయ’ విడుదలైంది. తమన్ కంపోజ్ చేసిన ఈ మాస్ సాంగ్ లో బాలయ్య స్టెప్పులు ఆకట్టుకుంటున్నాయి. డిసెంబర్ 5న రిలీజ్ కానున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి.
Key Points
'అఖండ 2' నుంచి 'జాజికాయ జాజికాయ' సెకండ్ సింగిల్ విడుదలైంది.
తమన్ సంగీత దర్శకత్వంలో కాసర్ల శ్యామ్ ఈ పాటను రాశారు.
డిసెంబర్ 5న సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
వైజాగ్ లో ఫ్యాన్స్ మధ్య ఈ మాస్ సాంగ్ ను రిలీజ్ చేశారు.
“జాజికాయ జాజికాయ” సాంగ్ రిలీజ్ హైలైట్స్
బాలకృష్ణ అఖండ 2 మూవీ నుంచి సెకండ్ సింగిల్ జాజికాయ జాజికాయ అంటూ వచ్చేసింది. ఈ మధ్యే తాండవం పేరుతో ఫస్ట్ సింగిల్ రాగా.. దానికి పూర్తి భిన్నంగా ఈ సెకండ్ సింగిల్ రావడం విశేషం. ఈ రెండు పాటలూ సినిమా కథ ఎంత ప్రత్యేకంగా ఉండబోతోందో చెబుతున్నాయి.
బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న మూవీ అఖండ 2. ఈ సినిమా డిసెంబర్ 5న థియేటర్లలో రిలీజ్ కానుండగా.. వరుస పాటలతో మూవీ టీమ్ ప్రమోషన్లు మొదలుపెట్టింది. తాజాగా మంగళవారం (నవంబర్ 18) జాజికాయ జాజికాయ అంటూ తమన్ కంపోజ్ చేసిన ఓ మాస్ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
బాలయ్య-బోయపాటి కాంబినేషన్ పై అంచనాలు
జాజికాయ జాజికాయ సాంగ్ రిలీజ్
ఈ పాటను కాసర్ల శ్యామ్ రాగా.. బ్రిజేష్ శాండిల్య, శ్రేయా ఘోషాల్ పాడారు. ఈ పాటను వైజాగ్ లోని జగదాంబ థియేటర్లో ఫ్యాన్స్ మధ్య రిలీజ్ చేశారు. తొలి పాటను ముంబైలో రిలీజ్ చేయగా.. ఈ రెండో పాటను వైజాగ్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం విశేషం.
అఖండ 2: ప్రమోషన్స్, విడుదల తేదీ వివరాలు
ఈ ఏడాది ఆగస్టులోనే మూవీ షూటింగ్ పూర్తియింది. అప్పటి నుంచీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అఖండ సూపర్ హిట్ అయిన నేపథ్యంలో ఈ సీక్వెల్ పై భారీ అంచనాలు ఉన్నాయి. వరుసగా రెండు పాటలు రిలీజ్ చేయడం ద్వారా మూవీ టీమ్ మెల్లగా ప్రమోషన్లపై దృష్టి సారించనుంది. బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో మరో బ్లాక్‌బస్టర్ ఖాయమని అభిమానులు అంచనాతో ఉన్నారు.
వరుస పాటలతో ‘అఖండ 2’ ప్రమోషన్లు ఊపందుకున్నాయి. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ మరోసారి ప్రేక్షకులను అలరించడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. డిసెంబర్ 5న ఈ సినిమా సంచలనం సృష్టించడం ఖాయం.


