
📌 Key Points
- అఖిల్ నటించిన ఐదు సినిమాలు ఆశించిన విజయం సాధించలేదు.
- లెనిన్ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
- పోస్టర్ విడుదల చేసినా, గ్లింప్స్ విడుదల చేయకపోవడంతో అభిమానుల నిరాశ.
- అన్నపూర్ణ స్టూడియోస్ అఖిల్ సినిమాపై దృష్టి పెట్టడం లేదని అభిమానుల ఆగ్రహం.
అక్కినేని అఖిల్ నటించిన ‘లెనిన్’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, అఖిల్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ అభిమానులను నిరాశపరిచింది. సరైన అప్డేట్ లేకపోవడంతో అన్నపూర్ణ స్టూడియోస్ పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అఖిల్ కెరీర్ లో హిట్ కోసం ఎదురుచూపులు
Akhil Lenin: అక్కినేని అఖిల్ …అన్నీ ఉన్నాయ్ ఆ ఒక్కటి తప్ప అన్నట్టుగా డబ్బు,బ్యాక్ గ్రౌండ్,అందం ఇలా అన్నీ ఉన్నా సాలిడ్ హిట్ ఒక్కటంటే ఒక్కటీ లేకపోవడం ఈ కుర్ర హీరోకి పెద్ద లోటుగా మిగిలిపోయింది. అఖిల్ (2015), హలో (2017), మిస్టర్ మజ్ను (2019), మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ (2021) ఏజెంట్ (2023) అంటూ ఐదు సినిమాలు తీసినా ఇదీ సూపర్ హిట్ బొమ్మ అని చెప్పేందుకు ఒక్కటి కూడా లేదు.అయితే ఉన్నంతలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కాస్త బెటర్ అని చెప్పాలి.
ఓ పోస్టర్ వదిలి మమ అనిపించిన మూవీ టీమ్
దీంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలంటూ వినరో భాగ్యం విష్ణు కథ ఫేమ్ మురళీ కృష్ణ అబ్బూరు దర్శకత్వంలో లెనిన్ ని పట్టాలెక్కించాడు.ఇందులో మొదటగా శ్రీలీల ఆన్ బోర్డ్ అయినప్పటికీ ఆ తర్వాత బాగ్య శ్రీ బోర్సే వచ్చి చేరిన సంగతి తెలిసిందే. ఇక ఎన్నాళ్ళగానో సినిమా నుండి సాలిడ్ అప్ డేట్ వస్తుందని ఆశలు పెట్టుకున్న ఫ్యాన్స్ అయ్యగారి బర్త్ డే అయిన ఏప్రిల్ 8 కైనా వస్తుందని అనుకున్నారు.కానీ మీకా ఛాన్స్ ఇవ్వంగా అంటూ ఇదిగో ఇలా ఓ పోస్టర్ వదిలి మమ అనిపించింది మూవీ టీమ్.
లెనిన్ సినిమాపై అభిమానుల అంచనాలు
రాయలసీమ రౌడీయిజం అంటే ఆ మాత్రం ఉండాలి
గుబురు గడ్డం, మెడలో కండువా, చేతిలో ఎర్ర జెండా.. ఇవన్నీ ఒకెత్తయితే, కాళ్ళకున్న ఆ ‘పారగాన్’ చెప్పులు మరో ఎత్తు.చూస్తుంటే అఖిల్ ఈ సినిమాలో ఏదో గట్టిగానే ప్లాన్ చేశాడని పోస్టర్ చూస్తుంటేనే అర్థం అవుతుంది. దీంతో “రాయలసీమ రౌడీయిజం అంటే ఆ మాత్రం ఉండాలి మరి”కొందరు ఫ్యాన్స్ కామెంట్ చేస్తుంటే, బర్త్ డే రోజైనా మంచి గ్లిమ్ప్స్ వదలకుండా ఈ పోస్టర్స్ తో టైం పాస్ చేయడమేంటో అంటూ మేకర్స్ పై ఫైర్ అవుతున్నారు మరికొంత మంది ఫ్యాన్స్. అయితే ఏప్రిల్ 10న డెకాయిట్ రిలీజ్ ఉన్నందువల్లె లెనిన్ పై అన్నపూర్ణ స్టూడియోస్ అండ్ టీం సరిగ్గా కాన్సన్ ట్రేషన్ చేయలేదన్న టాక్ రావడంతో అడవి శేష్ ‘డెకాయిట్’ సినిమాకి ఇస్తున్న హైప్,ఇంట్రెస్ట్.. అఖిల్ సినిమాకి ఎందుకు ఇవ్వడం లేదన్నది అక్కినేని ఫ్యాన్స్ ని వేదిస్తున్నప్రశ్న.
రిలీజ్ డేట్ జూన్ 26 అని కన్ఫాం చేయడమే ఆశ్చర్యమే ..
అయితే ఊహించని విధంగా మేకర్స్ రిలీజ్ డేట్ జూన్ 26 అని కన్ఫాం చేయడమే కాస్త ఆశ్చర్యం. ఎందుకంటే అదే రోజు పెద్ది వస్తుందన్న రూమర్స్ గట్టిగా వినిపించాయ్. అంటే ఈ లెక్కన పెద్ది ఆ రోజు కూడా హ్యాండ్ ఇవ్వబోతుందన్న మాట.ఏది ఏమైనా రిలీజ్ దగ్గర పడుతున్న ఈ టైంలో కేవలం ఓ పోస్టర్ వదిలి సరిపెట్టుకోండి అన్నట్టుగా వ్యవహరించడం ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.
అన్నపూర్ణ స్టూడియోస్ పై అభిమానుల ఆగ్రహం
నీలో ఉన్న ఫైర్ అంటే నాకు ఇష్టం
ఇక సోషల్ మీడియాలో పోస్టర్ టాక్ ఇలా ఉంటె తన కొడుక్కి విష్ చేస్తూ.. “నీలో ఉన్న ఫైర్ అంటే నాకు ఇష్టం” అని ట్వీట్ వేసుకొచ్చాడు కింగ్ నాగ్ . ఏదేమైనా, అందాల భామ భాగ్యశ్రీ బోర్సే గ్లామర్.. అఖిల్ ఊర మాస్ మేకోవర్.. థమన్ మ్యూజిక్.. ఇవన్నీ చూస్తుంటే ‘లెనిన్’ బాక్సాఫీస్ దగ్గర జాతర చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అప్పటిదాకా మాత్రం ఈ పోస్టర్లే దిక్కయ్యేలా ఉన్నాయ్.చూడాలి మరి హిట్టే టార్గెట్ గా బరిలోకి దిగుతున్న అయ్యగారు జూన్ 26న థియేటర్లలో ఎలా రచ్చ చేస్తాడో !
మొత్తానికి అఖిల్ ‘లెనిన్’ సినిమా విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జూన్ 26న సినిమా విడుదల కానుండగా, అప్పటివరకు ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి.


