
📌 Key Points
- అఖిల్, జైనబ్ రవ్జీ వివాహం ఇటీవల జూన్‌లో జరిగింది.
- జైనబ్ గర్భవతి అని, అఖిల్ తండ్రి కాబోతున్నాడని ఇటీవల వార్తలు వచ్చాయి.
- ఈ పుకార్లపై అక్కినేని ఫ్యామిలీ నుంచి ఎవరూ స్పందించలేదు.
- నాగార్జున దీనిపై మాట్లాడుతూ ‘సరైన సమయం వచ్చినప్పుడు తెలియజేస్తాను’ అని అన్నారు.
అక్కినేని అఖిల్ తండ్రి కాబోతున్నాడనే వార్తలు టాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ వార్తలపై అక్కినేని ఫ్యామిలీ మౌనం వహించగా, ఇటీవల నాగార్జున స్పందించారు. అఖిల్ తండ్రి కాబోవడంపై కింగ్ ఇచ్చిన సమాధానం మరింత ఆసక్తిని పెంచింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
అఖిల్-జైనబ్ వివాహం, ప్రగ్నెన్సీ వార్తలు
Nagarjuna : నాగార్జున రెండో తనయుడు, హీరో అక్కినేని అఖిల్ ఇటీవల జూన్ లో తన ప్రియురాలు జైనబ్ రవ్జీని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ జంట అప్పుడప్పుడు వెకేషన్ కి వెళ్తూ ఎయిర్ పోర్ట్ లో కనిపిస్తూ ఉంటారు. అఖిల్ – జైనబ్ జంట ఫొటోలు పెళ్లి సమయంలోను, తర్వాత వెకేషన్ ట్రిప్స్ నుంచి వైరల్ అయ్యాయి.(Nagarjuna)
అయితే కొన్ని రోజుల క్రితం జైనబ్ రవ్జీ ప్రగ్నెంట్ అయింది, తల్లి కాబోతుందని, అఖిల్ తండ్రి కాబోతున్నాడని వార్తలు వచ్చాయి. వీటిపై అఖిల్ కానీ, అక్కినేని ఫ్యామిలీ కానీ ఎవరూ స్పందించలేదు. తాజాగా దీనిపై నాగార్జున స్పందించాడు.
రూమర్స్‌పై నాగార్జున తొలి స్పందన
నాగార్జున ఓ హెల్త్ ఈవెంట్ కి వెళ్లగా అక్కడ ఓ మీడియా ప్రతినిధి.. మీరు తండ్రి నుంచి తాత గా ప్రమోట్ అవుతున్నారా అది నిజమేనా? సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి అని అడిగారు.
సస్పెన్స్ కొనసాగించిన కింగ్ కామెంట్స్
దీనికి నాగార్జున నవ్వేసి.. సరైన సమయం వచ్చినప్పుడు నేను మీకు తెలియజేస్తాను అని సమాధానమిచ్చారు. ఆ వార్తలను ఖండించకుండా టైం వచ్చినప్పుడు చెప్తాను అనడంతో అఖిల్ నిజంగానే తండ్రి కాబోతున్నాడా అని రూమర్ మరింత బలంగా వినిపిస్తుంది.
అఖిల్ తండ్రి కాబోతున్నాడా లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. నాగార్జున స్పందనతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. సరైన సమయం వచ్చినప్పుడు అక్కినేని ఫ్యామిలీ నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

