|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

వేల కోట్ల బిజినెస్‌ కాదని అఖిల్‌ భార్య జైనబ్‌ చేసే పనేంటో తెలుసా?

Published: 07-06-2025, 1:47 AM
వేల కోట్ల బిజినెస్‌ కాదని అఖిల్‌ భార్య జైనబ్‌ చేసే పనేంటో తెలుసా?

అఖిల్ అక్కినేని పెళ్లి తర్వాత ఆయన భార్య జైనబ్ గురించి చాలా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. వేల కోట్ల బిజినెస్ ఫ్యామిలీకి చెందిన జైనబ్, తన స్వంత ఐడెంటిటీని ఏర్పరుచుకోవడానికి కళ మరియు వెల్ నెస్ రంగాలలో చురుకుగా పాల్గొంటోంది.

Key Points

1

అఖిల్ అక్కినేని భార్య జైనబ్ వేల కోట్ల బిజినెస్‌లో పాల్గొనక, స్వంత కళాకృతుల ద్వారా గుర్తింపు పొందాలని చూస్తోంది.

2

జైనబ్ ప్రముఖ చిత్రకారి, ఆమె పెయింటింగ్స్ హైదరాబాద్‌తో పాటు ఇతర నగరాలలో ప్రదర్శించబడ్డాయి.

4

మీడియా దృష్టికి దూరంగా ఉంటూ, తన ప్రైవేట్ లైఫ్‌ను గౌరవిస్తోంది.

జైనబ్ యొక్క కళా ప్రతిభ

అఖిల్‌ అక్కినేని ఓ ఇంటివాడయ్యాడు. ప్రముఖ వ్యాపారవేత్త జుల్ఫీ రవ్‌డ్జీ కూతురు జైనబ్‌ని పెళ్లి చేసుకున్నారు. శుక్రవారం ఉదయం 3.35 గంటలకు జైనబ్‌ మెడలో మూడు ముళ్లు వేశారు అఖిల్‌.

తమ ఇంట్లో పెళ్లి వేడుక పట్ల నాగార్జున, అమల సంతోషం వ్యక్తం చేశారు. వీరిద్దరు అఖిల్‌ పెళ్లిని అధికారికంగా ప్రకటించారు. పెళ్లి ఫోటోలను పంచుకున్నారు. నాగచైతన్య కూడా తన సంతోషం వ్యక్తం చేస్తూ మరదలిని తన కుటుంబంలోకి ఆహ్వానించారు.

ఇదిలా ఉంటే అఖిల్‌ పెళ్లి చేసుకున్న జైనబ్‌ ఏం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. వారిది బిజినెస్‌ ఫ్యామిలీ. వాళ్ల నాన్న జుల్ఫీ రవ్‌డ్జీ కి వేల కోట్ల బిజినెస్‌లున్నాయి. కన్‌స్ట్రక్షన్‌, రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ఉన్నారు.

అంతేకారు పవర్‌ ప్రాజెక్ట్ లు కూడా ఉన్నాయి. ఇవన్నీ వందల, వేల కోట్ల టర్నోవర్‌ తో నడుస్తున్న వ్యాపారాలు. అయితే పవర్‌ ప్రాజెక్ట్ లను జైనబ్‌ సోదరుడు జైన్‌ చూసుకుంటున్నారు. కానీ జైనబ్‌ మాత్రం బిజినెస్‌లో ఇన్‌ వాల్వ్ కాదట.

వెల్‌నెస్ సెంటర్ మరియు ఆన్‌లైన్ సలహాలు

సాధారణంగా ఇలా వ్యాపారాలు ఉన్న వారి పిల్లలు తమ బిజినెస్‌లనే చూసుకుంటారు. కానీ జైనబ్‌ అందుకు దూరంగా ఉంటుందట. సొంతంగా ఎదగాలనే తపనతో ఉందట. తన సొంత ఆర్ట్ ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తుందట.

ఆమె స్వతహాగా మంచి ఆర్టిస్ట్(పెయింటింగ్‌). లేటెస్ట్ ట్రెండ్‌ని తన ఆర్ట్ లో ఆవిష్కరిస్తూ బొమ్మలు వేస్తూ ప్రదర్శిస్తోందట. హైదరాబాద్‌లోనూ పలు ప్రదర్శనలు ఇచ్చారు. పలుమార్లు  ఎగ్జిబిషన్స్ కూడా నిర్వహించారు. అంతేకాదు ఇండియాలోని ప్రధాన నగరాల్లో, ఇతర కంట్రీస్‌లో కూడా ఆమె ప్రదర్శనలు ఇవ్వడం విశేషం.

A post shared by Zainab Ravdjee (@zainabravdjee)

మీడియా పరంగా, పబ్లిసిటీకి జైనబ్‌ దూరంగా ఉంటారు. పూర్తిగా ప్రైవేట్‌ లైఫ్‌కే పరిమితం. తాను తన ఆర్ట్ ప్రదర్శనలు ఇచ్చినా, పబ్లిసిటీని ఇష్టపడరు. అందుకే మీడియా పరంగా ఆమె ఎవరికీ తెలియదు. కానీ ఆమె ఫాలోవర్స్ కి, ఆమె పెయింటింగ్స్ ని ఇష్టపడే వారు మాత్రం వేలల్లో ఉన్నారట. దీంతోపాటు మరో వెల్‌ నెస్‌ సెంటర్‌ని కూడా నడిపిస్తోంది జైనబ్‌.

ప్రైవేట్ లైఫ్ మరియు మీడియా దూరం

జైనబ్‌ స్కిన్‌ కేర్‌కి సంబంధించిన వెల్‌నెస్‌ సెంటర్లని నడిపిస్తుంది. ముఖ్యంగా ఆన్‌లైన్‌లో దీన్ని రెగ్యూలర్‌గా మెయింటేన్‌ చేస్తోంది. @onceupontheskin పేరుతో ఒక ఇన్‌ స్టాగ్రామ్‌ అకౌంట్‌ని మెయింటేన్‌ చేస్తోంది. ఇందులో ఆమె చర్మ రక్షణ, పోషణకు సంబంధించిన టిప్స్ ఇస్తోంది.

చర్మాన్ని ఎలా సురక్షితంగా, సౌందర్యవంతంగా ఉంచుకోవాలో ఆమె రెగ్యూలర్‌గా టిప్స్ ఇస్తోంది. అలాగే బ్యూటీ ప్రొడక్ట్ ల రివ్యూలు ఇస్తోంది. అయితే సినిమా ఫ్యామిలీలోకి వచ్చిన జైనబ్‌కు సినిమాలంటే పెద్దగా ఇష్టం లేదట. వాటిని చూడటం కూడా చాలా తక్కువే కావడం గమనార్హం.

A post shared by Zainab Ravdjee (@zainabravdjee)

అఖిల్ అక్కినేని భార్య జైనబ్ తన సొంత ఐడెంటిటీని సృష్టించుకోవడానికి కళ మరియు వెల్‌నెస్ రంగాలను ఎంచుకోవడం ఆమెకు ప్రత్యేకతను అందిస్తోంది. ప్రైవేట్ లైఫ్‌ను గౌరవించే ఆమె విధానం ఆమెకు మరింత ఆదరణను తెచ్చిపెడుతోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.