|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Akhil Akkineni: ఘనంగా అఖిల్‌ పెళ్లి.. బరాత్‌లో జోరుమీదున్న నాగచైతన్య

Published: 05-06-2025, 11:26 PM
Akhil Akkineni: ఘనంగా అఖిల్‌ పెళ్లి.. బరాత్‌లో జోరుమీదున్న నాగచైతన్య

నటుడు అఖిల్ అక్కినేని ప్రియురాలు జైనబ్‌ను వివాహం చేసుకున్నారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోని నాగార్జున నివాసంలో వైభవంగా జరిగిన ఈ వివాహ వేడుకలో సినీ ప్రముఖులు పాల్గొన్నారు.

Key Points

1

అఖిల్ అక్కినేని జైనబ్‌ను వివాహం చేసుకున్నారు.

2

జూబ్లీహిల్స్‌లోని నాగార్జున నివాసంలో పెళ్లి జరిగింది.

4

జూన్ 8న అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా రిసెప్షన్ జరగనుంది.

అఖిల్-జైనబ్ వివాహం

సాక్షి, హైదరాబాద్‌: హీరో నాగార్జున చిన్న కుమారుడు అక్కినేని అఖిల్‌ ( Akkineni Akhil ) బ్యాచిలర్‌ లైఫ్‌కు గుడ్‌బై చెప్తూ వైవాహిక జీవితానికి వెల్‌కమ్‌ చెప్పాడు.  ప్రియురాలు జైనబ్‌ను వేదమంత్రాల సాక్షిగా పెళ్లాడాడు. జూబ్లీహిల్స్‌లో నాగార్జున నివాసంలో శుక్రవారం (జూన్‌ 6న) ఉదయం మూడు గంటలకు ఈ వివాహం జరిగింది. ఇరుకుటుంబ సభ్యులు సహా అది దగ్గరివాళ్లే ఈ వెడ్డింగ్‌కు హాజరయ్యారు. పెళ్లి అనంతరం జరిగిన బరాత్‌లో హీరో నాగచైతన్య హుషారుగా పాల్గొన్నాడు.

మెగా స్టార్‌ చిరంజీవి- సురేఖ, రామ్‌చరణ్‌- ఉపాసన దంపతులు, దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌, హీరో సుమంత్‌ సహా తదితరులు పెళ్లికి హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. జూన్‌ 8న అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా రిసెప్షన్‌ జరగనుంది. అంగరంగ వైభవంగా జరగనున్న ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు హాజరుకానున్నారు.

బరాత్ లో నాగచైతన్య

ఘనమైన రిసెప్షన్

అఖిల్ అక్కినేని వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. జూన్ 8న జరగనున్న గ్రాండ్ రిసెప్షన్ కూడా ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.