
అక్కినేని అఖిల్ మరియు జైనబ్ వివాహం శుక్రవారం వైభవంగా జరిగింది. నాగార్జున తనయుని పెళ్లి గురించి తన సంతోషాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ వివాహ వేడుక సినీ, రాజకీయ ప్రముఖులతో కళకళలాడింది.
Key Points
అఖిల్ అక్కినేని, జైనబ్ పెళ్లి వైభవంగా జరిగింది.
నాగార్జున తనయుని వివాహంపై ఎమోషనల్ పోస్ట్ చేశారు.
జూన్ 8న గ్రాండ్ రిసెప్షన్ వేడుక జరగనుంది.
అఖిల్, జైనబ్ వివాహ వైభవం
అక్కినేని ఫ్యామిలీ యువ వారసుడు అఖిల్ అక్కినేని వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. శుక్రవారం తెల్లవారుజామున అఖిల్, జైనబ్ మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. వీరిద్దరూ కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. గత ఏడాది నవంబర్ లో అఖిల్, జైనబ్ నిశ్చితార్థం ప్రైవేట్ వేడుకగా సింపుల్ గా జరిగింది.
కాగా శుక్రవారం జరిగిన వివాహ వేడుక వైభవంగా జరిగింది. సినీ రాజకీయ ప్రముఖులు అతిథులుగా హాజరై వధూవరులను ఆశీర్వదించారు. జూన్ 8న రిసెప్షన్ వేడుకని నాగార్జున ఇంకా గ్రాండ్ గా ప్లాన్ చేశారట. ఈ వేడుకకి టాలీవుడ్ మొత్తం హాజరు కానున్నట్లు టాక్. అదే విధంగా రాజకీయ ప్రముఖులు కూడా హాజరవుతారు.
నాగార్జున ఎమోషనల్ పోస్ట్
తాజాగా నాగార్జున అఖిల్ పెళ్లి ఫోటోలని అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా నాగార్జున ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. అఖిల్ పెళ్లి గురించి నాగార్జున సంతోషంలో ఎమోషనల్ కామెంట్స్ చేశారు.
నాగార్జున ట్విట్టర్ లో.. ‘నేను, అమల ఉప్పొంగే సంతోషంతో ఈ శుభవార్తని పంచుకుంటున్నాం. మా తనయుడు అఖిల్ అక్కినేని, జైనబ్ ఎంతో అందంగా జరిగిన వివాహ వేడుకతో ఒక్కటయ్యారు. మా ఇంట్లోనే ఈ వేడుక జరిగింది. అఖిల్ పెళ్లి వేడుకతో మా కల సాకారమైంది. కొత్త జంటకి మీ అందరి ఆశీర్వాదం కావాలి’ అని పేర్కొన్నారు.
జైనబ్ కుటుంబ నేపథ్యం
అఖిల్ వివాహం చేసుకున్న జైనబ్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమె తండ్రి జుల్ఫీ ఇండియాలో ప్రముఖ వ్యాపారవేత్తలలో ఒకరని తెలుస్తోంది. వ్యాపార రంగంలో నాగార్జునకి ఉన్న పరిచయాల కారణంగా జుల్ఫీ, అక్కినేని కుటుంబాల మధ్య సాన్నిహిత్యం ఏర్పడినట్లు తెలుస్తోంది. ఆ విధంగా ఒకరి గురించి ఒకరు తెలుసుకున్న అఖిల్, జైనబ్ ప్రేమలో పడ్డారు. ఇప్పుడు వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
అఖిల్ అక్కినేని మరియు జైనబ్ వివాహం అక్కినేని కుటుంబానికి, అభిమానులకు ఎంతో ఆనందాన్నిచ్చింది. జూన్ 8న జరిగే గ్రాండ్ రిసెప్షన్‌కు అందరూ ఎదురు చూస్తున్నారు.


