
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న ‘ప్యారడైజ్’ చిత్రంలో మోహన్ బాబు విలన్‌గా నటిస్తున్నారనే వార్తలు వైరల్‌గా వ్యాపిస్తున్నాయి. ‘కన్నప్ప’ డైరెక్టర్ ముకేష్ కుమార్ ఈ విషయాన్ని ధ్రువీకరించడంతో ఈ వార్తలు మరింత నమ్మదగినవిగా మారాయి.
Key Points
నాని ‘ప్యారడైజ్’ చిత్రంలో మోహన్ బాబు విలన్ పాత్ర పోషిస్తున్నారని వార్తలు.
‘కన్నప్ప’ డైరెక్టర్ ముకేష్ కుమార్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు.
మోహన్ బాబు పాత్ర ‘పవర్ ఫుల్’గా ఉంటుందని డైరెక్టర్ వ్యాఖ్య.
ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
మోహన్ బాబు ‘ప్యారడైజ్’లో విలన్‌గా?
నేచురల్ స్టార్ నాని(Nani) నటిస్తున్న తాజా చిత్రం ‘ప్యారడైజ్’(Paradise). శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. అనిరుధ్ రవిచందర్(Anirudh Ravichander) సంగీతం అందిస్తున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. కాగా ఈ సినిమా తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్, స్పానీష్ భాషల్లో వచ్చే ఏడాది మార్చి 26న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది.
డైరెక్టర్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్
ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో ప్రముఖ నటుడు మోహన్ బాబు(Mohan Babu) విలన్ పాత్ర పోషిస్తున్నారని గత కొన్ని రోజులుగా టాక్ వినిపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కన్నప్ప డైరెక్టర్ ముకేష్ కుమార్(Mukesh Kumar) నాని పారడైజ్ సినిమాలో విలన్ ఎవరో చెప్పేసాడు. విష్ణు ‘కన్నప్ప’(Kannappa) సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ముకేశ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. మోహన్ బాబు గారు నానికి ఆపోజిట్‌గా నటిస్తున్నారు. ఒక పవర్ ఫుల్ రోల్, నేను షూట్‌లో చూశాను. ఆయన ప్రజెన్స్ అద్భుతంగా ఉంటుంది’ అని చెప్పుకొచ్చారు.
మోహన్ బాబు పాత్ర ఎలా ఉంటుంది?
దీంతో ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ప్రస్తుతం నాని పారడైజ్ ఒకటే సినిమా చేస్తున్నాడు. అంటే మోహన్ బాబు ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్నాడని తెలుస్తుంది. మరి మోహన్ బాబుని ఈ సినిమాలో ఏ రేంజ్‌లో చూపిస్తారో, డైలాగ్ కింగ్ నెగిటివ్ షేడ్స్‌లో మరోసారి ఎలా కనిపిస్తారో అని ఆసక్తి నెలకొంది. అసలు మోహన్ బాబుని విలన్ గా తీసుకోవాలని డైరెక్టర్‌కి వచ్చిన ఆలోచనని అభినందిస్తున్నారు.
మోహన్ బాబు విలన్ పాత్రతో ‘ప్యారడైజ్’ సినిమాకు మరింత ఆసక్తి కలుగుతుందని అభిమానులు భావిస్తున్నారు. డైలాగ్ కింగ్ యొక్క నెగటివ్ షేడ్స్‌ను తెరపై చూడటానికి ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.


