|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అఖిల్ అక్కినేని: గెలుపు గుర్రం ఎక్కుతాడా? లేక గాడి తప్పిన కెరీర్‌తో నిష్క్రమిస్తాడా?

Published: 14-04-2026, 1:35 PM
అఖిల్ అక్కినేని: గెలుపు గుర్రం ఎక్కుతాడా? లేక గాడి తప్పిన కెరీర్‌తో నిష్క్రమిస్తాడా?
  • అఖిల్ కెరీర్‌లో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ కాస్త ఊరటనిచ్చినా, ‘ఏజెంట్’ భారీ నష్టాన్ని మిగిల్చింది.
  • మురళి అబ్బూరి దర్శకత్వంలో రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో అఖిల్ కొత్త సినిమా చేస్తున్నారు.
  • శ్రీలీల తప్పుకోవడంతో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా ఎంపికైంది.
  • అఖిల్ వెనుక అక్కినేని బ్రాండ్ లేకుంటే మరో అవకాశం వచ్చేది కాదనే టాక్ వినిపిస్తోంది.

అక్కినేని వారసుడు అఖిల్ ప్రస్తుతం తన కెరీర్‌లో ఒక కీలక దశలో ఉన్నాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ‘ఏజెంట్’ చిత్రం నిరాశపరచడంతో, ఇప్పుడు ఆయన ఆశలన్నీ ‘లెనిన్’ చిత్రంపైనే ఉన్నాయి. ఈ సినిమాతో అయినా హిట్ కొడతాడా లేదా అనేది చూడాలి.

అఖిల్ కెరీర్‌లో ఎదురుదెబ్బలు

Akhil Akkineni : సినీ ఇండస్ట్రీ ..ఇక్కడ  అదృష్టం తలుపు తడితే ఓవర్ నైట్ స్టార్ అయిపోవచ్చు, అదే బ్యాడ్ టైమ్ నడుస్తుంటే ఎంతటి బ్యాక్ గ్రౌండ్ ఉన్నా పాతాళానికి పడిపోవచ్చు. అచ్చం ఇదే పరిస్థితిని ఫేస్ చేస్తున్నాడు అక్కినేని వారసుడు అఖిల్.  నాగార్జున వారసుడిగా, లెజెండరీ ఏఎన్నార్ మనవడిగా సాలిడ్ సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్నా ఇప్పటికీ ఒక సరైన సూపర్ హిట్ కొట్టలేకపోయాడు ,ఇక ఇపుడు తాజాగా ఈ అయ్యగారి ఆశలన్నీ లెనిన్ పైనే పెట్టుకున్న పరిస్థితి.

వాస్తవానికి  అఖిల్ కెరీర్‌లో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ కాస్త ఊరటనిచ్చినా, ‘ఏజెంట్’ మాత్రం ఆక్కినేని ఫ్యాన్స్ కి ఒక నైట్ మేర్ లా అయిపొయింది.భారీ బడ్జెట్, హాలీవుడ్ రేంజ్ మేకోవర్ అంటూ ఊదరగొట్టి తీరా థియేటర్లలో బొక్క బోర్లా పడటంతో  సోషల్ మీడియాలో అఖిల్ ట్రోలర్స్ కి స్టఫ్ అయిపోయాడు.”ఇక అఖిల్ పని అయిపోయింది, సినిమాలలో హీరోగా చేయడం కన్నా ప్రొడ్యూసర్ గా మారడం మేలు అన్న వాళ్ళు ఎందరో.అయితే పడ్డ చోటే నిలబడాలి అంటూ మురళి అబ్బూరి దర్శకత్వంలో లెనిన్ ని పట్టాలెక్కించాడు.

లెనిన్ మూవీతో మారుతున్న అఖిల్

ఇకప్రస్తుతం ఫిలిం నగర్లో వినిపిస్తున్న గట్టి టాక్ ఏంటంటే.. ఒకవేళ అఖిల్ వెనుక ‘అక్కినేని’ అనే బ్రాండ్ ఇమేజ్ లేకపోయి ఉంటే, ‘ఏజెంట్’ వంటి భారీ ఫ్లాప్ తర్వాత మరో సినిమా చేసే అవకాశం ఉండేదా? అని. ‘వినరో భాగ్యము విష్ణు కథ’ ఫేమ్ మురళీ కృష్ణ అబ్బూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై కూడా తొలుత నెగెటివ్ కామెంట్స్ వచ్చాయి. అయితే, తన క్లాస్ ఇమేజ్‌ను పక్కన పెట్టి, మొదటిసారి రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో జరిగే  పక్కా మాస్ కథను ఎంచుకున్న  అఖిల్ మెచ్చు కోవాల్సిందే.

ఇక ఈ సినిమా మొదలైనప్పటి నుండి ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది. ముందుగా క్రేజీ హీరోయిన్ శ్రీలీలను అనుకున్నారు. గ్లింప్స్‌లో కూడా ఆమెనే కనిపించింది. కానీ, పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ఆమె అఖిల్ సినిమాను వదులుకుందనే వార్తలు అప్పట్లో హాట్ టాపిక్ అయ్యాయి. చివరకు ఆమె ప్లేస్‌లోకి ‘మిస్టర్ బచ్చన్’ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే వచ్చి చేరింది. హీరోయిన్ మారడం సినిమాకు ప్లస్ అవుతుందో లేక సెంటిమెంట్ పరంగా మైనస్ అవుతుందో చూడాలి.

ఇక ఇన్ని అడ్డంకులు, విమర్శల మధ్య కూడా అఖిల్ తన మార్క్ చూపిస్తూనే ఉన్నాడు. రీసెంట్‌గా విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘వారేవా’ పాటకు మంచి రెస్పాన్స్ రావడంతో అఖిల్ పై మళ్ళీ అంచనాలు మొదలయ్యాయి. ఇక ప్రచారంలో భాగంగా ఏప్రిల్ 16న రెండో సాంగ్ ‘ఎట్టా ఎట్టా’ను విడుదల చేస్తున్నట్లు టీమ్ అనౌన్స్ చేసింది. దీనికి సంబంధించిన పోస్టర్ కూడా గా ఉండటంతో , ఈసారి ఏదో మ్యాజిక్ జరగబోతోందని బోలెడు ఆశలు పెట్టుకున్నారు అయ్యగారి ఫ్యాన్స్.

సినిమాకు అడుగడుగునా అడ్డంకులే!

నిజానికి మే 1నే ఈ సినిమా రావాల్సింది. కానీ రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా పోటీ ఉండటంతో, రిస్క్ ఎందుకని జూన్ 26కి వాయిదా వేశారు మేకర్స్.మరి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ చిత్రం అఖిల్ కెరీర్‌ను నిలబెడుతుందా? లేక ట్రోలర్స్ కి మరో స్టఫ్ నిస్తుందా చూడాలి.

మొత్తానికి అఖిల్ ఈ సినిమాతో తన సత్తా చాటుతాడా లేదా అనేది వేచి చూడాలి. వరుస ఫ్లాపులతో ఉన్న అఖిల్ కు ఈ సినిమా చాలా కీలకం కానుంది. హిట్ కొడితేనే నిలబడతాడు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.