|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అఖండ ఓ సూపర్ హీరో.. అష్ట సిద్ధి సాధించినవాడు.. మ్యాజిక్ కాదు లాజిక్ ఉంది: ట్రోల్స్‌పై స్పందించిన బోయపాటి శ్రీను

Published: 14-12-2025, 1:08 AM
అఖండ ఓ సూపర్ హీరో.. అష్ట సిద్ధి సాధించినవాడు.. మ్యాజిక్ కాదు లాజిక్ ఉంది: ట్రోల్స్‌పై స్పందించిన బోయపాటి శ్రీను
  • అఖండ 2 ట్రోల్స్‌పై డైరెక్టర్ బోయపాటి శ్రీను స్పందన.
  • బాలయ్య పాత్ర అష్ట సిద్ధి సాధించిన సూపర్ హీరో అని వివరణ.
  • సినిమాలో మ్యాజిక్ కాదు, లాజిక్ కూడా ఉందని బోయపాటి వెల్లడి.
  • సనాతన ధర్మం, బయోవార్ నేపథ్యంతో అఖండ 2 కథ సాగుతుంది.

అఖండ 2 సినిమాపై వస్తున్న ట్రోల్స్‌పై దర్శకుడు బోయపాటి శ్రీను స్పందించారు. బాలకృష్ణ పాత్ర అష్ట సిద్ధి సాధించిన సూపర్ హీరో అని, సినిమాలో మ్యాజిక్ కాదు లాజిక్ ఉందని ఆయన స్పష్టం చేశారు. అఖండ 2 కథ, బాలయ్య ఫైట్స్‌పై వస్తున్న విమర్శలకు ఈ వివరణతో చెక్ పెట్టారు.

అఖండ 2 ట్రోల్స్‌పై బోయపాటి శ్రీను వివరణ

అఖండ 2 మూవీపై వస్తున్న ట్రోల్స్‌పై డైరెక్టర్ బోయపాటి శ్రీను స్పందించాడు. అతడో సూపర్ హీరో అని, అష్ట సిద్ధి సాధించినవాడని చెప్పడం విశేషం. సినిమాలో మ్యాజిక్ కాదు లాజిక్ కూడా ఉందని స్పష్టం చేశాడు.

బాలకృష్ణ నటించిన అఖండ 2 మూవీపై ప్రీమియర్ షోల నుంచే దారుణమైన ట్రోల్స్ వస్తున్న విషయం తెలుసు కదా. ఇందులో బాలయ్యను చూపించిన విధానంపై చాలా మంది విమర్శలు గుప్పించారు. సోషల్ మీడియాలో ఇది మంచి ట్రోల్ మెటీరియల్ గా మారిపోయింది. అయితే దీనిపై తాజాగా బోయపాటి శ్రీను స్పందించాడు.

బాలయ్య అష్ట సిద్ధి సాధించిన సూపర్ హీరో

“ఆయన అష్ట సిద్ధి సాధించినవాడు. 12 ఏళ్ల పాటు అష్ట దిగ్బంధనానికి వెళ్లి అష్ట సిద్ధి సాధించాడు. అఖండ ఓ సూపర్ హ్యూమన్. వాళ్లకసలు లాజిక్కా, మ్యాజిక్కా అనేది తీసేస్తే.. వాళ్లు సూక్ష్మ రూపంలోకి లేదంటే విశ్వరూపంలోకి కూడా వెళ్లగలరు. కానీ అవన్నీ ఇందులో చూపించలేదు. కేవలం ఆయుధాల వరకూ చూపించాము. అష్ట సిద్ధి సాధించిన వ్యక్తి ఓ సూపర్ హీరో. వాళ్లు పరిస్థితులకు తగినట్లుగా తమను తాము మార్చుకోగలరు. అష్ట సిద్ధి సాధకుడు ఏదైనా చేయగలడు. మన హీరో అష్ట సిద్ధి సాధకుడు అని మొదటి రీల్లోనే చెప్పేశాం. అందువల్ల లాజిక్ కూడా ఉంది” అని బోయపాటి వివరణ ఇచ్చాడు.

అఖండ సినిమా రీక్యాప్‌తో అఖండ 2 తాండవం ప్రారంభం అవుతుంది. అఖండలో బాలకృష్ణ విశ్వరూపం చూస్తే ఈ సినిమాలో ఉగ్రరూపం చూపించారు బోయపాటి శ్రీను. సనాతన ధర్మం, భారతీయ విశ్వసాలు, వేదజ్ఞానాల గొప్పతనాన్ని అఘోరా పాత్రతో చెప్పించారు.

అఖండ 2 కథా నేపథ్యం, సనాతన ధర్మం

సినిమా కథ అంతా టిబెట్ సరిహద్దుల దగ్గర జరుగుతుంది. దేవుడని ఎక్కువ నమ్మే భారతీయల మనసుల్లో దైవత్వంపై దెబ్బకొట్టాలని చైనా పన్నాగం పన్నడం, అందుకు బయోవార్ ఉపయోగించుకోవడం, దానికి విరుగుడుగా భారత్ సైంటిస్టులు కనిపెట్టడం వంటి సీన్లతో అలా సాగిపోతుంది సినిమా. అయితే ఈ మూవీపై తొలి షో నుంచే సోషల్ మీడియాలో దారుణమైన ట్రోల్స్ వచ్చాయి. ముఖ్యంగా బాలయ్య చేసిన ఫైట్ సీన్స్ చూసి తెగ నవ్వుకున్నారు. అలా ఎలా సాధ్యమంటూ ప్రశ్నించారు. దీనికే తాజాగా బోయపాటి శ్రీను వివరణ ఇవ్వడం విశేషం.

మొత్తంగా, అఖండ 2పై వస్తున్న ట్రోల్స్‌కు బోయపాటి శ్రీను వివరణ ఇచ్చారు. బాలకృష్ణ పాత్ర అష్ట సిద్ధి సాధించిన అసాధారణ వ్యక్తి అని, సినిమాలో లాజిక్ ఉందని నొక్కి చెప్పారు. ఈ వివరణ విమర్శకులకు సమాధానం అవుతుందో లేదో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.